కోరికలు దు:ఖానికి హేతువులు....మహనీయులు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. దేనిమీద అయితే కోరిక కలిగి ఉన్నామో దానిని సాధించలేనపుడు దు:ఖం వస్తుంది. అది ఆగ్రహం గా మారుతుంది. మనిషి ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాడు. ఆక్షణంలో మరిన్ని తప్పులు చేస్తాడు. భగవద్గీతలో భగవానుడు బోధించినది కూడా ఇదే. కోరికలను జయించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలు జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు అవుతాయి. కనుక ముందుగా అరిషడ్వర్గాలను జయించగలగాలి. అట్టి స్థితిని సాధించిన వారు జ్ఞాన సంపన్నులవుతారు. యుక్తాయుక్త విచక్షణ కలిగిఉండాలి. ఏది ఎంతవరకు మనకు అవసరమో గ్రహించగలిగి ఉండాలి. పరుల సొమ్మును ఆశించకూడదు. పరుల సొమ్ముపై మనకు హక్కు ఎందుకు ఉంటుంది? మనకు లభించిన దానితో సంతృప్తి చెందే లక్షణం అలవాటు చేసుకోవాలి... సంతృప్తి ఉన్న చోట ఆశలకు, కోరికలకు, స్థానం లేదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి మార్గం ఇదే.
No comments:
Post a Comment