"అమ్మయ్య! నేనే గెలిచాను, ఇవాళ ఒక్కసారైనా కళ్ళుమూసుకోకుండా, చెవులు మూసుకోకుండా, ఒక్క సీన్ కూడా మిస్ చేయకుండా హారర్ సినిమా మొత్తం చూసేసా....అనుకున్న ప్రకారం, నా పార్టీ నాకిచ్చెయ్యండి" పిల్లలతో ఒక హారర్ మూవీ చూసిన తర్వాత నేనన్న మాటలు. హారర్ సినిమాలు అంటే చచ్చేంత భయం నాకు. దెయ్యాలు అవీ వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకుంటాను. పిల్లల దగ్గర లోకువ అవ్వకూడదని, (వాళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర్నుండి నన్ను పిరికి అని ఏడిపిస్తారని) సాధారణంగా దెయ్యాల సినిమాలకు వాళ్ళతో వెళ్ళడం తప్పించుకుంటాను. "నా మొహంలా ఉంది, నువ్వు చూసింది థియేటర్ లో కాదు, ఇంట్లో, అది కూడా సౌండ్ తగ్గించుకుని, దీనికి పార్టీ ఇవ్వడం కుదరదు," అని ఖరాఖండీ గా చెప్పేసాడు మా చిన్నవాడు. నిజమే కదా, థియేటర్ లో సౌండ్ ఎక్కువ పెట్టడం వల్లనే మనకు హారర్ సీన్లు వచ్చినప్పుడు ఎక్కువ భయం వేస్తుంది. పిల్లలకు కూడా అంతేనట. మనం వాళ్ళను తిట్టేటప్పుడో, కేకలేసేటప్పుడో, మనం గొంతు పెంచి గట్టిగా మాట్లాడడం, మన ముఖ కవళికలు చిరాగ్గా పెట్టడం వలననే వాళ్ళకు అవసరమైన దానికన్నా ఎక్కువ భయం వేస్తుందట. ఆ భయం ఒక్కోసారి మన మీద వాళ్ళకు నిరాసక్తతను కూడా కలుగచేస్తుంది అని ఒక సర్వే లో తెలిసింది. అంటే పిల్లలు కూడా ఆ టైం లో మనల్ని దెయ్యాలను చూసినట్టు చూస్తారేమో అని నాకు అనుమానం వచ్చింది.
దెయ్యాలంటే భయం ఎందుకమ్మా, అంతకు మించి హాని చేసేవాళ్ళు మనుషుల్లోనే ఉన్నారు, కంటికి కనబడని దెయ్యాల గురించి భయమేమిటీ అని సాగదీస్తాడు పెద్దవాడు. అసలు దెయ్యాలు అంటే చేస్తే మంచి చేస్తాయి, లేదంటే తప్పుకుని వెళ్ళిపోతాయి అంతే కాని చెడు చెయ్యవు కదా....వాడి ఉవాచ. వాడు దెయ్యాలకు వీరాభిమాని. వాడు చదివే పుస్తకాలు, చూసే వీడియోలు అన్నీ దెయ్యాల గురించే....వీలైతే దెయ్యాల గురించి రిసర్చ్ చెయ్యాలని ఉంది అంటాడు. విదేశల్లో అలా దెయ్యాల గురించి రిసర్చ్ చేసే గ్రూపులు ఉంటాయిట. వెళ్ళి వాటిల్లో చేరిపోతాను అంటాడు కాసేపు, దెయ్యాల మీద ప్రేమ ఎక్కువైనప్పుడు...చేస్తే చెయ్యి కాని, ఇంటికి మాత్రం తీసుకురాకు నాయనా, ఇప్పటికే మీ అందరితోనూ వేగలేకపోతున్నాను ...ఇది నా జవాబు...వేపుకుతినడంలో నిన్ను మించినదెవరూ తల్లి...మావారి సన్నాయి నొక్కులు.
నిజమే! మనుషుల కన్నా ప్రమాదకారులు, భయంకరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు లోకంలో ఎవరూ లేరేమో...ఒక్కోసారి కౄరమృగాలే నయం, వాటి జోలికి వెళ్ళకపోతే , అవి కూడా మనలని ఏమీ చెయ్యకుండా వాటిదారిన అవి పోతాయి. మనుషులు అలా కాదే! పక్కవాడి ఉన్నతిని, సుఖాన్ని, సౌఖ్యాన్ని సహించలేరు. పక్కవాళ్ళని విమర్శించడంలో, వారి చెడు కోరుకోవడంలో కొంతమందికి ఎంత ఆనందమో...అటువంటి వారు, గతంలోనూ, వర్తమానం లోనూ కూడా జీవించలేరు. భవిష్యత్తు అగమ్యగోచరమే కదా!
భగవంతుడు ఎవరికి తగిన సుఖాలు వారికి ఇచ్చాడు. ప్రపంచం లో ఎవ్వరికీ పూర్తి సుఖాన్ని కాని, పూర్తి దు:ఖాన్ని కాని ఇవ్వలేదు. అందరికి కష్ట సుఖాలను కలిపే ఇస్తాడు. దాసరి నారాయణ రావు సినిమాలో లాగా, ఉన్న సుఖాన్ని దు:ఖంగా, వచ్చిన కష్టాన్ని సుఖంగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. మన బుధ్ధి సవ్యంగా ఉండి, మనసు ప్రశాంతంగా ఉంటే సరి అయిన ఆలోచనలు వస్తాయి, మన ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరుచుకుని, జీవితాన్ని హాయిగా గడపగల అవకాశం మనకుంది. దెయ్యాల కన్నా చెడుగా ఆలోచించి, పక్కవాడి నాశనమే ఎప్పుడూ కోరుకునేవాళ్ళకి ఎప్పుడూ సుఖం ఉండదు.

No comments:
Post a Comment