Sunday, 15 June 2014
రామనామ సంకీర్తన 4
రామనామము రామనామము రమ్యమైనది రామనామము
పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము
నిజ స్వరూపము బోధకంబగు తారకము శ్రీ రామనామము
రజితగిరి పతికినేప్పుడు రమ్యమైనది రామనామము
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామనామము
సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే రామనామము
అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీ రామనామము
అల కుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము
ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది రామనామము
అత్మతపమును సల్పువారికి ఆత్మ యజ్ఞము రామనామము
కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీ రామ నామము
జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము
చిత్త శాంతిని కలుగ చేసేది చిత్స్వరూపము రామనామము
చావు పుటుకలు లేని పరమ పదమై వెలయుచున్నది రామనామము
ముక్తి రుక్మాంగదున కొసగిన మూలమంత్రము రామనామము
మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే రామనామము
మొహమను మంత్రార్ధ విధులకు సోమపానము రామనామము
చూపు మానస మొక్కటై చూడవలసినది రామనామము
త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞానజ్యోతియే శ్రీ రామనామము
దూరద్రుష్టియే లేనివారికి దుర్లభము రామనామము
బంధ రహిత విముక్తి పధమగు మూలమంత్రము శ్రీ రామనామము
(ఇంకా ఉంది )

Friday, 6 June 2014
పార్టీల్లో లేదా ఫంక్షన్స్ లో ఎంతమంది ఉన్నా, అందరి దృష్టి ఇద్దరు ముగ్గురి మిద ఉంటుంది. వాళ్ళే ఆ పార్టీ కి కేంద్ర బిందువులా ఉంటారు. వారి చుట్టూ ఒక విధమైన చైతన్యం, ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటాయి. వారిలో ఏదో ఒక ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏమిటో చెప్పలేము. వారి ప్రభావం మాత్రం ఖచ్చితంగా అందరి మిద ఉంటుంది.
ఇలా ఒక గుంపులో అందరి మీద ప్రభావం చూపించే వ్యక్తులలో అందం, ఆకర్షణ, మాటతీరు, హుందాతనం, ప్రవర్తన, ప్రతిభా పాటవాలు ఇవన్ని లేదా కొన్ని లక్షణాలు ఉండవచ్చు.
కొంతమంది నలుగురినీ ఆకర్షించే అందం, ముఖ సౌందర్యం కలిగి ఉన్నా, అదొక్కటే ప్రభావితం చేయడానికి సరిపోదు. నిటారుగా , ఆత్మవిశ్వాసం తో నడవడం, ఖరీదైన వస్త్రాలు ధరించక పోయినా, చక్కగా శరీరానికి నప్పే దుస్తులు ధరించడం, ( అన్ని ఫేషన్లు అందరికీ నప్పవు. అది గమనించుకొని మన వస్త్ర ధారణా ఉండాలి. ) శరీర నిర్మాణానికీ, దుస్తులకూ నప్పే విధంగా నగలు అలంకరించు కోవటం, చక్కటి హెయిర్ స్టైల్, తగినంతగా అలంకరణ ఇవన్ని అందాన్ని, ఆకర్షణను ఇనుమడింప చేసేవే. అందరికీ శరీర నిర్మాణం, ముఖ సౌందర్యం చక్కగా లేకపోయినా, బయటకు కనిపించే తీరు, మన స్వభావం, మాటతీరు చక్కగా ఉంటె గుర్తింపు అధికంగా ఉంటుంది.
ఇతరుల వద్ద మనం గుర్తింపు పొందడానికి ముఖ్యమైన కారణం మన మాట తీరు. చక్కని చిరునవ్వు, చక్కగా చిన్న, పెద్ద అందరిని పలకరించడం, వయసులో పెద్ద వారికి నమస్కరించడం, వారి పట్ల గౌరవ భావం తో ఉండడం, ఇటువంటివి మనకు వెంటనే గుర్తింపు తెస్తాయి. పార్టీ కి పిలిచినా వారితోనే కాకుండా, వచ్చిన మిగతా అతిధులను కూడా చక్కగా పలకరించడం, వారి యోగ క్షేమాలు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కోవడం ఎంతో బాగుంటుంది. అతిథులలో ఎవరితో అయినా మనకు బేధాభిప్రాయాలు ఉన్నా , అవి బయట పడనీయకుండా వారితో కూడా అవసరానికి నవ్వుతూ మాట్లాడాలి. వారి గురించి ప్రక్క వారితో చులకనగా మాట్లాడడం, వ్యంగ్యమైన మాటలు విసరడం ఇటువంటివి మన ప్రవర్తనను దిగజారుస్తాయి. ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సూటిగా స్పష్టంగా, వినేవారికి చక్కగా అర్ధం అయ్యేలా, స్పుటమైన గొంతుతో మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడడానికి భయంగా ఉన్నపుడు మనకు బాగా తెలిసిన వాళ్లతో కొంచెం సేపు మాట్లాడి అపుడు కొత్త వారితో మాట్లాడాలి. మాటల్లో, అతిశయం, పిల్లల చదువుల గురించో, కొత్తగా కొన్న ఆస్తి గురించో గర్వం ఉండకూడదు.అన్నీ నాకే తెలుసు అన్నట్లు మాట్లాడడం, నా మాటే చెల్లాలి అన్నట్టు మాట్లాడడం తగదు. మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళకు వినసొంపుగా ఉండాలి. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు మనం కూడా శ్రద్ధగా వినాలి. ఏదో చెప్పావులే, నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అన్నట్టు వినకూడదు. మన హావభావాలు కూడా సంస్కారంతో ఉండాలి. అలాగే దూరంగా ఉన్నవారి గురించి చాడీలు చెప్పడం, నెగటివ్ గా మాట్లాడడం మన సంస్కార లేమిని తెలియజేస్తాయి.
గోళ్ళు కొరకడం, తల గోక్కోవడం, మాటిమాటికీ ఊత పదాలు వాడడం, పక్క వాళ్లకు చిరాకు తెప్పిస్తాయి. ఆహారం తీసుకునే విషయం లో కూడా, మొదట్లోనే ఎక్కువ వడ్డించు కోకుండా అన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి బాగా నచ్చినది మరి కొంచెం వడ్డించుకోవాలి. ముందే ఎక్కువ తీసుకుని పళ్ళెం లో వృధా చేయడం సరికాదు. అలాగే తినేటప్పుడు శబ్దం చేస్తూ తినడం, ప్రతి పదార్ధానికీ వ్యాఖ్యలు చేస్తూ తినడం సరికాదు.
మనకు గానం, నృత్యం ఇటువంటి వాటిల్లో ప్రవేశం ఉన్నపుడు ఎవరైనా అడిగిన వెంటనే పాడాలి. మొహమాటం ఉంటె సున్నితంగా తిరస్కరించాలి. అంతే కానీ, ఎక్కువ సేపు బ్రతిమాలించు కోవడం, ఆఖరికి పాడడం, ఇలా చేయకూడదు. మరోసారి మీ మీద వారు దృష్టి పెట్టరు.
చిన్న పిల్లలను పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకేల్లినపుడు వారు కూడా అందరితో కలుపు గోలుగా, స్నేహంగా ఉండేటట్టు ఇంటివద్దనే అలవాటు చేయాలి. వారికీ కూడా అందరినీ పలకరించడం నేర్పాలి. ఏదో ఒక విషయం గురించి, మొండి పట్టు పట్టడం, మిగిలిన పిల్లలతో పోట్లాడడం, ఇటువంటివి జరిగినపుడు పెద్దలు సున్నితంగా వ్యవహరించాల్లి. పిల్లల్లో ఎవరిదో ఒకరిదే తప్పు అని నిర్ణయిన్చాకుండా అందరికీ సర్ది చెప్పాలి.
ఈ విధంగా చేస్తే, పార్టీల్లో, మీరు అందరికీ కేంద్ర బిందువై, అందరి మన్ననలు పొందుతారు. ఏమంటారు?

Friday, 16 May 2014
ఈ మధ్య అదేదో సినిమాలో " దేశం లో ఎవరితో పెట్టుకున్నా, ఏ భాష వాడితో పెట్టుకున్నా ఆంధ్ర వాడితో, తెలుగు వాడితో పెట్టుకోవద్దు" అని యముడు తన కుమారుడికి చెప్తాడు. సోనియా ఆ సినిమా చూసుంటే బాగుండేది. . రాష్ట్ర విభజన తో కడుపు మండిన ఆంధ్ర వోటరు ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాకుండా చేసాడు. వోటర్లు వెర్రి గొర్రెలు అనుకునే రా.కీ.నా. లకు చుక్కలు చూపించాడు. ఆంధ్ర వాడి సత్తా ఏమిటో దేశానికి తెలిసేలా చేసాడు. కాంగ్రెస్ కు చెందినా ఏ ప్రముఖ వ్యక్తీ కుడా బరిలో గెలవలేక పోయాడు. సామాన్యుడు సామాన్యుడు అని అనుకున్న వోటరు అసామాన్య తెలివి తేటలు చూపించి తనకు ఏమి కావాలో, ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నాడో స్పష్టం చేసాడు. ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు అయినా ప్రజల వైపు నుంచి అలోచించి పాలిస్తేనే వాటికీ మనుగడ.
Thursday, 15 May 2014
ఆ రోజుల్లో.....7
ఎన్నికలు.....ఫలితాలు...
మాకు బాగా ఊహ తెలిసిన తరువాత వచ్చిన ఎన్నికలు 1984. అప్పుడు కొత్తగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మా పెద్దవాళ్ళు అందరు కాంగ్రెస్ కు కాకుండా తెలుగు దేశం పార్టీ గెలవడం జీర్ణించు కోలేక పోయారు. మాకు మాత్రం సంతోషం. అయితే ఈ ఎన్నికలు, ఫలితాలు వచ్చినపుడు మాకు ఇంకో విధంగా ఆనందంగా ఉండేది. అప్పుడు టీవీ లు లేవుకదా, అన్నిటికీ రేడియో నే ఆధారం. ప్రతి పావుగంటకు ఎలక్షన్ బులెటిన్ వచ్చేది. మిగిలిన ప్రోగ్రాములు అరగంట నిడివి లో ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల స్పెషల్ బులెటిన్ మధ్యలో రెగ్యులర్ ప్రోగ్రాములు వేయడానికి అవకాసం ఉండదు. అందుకని బులెటిన్ మధ్యలో మీరా భజన్స్, తులసి దాస్ భజన్స్, లలిత గీతాలు, జానపద గీతాలు వంటివి వేసేవారు. మా సంబరం అందుకు. అవి నేర్చుకోవడానికి మాకు అది చక్కటి అవకాశం. పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకొని ఆ పాట వస్తున్నంత సేపు చక చక వ్రాసుకునే వాళ్ళం. దాంతో పాటే ట్యూన్ కుడా నేర్చుకోవాలి. వినేవాళ్ళకు ఇది అతిశయోక్తి గా అనిపించవచ్చు కానీ, మేము ఎన్నో పాటలు, లలిత గీతాలు అలాగే నేర్చుకొన్నాము. అలాగే బులెటిన్ లో ఎవరు ఎప్పుడు ఆధిక్యం లో ఉన్నారు?, ఎన్ని స్థానాల్లో గెలుపొందారు? వంటివి ప్రతి పావుగంటకి , ప్రతి బులెటిన్ విశేషాలు టైం తో సహా నోట్ చేసుకునేవాళ్ళం.
అలాగే, భారత్ లోను, దాని మిత్ర దేశాల లోను ప్రముఖులు చనిపోయినపుడు సంతాప దినాలు 3 రోజులు పాటించే వారు. రేడియో లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ఉండేవి కావు. అప్పుడు కూడా ఈ భజనలు, గీతాలు వేసేవారు. ఒక్కోసారి అయితే ఈ పాటల కోసం స్కూలు మానేసే వాళ్ళం . ఆయతుల్లా ఖోమైనీ చనిపోయినపుడు 2 తులసి దాస్ భజనలు, ఒక మీరా భజన్ నేర్చుకున్నా నేను. వినాయక చవితి పందిళ్ళలో, అయ్యప్ప స్వామి భజన లలో పెట్టే భక్తీ పాటలు కూడా అలాగే నేర్చుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే, ఆ పందిళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కేసెట్ వివరాలు అడిగి తెలుసుకొని, కొనుక్కోవడం, లేదా ఒకటో, రెండో తెలియని పాటలు ఉంటె, ఆ పందిళ్ళ వాళ్ళని బ్రతిమాలి ఆ కేసెట్ తెచ్చుకొని ఆ రెండు పాటలు ఒకటి రెండు గంటల్లో నేర్చుకొని వాళ్ళకు ఇచ్చేయడం. కనీ మేము ఈ రకంగా నేర్చుకుంటున్నాము అని మా ప్రత్యర్ధులకు తెలియనిచ్చే వాళ్ళం కాదు. అదో దేవరహస్యం. ఈ రకంగా మేము ఎలక్షన్ బులెటిన్ లు, సంతాప దినాలు, పండుగలలో పందిళ్ళు, అన్నీ మా కోసం ఉపయోగించేసుకునే వాళ్ళం.

Wednesday, 14 May 2014
మా రోజుల్లో.....6
మా దూరదర్శన్ క(వ్య)ధలు......
ఈరోజుల్లో డిష్ లు, 150, 200 కు మించి ఛానల్స్ చూసే పిల్లలకు మేము ఒకటే ఒక ఛానల్ అందునా ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే పనిచేసే ఛానల్ చూసేవాళ్ళము అంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. 1980 లలో దూరదర్శన్ హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలలో కుడా ప్రసారాలు మొదలు పెట్టింది. రిలే ద్వారా డిల్లీ నుంచి మాత్రమే కొన్నాళ్ళు ప్రసారాలు వచ్చేవి, అవి కుడా కేవలం హిందీ భాషలో. కొత్త ఒక వింత కదా, అర్ధం అయినా అవకపోయినా అవే చూసేవాళ్ళం. అందులోను, టీవీ చూడడం అలవాటు అయిపోతే యింక వదలలేరు , అదొక జాడ్యం లా పట్టుకుంటుంది అనే పెద్దవాళ్ళ భయం తోటి మాకు ఒక టైం లిమిట్ ఉండేది టీవీ చూడడానికి. యింక ఆ టైం లో ఏ ప్రోగ్రాం వచ్చినా చుసేసేవాళ్ళం. అది జైకిసాన్ అయినా, కవి సమ్మేళనం అయినా, ( కవి సమ్మేళనాలు ఎక్కువగా ఉర్దూ భాషలో వచ్చేవి. అవి కుడా వదిలేవాళ్ళం కాదు.) ఆరోజుల్లో వీధికి ఒక టీవీ ఉంటె గొప్ప. వీధిలోని పిల్లలు అందరూ తొందరగా హోం వర్కులు, చదువు పూర్తి చేసుకుని 6,7 గంటల కల్లా టీవీ ఉన్న ఇంటికి చేరేవారు. యింక ఆ వచ్చే కార్యక్రమాలు అర్ధం అయినా, అవ్వకపోయినా గుడ్డిగా చుసేయటం. వారానికి రెండు సార్లు వచ్చే హిందీ గీతాల కార్యక్రమం "చిత్రహార్" కు ఇల్లు హౌస్ ఫుల్. ఆదివారం సాయంత్రం మాత్రం తెలుగు సినిమా వచ్చేది . అప్పుడూ ఇల్లు హౌస్ ఫుల్లే. ఆ వీధి లో మాది టీవీ ఉన్న రెండో ఇల్లు. ఆదివారం వచ్చే తెలుగు సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల కోసం మేము ఆదివారం బయటకు వెళ్ళే ప్రోగ్రాం కుడా వాయిదా వేసుకునే వాళ్ళం. హిందీ వార్తలు కూడా చుసేసే వాళ్ళం.
కొన్నాళ్ళ తర్వాత రోజుకు అరగంట తెలుగు ప్రసారాలు ఇచ్చేవారు. 10 నిముషాలు రైతుల కోసం, 10 నిముషాలు ఏదైనా డాక్యుమెంటరీ లాగా ఇచ్చి, ఆఖరి పది నిముషాలు ఏదో ఒక నాటిక ఇచ్చేవారు. లేదా హాస్య కార్యక్రమం ఉండేది. ఆ ఆఖరి పది నిముషాల ఎంటర్టైన్మెంట్ కోసం ముందు 20 నిముషాలు భరించేవాళ్ళం. ఆ అరగంటా చదువుకు సెలవు. అప్పట్లో కార్టూన్లు వచ్చినట్లుగానే, రైతుల కోసం ప్రోగ్రాం లో ఎప్పుడూ, పందుల పెంపకం, ఈము పక్షుల పెంపకం, సుబాబుల్ చెట్ల పెంపకం,... డాక్యుమెంటరీ లో పొగ లేని పొయ్యిల తయారీ , మహారాష్ట్ర లోని పిమ్పాల్ బట్టి అనే గ్రామం లో సౌర వ్యవస్థ ద్వారా పూర్తిగా గ్రామ విద్యుదీకరణ గురించి, ఇవే చెప్పేవాళ్ళు. చూసి, చూసి, మాకు అవి నోటికి వచ్చేసేవి. నేటి మేటి హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం గారు ఆ అరగంట తెలుగు కార్యక్రమం లోనే మా అందరికీ పరిచయం. కితకితలు అనే ప్రోగ్రాం ద్వార అయన మిమిక్రి చేసేవారు. ఇక ఈనాటి ప్రముఖ ఏంకర్లు సుమ, ఝాన్సీ, వంటి వారు తొలిసారిగా బుల్లితెరకు పరిచయం అయిన సీరియల్ కూడా అప్పుట్లో మొదలు అయ్యింది. న్యూస్ రీడర్స్ శాంతి స్వరూప్, రోజారాణి, కనక దుర్గ, రేవతి వంటి వారు మా ఇంటి సభ్యుల్ల అయిపోయారు. ఈ మధ్య ఏదో పుస్తకం లో రోజారాణి గారు స్వర్గస్తులయ్యారు అని చదివి చాల బాధ కలిగింది.
ప్రతి గురువారం ప్రాంతీయ భాషా చలన చిత్రాలు వేసే వారు. ఇవికూడా డిల్లీ నుంచే వచ్చేవి. కింద ఇంగ్లీషు సబ్ టైటిల్ తో. కొన్నాళ్ళకు ప్రతి శుక్రవారం తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం "చిత్రలహరి" వచ్చేది. ఆరోజు కూడా ఇల్లు ఫుల్లే.
కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో టీవీ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు కానీ, మేము మాత్రం హిందీ భాషనూ టీవీ ద్వారానే నేర్చుకున్నాము. ఇది అతిశయోక్తి కాదు. ఉర్దూ కవి సమ్మేళనాలు కూడా చూడడం వల్ల ఉర్దూ భాష లోని అందం, ఆ భాష పలుకడం లోని మెళకువలు తెలుసుకున్నాం. ప్రతి నెలా మొదటి తారీకున భారత్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, (సార్క్) దేశాల నుంచి కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. వాటి నుంచి ఆ యా దేశాల సంస్కృతీ, సంప్రదాయాలు, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ యా దేశాల కల్చరల్ heritage , వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. మేము హిందీ ప్రోగ్రాం లు చూసి హిందీ మాట్లాడడం నేర్చుకున్నాం కాబట్టి, మా ఉచ్చారణలో దక్షిణ భారత యాస కనబడదు. subtitles తో ప్రాంతీయ భాష చిత్రాలు చూసాము కాబట్టి, ఇంగ్లీషు కూడా మేము టీవీ ద్వారానే నేర్చుకున్నాము అని చెప్పాలి. అలాగే ఆ చిత్రాలు చూడడం వలన ఆ యా రాష్ట్రాల కల్చరల్ heritage గురించి తెలుసుకున్నాము. అప్పట్లో ప్రసారం అయిన సురభి కార్యక్రమం ద్వారా ఎంతో జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాము. అలాగే, రంగోలి, చిత్రహార్ ద్వారా గుల్జార్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖ రచయితల రచనా శైలి తెలుసుకున్నాము. టీవీ మాధ్యమం ద్వారా మేము మంచే నేర్చుకున్నాము కానీ, చెడిపోలేదు.
వీధిలోని పిల్లలు అందరూ టీవీ చూడడానికి ఒకచోటకు చేరేవారు అని చెప్పా కదా, ఇందులో ఎవరి పుట్టిన రోజులు అయినా, ఎవరైనా పరీక్షలు పాస్ అయినా, ఆ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగేది. అసలు అప్పటి నుంచే ట్రీట్ ఇవ్వడం అనేది అలవాటు అయింది అందరికి. అంతవరకు అలాంటివి చిన్న చిన్న ఊళ్ళల్లో అలవాటు లేదు. తరువాత తరువాత అందరి ఇళ్ళల్లోను టీవీలు వచ్చేసాయి. మనుషుల మధ్య దూరం పెరిగి పోయింది. ఈ 24 గంటలు చానల్స్ వచ్చాక అన్ని సినిమా ఆధారిత కార్యక్రమాలే. చూడడానికి, నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు. ఇప్పటి ఏంకర్ల భాష మరీ ఘోరం, ఎంత తక్కువ చెప్పుకుటే అంత మంచిది.
>>>>> మీలో ఎంతమందికి, పొగ లేని పొయ్యిలు, ( స్మోక్ లెస్ చుల్హ ), పిమ్పాల్ బట్టి గ్రామం గురించి గుర్తు ఉంది,? గుర్తు ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఏదో సరదాకి.

Tuesday, 13 May 2014
ఆరోజుల్లో..... 5
మా వేసవికాలం సెలవులు.....
మా వేసవి సెలవుల సందడి పరీక్షల చివరి రోజు నుంచే మొదలయ్యేది. కానీ ఆఖరి పరీక్ష వ్రాసి వచ్చిన రోజు ఏమి తోచేది కాదు. మరునాడు ఉదయాన్నే కుర్చుని సగం వ్రాసి ఉన్న నోటు పుస్తకాల నుంచి ఖాళీ కాగితాలు తీసి, వాటిని మరుసటి సంవత్సరానికి చిత్తు పుస్తకాలుగా కుట్టుకునే వాళ్ళం. పరీక్షల ముందరే మా పై క్లాసు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకుని పరీక్షల మరునాడు వాళ్ళ దగ్గరి నుంచి టెక్స్ట్ పుస్తకాలూ తెచ్చుకుని వాటిని కొంచెం రిపేరు చేసుకుని మరుసటి సంవత్సరానికి తయారుగా ఉండేవాళ్ళం. మేము చదివిన టెక్స్ట్ పుస్తకాలు ఎవరికైనా ఇచ్చేయడం కుడా ఆరోజే. వాడేసిన నోటు పుస్తకాలు తూకానికి అమ్మేయడం. ఎవరైనా కావాలంటే ఇచ్చేయడం అన్ని ఆరోజే. లేట్ చేస్తే మళ్లీ మర్నాటి నుంచి ఆడుకునే టైం తగ్గిపోతుంది కదా....
ఇంకా మరుసటి రోజు నుంచి మా ప్రతాపం మొదలు. స్కూలు ఉన్నరోజుల్లోను, లేనప్పుడు కూడా తెల్లవారి 4,5 గంటలకే లేచేవాళ్ళం. సెలవలలో కుడా 5 కి లేచి పనులు అన్నీ ముగించుకుని , అన్నం తినేసి 7 కల్లా లైబ్రరీ కి వెళ్ళిపోయే వాళ్ళం. మళ్లీ 11కి వాళ్ళు మేము మూసేస్తున్నాము మీరు వెళ్లి రండి అనేంత వరకు అక్కడే కుర్చుని, పాత చందమామలు, ఇంకా చిన్న పిల్లల పుస్తకాలు చదవడమే. వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. మధ్యాహ్నం పడుకోవడం ఆ తరం లో నిషేధం. అందుకని మధ్యాహ్నం ఎండవేళ ఇంట్లో కుర్చుని ఆడుకునే ఆటలు చదరంగం. అష్టా చెమ్మా, చింతపిక్కలు, ఇవ్వన్ని. మళ్లీ 4 గంటలకల్లా లైబ్రరీ కి తయారు. మళ్లీ 7కి వాళ్ళు మా మొహం మీదే తలుపులు వేసేదాకా ఉండి కొన్ని పుస్తకాలూ ఇంటికి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చి మళ్లీ అవి చదువుకోవడం. అప్పట్లో టీవీ లు లేవు కదా.....రేడియో లో వచ్చే ప్రోగ్రాములు విని రాత్రి 9కల్లా పడుకొని మళ్లీ 4 కు లేవడం. ఇదీ మా దినచర్య.
పరిక్షలు ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి అనగా మా అమ్మగారు చిన్న నోటు పుస్తకం లో హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, నిత్య ప్రార్ధనా శ్లోకాలు ఇటువంటివి వ్రాసి రెడీ చేసే వారు. సెలవులు మొదటి రోజు నుంచి ఆ 50 రోజుల్లోనూ అవి అన్ని నేర్చుకోవాలి అన్నమాట. ఏరోజు చదవక పోయినా బడితె పూజే. తప్పించుకునే వీలు లేదు. అలాగే, రామాయణం, భాగవతం వచనం లో చదివించే వారు. మధ్యాహ్నం ఖాలీ ఉన్నపుడు అవి చదవ వలసినదే. అందులో ఎక్కడ ప్రశ్న అడిగినా చెప్పాల్సిందే. ఇంట్లో అంత క్రమశిక్షణ ఉండేది. ముద్దు చేసే చోట ముద్దు చేయడం, చేతికి పని చెప్పాల్సిన చోట చెప్పడం. ఇది ఆ రోజుల్లో పెంపకం తీరు. రెంటికీ కొరత ఉండేది కాదు.
మా లైబ్రరీ అలవాటు ఏ ఊరు వెళ్ళినా మారేది కాదు. సెలవులలో అమ్మమ్మగారి ఊరు వెళ్ళినా, ఇంకెక్కడికి సరదాగా వెళ్ళినా లైబ్రరీ షెడ్యులు మాత్రం మారేది కాదు. సంవత్సరం అంతా బడికి వెళ్లి వచ్చిన తర్వాత రోజూ ఆడుకునే వాళ్ళం కాబట్టి సెలవులలో ఆడుకోవాలి అనే తాపత్రయం ఉండేది కాదు.
స్కూలు ఉన్న రోజుల్లో కూడా సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చి, టిఫిన్ తినేసి, హాయిగా 2,3 గంటలు ఆడుకునే వాళ్ళం. ఆ తరువాత స్నానం, చదువు. తెల్లవారి లేచి సంగీత సాధన, ఇంటి పనులు మాములే. ఎంత పెద్ద క్లాసులో ఉన్నా,,వార్షిక పరీక్షలు అయినా, ఇంటి పనికి డుమ్మా కొట్టడానికి వీలు లేదు. పని నేర్చుకోక పొతే ఎలా అని కేకలేసేవారు.
మా చిన్నతనం లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే ఇప్పటిలా వేడి వేడి టిఫీనులు కాదు. చద్దన్నం లో ఇంత చింతకాయ పచ్చడో, మరేదైనా ఊరగాయో, వేసుకుని, పెరుగు వేసుకుని తినేయడమే. మళ్లీ మధ్యాహ్నం వంట అయ్యేవరకు పెద్దవాళ్ళని నస పెట్టకుండా మా ఆటలు మావి. సైకిల్ తొక్కడం, ఎవరి ఇంట్లో అయినా పెద్ద పెద్ద చెట్లు ఉంటె ఉయ్యాలా కట్టుకోవడం, వీధంతా మా సందడే. ఎవరి ఇంట్లో అయినా గోరింటాకు చెట్టో, దబ్బ చెట్టో ఉంటె, మా లోని కోతులు నిద్ర లేచేవి. నామకః వారి అనుమతి తీసుకోవడం, చెట్టు అంత దులిపి పారేయడం. దబ్బ ఆకులు పలుచని మజ్జిగ లో వేసి ఉప్పు, జీలకర్ర వేసుకొని తాగితే ఎండ దెబ్బ తగలదు. గోరింటాకు చెట్టు ఉన్నవాళ్ళు కోసుకోవడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తీరా అంతా కోశాక, సగమే ఇచ్చేవారు. మిగతాది వాళ్ళే ఉన్చేసుకునే వారు. అప్పుడు చూడాలి మా ఉక్రోషం. ఆ గోరింటాకు రుబ్బదానికి కూడా వంతులే. ఎందుకంటే రుబ్బే వారికీ కుడి అరచేయి అంతా పండుతుంది కదా....
ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే అదోరకం సందడి. ఇల్లంతా గోల గోల. మాకు అన్నం తినడం లో ఒక రాయితీ ఉండేది. మాతో పెట్టుకుంటే తొందరగా అవదని పెద్ద వాళ్ళు అందరికి అన్నం కలిపి చేతిలో ముద్దలు పెట్టేసేవారు. అలా తినడం చాలా సరదాగా ఉండేది.
మళ్లీ స్కూళ్ళు తెరవడానికి 20 రోజుల ముందు నుంచి పై క్లాసుల పుస్తకాలూ చదవ వలసినదే. స్కూళ్ళు తెరిచేసరికి సగం సిలబసు వచ్చేసి ఉండాలి. అందులో పాఠాలు అర్ధం కాలేదనుకోండి, ఆ వీధిలో ఎవడో అన్నయ్యో, అక్కో ఉంటారు కదా పెద్ద క్లాసులు చదివే వాళ్ళు, వాళ్ళ దగ్గర చెప్పిన్చుకోవలసినదే. ఆ అన్నో, అక్కో వీక్లీ రిపోర్ట్ ఇవ్వడం, మేము ఎలా చదువుతున్నామా అని. అప్పట్లో అదో పెద్ద నస అని భావించే వాళ్ళం.
మాకు వేరే సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉండేవి కాదు. ఏవి నేర్చుకోవాలన్నా ఇంట్లోనే. కుట్లు, అల్లికలు, వంటలు, ముగ్గులు, డ్రాయింగ్, అన్నీ. ఆడుతూ, పాడుతూ చదువుకోవడం. కడుపు నిండా తినడం, చేతి నిండా పని చేయడం. అవే మాకు తెలిసిన సూత్రాలు.
(సశేషం)

Subscribe to:
Posts (Atom)