Friday, 1 May 2015

కార్తీక మాస ప్రాశస్త్యం:

మన సంప్రదాయంలో కార్తీకమాసానికి ఎంతో విశిష్త ఉంది. ఈ మాసాన చేసే భగవత్పూజలు, వ్రతాలు, స్నానాలు, దీపారాధనలు గొప్ప ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఈనెలలో విష్ణువు "దామోదర" నామంతో పూజింపబడతాడు. అందువల్ల ఈ మాసాన ఏ సత్కార్యం చేసినా, "కార్తీక దామోదర ప్రీత్యర్ధం" అని సంకల్పించి చేయాలి. ఈ మాసముతో సమానమైన మాసము లేదంటూ అత్రి మహర్షి, అగస్త్యునితో చెప్పాదు. ఈ నెలరోజులు, రోజుకొక అధ్యాయం చొప్పున కార్తీక మహాత్మ్యం పఠనం, శ్రవణం భారతావని అంతా జరుగుతుంది. నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామపూజ, దైవపూజ, వనభోజనములు, కార్తీక మాసంలో నిర్వర్తించవలసిన ముఖ్య విధులుగా చెప్పబడుతున్నాయి.

నెలలొ పూర్ణిమ నాడు ఏ నక్షత్రం దగ్గరగా చంద్రుడు ఉంటే ఆ నెలకు ఆ నక్ష్త్రం పేరు రావడం మన ఖగోళ మాన సంప్రదాయం. ఈ పధ్ధతి ప్రకారం శర్దృతువులో చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాదు. అందుకే ఇది కార్తీక మాసం.

కృత్తికా నక్ష్త్రం ఆరు నక్షత్రాల కూటమి.ఇది దర్భ పొదల మాదిరిగా ఉంటుంది. శివుని వీర్యం నీటిలో పడి ఈపొదల మధ్య చిక్కుకోగా ఆరుగురు కృత్తికలు కల్లిసి దాన్ని ఏకం చేసి బిడ్డగా పెంచినట్టు పురాణ కథ. అతడే కార్తికేయుడు, అయ్యాడు. తారకాసుర సంహారం చేసాడు. ఈ విధంగా కృత్తికలు శివునికి ప్రీతిపాత్రులయ్యారు. వారి పేరున ఏర్పడిన కార్తీక మాసం అంటే శివునికి ఎక్కువ ఇష్తం. కనుకనే ఈ మాసంలో దేశవ్యాప్తంగా శివార్చనలు వైభవంగా జరుగుతాయి.

 ఈ మాసములో చెరువుల యందును, దిగుడు బావుల లోను, పిల్లకాలువల యందును హరి నివసించి ఉంటాదు అని శాస్త్రం.ఆవుపాదమంతటి జలంలో కూదా ఈ మాసంలో హరి నివసిస్తాడుత. అందుకే సూర్యోదయానికి పూర్వమే శిర:స్నానం చేయాలి. దీపారాధన చేసి, శివునికి, విష్ణువుకు, సుబ్రహ్మన్యస్వామికి పూజచేస్తే, విశేష ఫలప్రదము.

సోమవారాలు.

ప్రతి సోమవారము శివవ్రతానికి ఉత్తమమే కాని, ప్రత్యేకించి కార్తీక సోమవారాలు సర్వవిధాల శ్రేష్టం. ఈరోజు ఉదయాన్నే శివారాధన, అభిషేకదులు చేసుకుని, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం తిరిగి శివునికి పూజ చేసి, అన్నాదులు నివేదన చేసి, నక్షత్ర దర్శనం చేసి ఆ ప్రసాదాన్ని ఆరగించాలి. ముఖ్యంగా దీపారాధన స్నానానంతరం పొడిబట్టలతోనే చేయాలి.

(ఇంకా ఉంది )


ఆశ్వయుజ మాసం ప్రాశస్త్యం:

నక్షత్రలలో మొదటిది అశ్విని. ఆ నక్షత్రంతో కూడిన పూర్ణీమ కల మాసమిది. అంటే ఒక విధంగా ఇక్కడినుండి కొత్త సంవత్సరం ఆరంభం ఔతున్నట్లే! ఇలాగే చైత్రం కూడా! అందుకే ఈ రెండు నెలల్లోనూ మొదటి తొమ్మిది రోజులు ( శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ) అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ నవరాత్రులలో జగదంబను ఆరాధించేవారికి సరమంగళములూ సంప్రాప్తిస్తాయి. ఈ నవరత్రికి దీక్షతో నిర్వహించే పూజలు సాత్వికం, రాజసం, తామసం అని మూడు రకాలు. సాత్విక పూజ మోక్షాన్ని ప్రసాదిస్తుందని, రాజసపూజ సంపద, పదవి, ధనం వంటి వాటిని కలుగచేస్తుందని, తామసిక పూజ ప్రయోజనం మధ్యమం అని శాస్త్ర వచనం. సంప్రదాయ సిధ్ధంగా పధ్ధతిగలవారు కలశాన్ని స్థాపించి ముగురమ్మల మూలపుటమ్మను ఈనాటి నుండి తొమ్మిది రోజులపాటు నియమంగా ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు చేయలేని వారు 5 రోజులు కాని, 3 రోజులు కాని లేదా ఒక్క రోజు కాని చేయవచ్చు. పూజతో పాటు ఒకపూట భోజనం చేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఆశ్వయుజ మాసం అష్తమి నవములందు జగన్మాతయైన అంబికను పూజించిన నరుడు శోకం లేని వాడు ఔతాడు.

సరస్వతీ పూజ:

మూలా నక్ష్త్రంలో సరస్వతిని ఆరాధించాలి. తొమ్మ్మిది రోజులు పూజ చేయలేని వారు ఈనాటినుండి నవమి వరకు మూడు రోజులపాటు అయినా ఆరాధించాలి.మనిషిని   మూఢత్వమనే జడత్వం నుంచి వ్జాన వికాసం వైపు నడిపించేది "చదువు". ఆ చదువును అందించే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యల రాణి, పుస్తకపాణిని అయిన జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

మహానవమి:

నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహానవమి. ఈ రోజున జగదంబను ఆరాధించి తీరాలి. తొమ్మిది రోజులూ పూజ చెయలేని వారు అష్టమి, నవమి, దశమి నాదైనా పూజించాలి. అందులో ప్రధానమైనది ఈ నవమి పూజ.

విజయదశమి:

నవరాత్రులలో చివరి రోజు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. పూర్వం జయాన్ని కోరే రాజులు ఈనాదే యుద్ధానికి వెళ్ళేవారని చరిత్ర వల్ల తెలుస్తోంది. ఈ రోజుల్లో వాతావరణం మరీ ఎక్కువ చల్లగా, మరీ ఎక్కువ ఎండగా లేక, వర్షముల వలన ఏర్పడిన బురద ఆరిపొయి, ప్రయాణమునకు అనువుగా ఉంటుంది. వరదలు, వాగులు, నదులు, ప్రవాహవేగము తగ్గిదాటుటకు అనువుగా ఉంటాయి. అందుకే, ఈ దసరా రోజున అపరాజితా పూజ ముగించి, యుద్ధ ప్రయాణములకు సిధ్ధంగా ఉండేవారట రాజులు.

ఈరోజున శమీవృక్షమును పూజించి, ఈ చెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చుకొని ఆలింగనము చేసుకోవడం పెద్దవారికి ఇచ్చి వారి నుంచి ఆశీస్సులు అందుకోవటం నేటికీ తెలంగాణ ప్రాంతం లో ఆచారం లో ఉంది.

అపరాజితా పూజ:

ఈరోజున అపరాజితా దేవిని పూజించలేని వారు "అపరాజితాయై నమ:, జయాయై నమ:, విజయాయై నమ:" అనే నామాలు చదివినా శుభకరమే. ఏ ప్రయాణానికి వెళ్ళినా ఈ నామాలు పఠిస్తే, విజయం ప్రాప్తిస్తుంది. నవమి, దశమిలందు అపరాజితను పూజించడం వలన విజయము సిధ్ధింపగలదని పురాణోక్తి. .
ఇది



శ్రావణమాస ప్రాశస్త్యం:

శ్రావణ పంచమి; ఈరోజును నాగపంచమి అని కూడా అంటారు. ఈరోజు ఉత్తరభారత దేశంలోనూ, దక్షిణ భారతం లో కొన్నిచోట్ల నాగదేవతలకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. జైన పురాణాలలో కూడా నాగపంచమి ప్రసక్తి ఉంది.

వరలక్ష్మి వ్రతం: ఈమాసం లో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు అన్ని వర్ణాల మహిళలు ఆచరించే మహత్తరమైన పూజ వరలక్ష్మి వ్రతం. శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈపూజను మహిళలు అందరూ యధాశక్తి చేసుకుంటారు.

రాఖీ పౌర్ణిమ: తమ రక్షణ కోరుతూ, సోదరీమణులు వారి అన్నదమ్ములకు రక్షాబంధనం చేసేది ఈ రోజే. ఉపనయనం చేసుకున్న ప్రతివారూ ఈరోజు పాత జంధ్యములు తీసివేసి, కొత్తవి ధరిస్తారు. ఈ పూర్ణిమను జంధ్యాలపూర్నిమ అని కూడా అంతారు.

శ్రీకృష్ణాష్తమి: వెన్న దొంగ, నల్లనయ్య అయిన కృష్ణుడు జన్మించిన ఈ రోజును దేశ ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పాలు, పెరుగు, అటుకులు, మిఠాయిలు నైవేద్యం గ సమర్పిస్తారు.  దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ మందిరాలలో అర్చనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో, ఆ దేవదేవుని స్మరించుకుంటూ, ఉట్లు కొడతారు.

పోలాల అమావాస్య:

 శ్రావణ అమావాస్య ను పోలాల అమావాస్యగా చెప్తారు. పోల అంటే ఎద్దు. కాబట్టి ఈ పండుగ పశువులకు సంబంధించిన పండుగగా చెప్పబడుతోంది. ఎక్కువగా రైతులు దీన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఆవులను, ఎద్దులను పూజించాలని శాస్త్ర వచనం. రైతులు తమ వద్ద పనిచేసే కూలీలకు ఈ రోజుననే కూలి కొలిచేవారు. అంటే, ముందటి పోలాల అమావాస్య నుండి ఈరోజు వరకు కూలి లెక్క వేసేవారు. అంటే, రైతులకు ఇది నూతన సంవత్సరంతో సమానం. రాను రాను పోలేరమ్మ అనే గ్రామదేవత పూజగా కూదా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ అమావాస్య నాడు పోలాంబ (పోలేరమ్మ)ను ప్రత్యేకంగా కొలుస్తారు. కొన్ని చోత్ల కందమొక్కను పూజిస్తారు. కందమొక్కకు ఎంత త్వరగా పిలకలు వచ్చి మొక్కలు వస్తాయొ, అంత త్వరగా ఇంద్లలో పసిపాపలు పారాడాలి అని, పుట్టిన పిల్లలు ఏ అరిష్టాలు లేకుండా చల్లగా పెరగాలి అని ఈ పూజను చేస్తారు.
ఆషాఢ మాసం ప్రాశస్త్యం:

ఆషాఢ శుక్ల విదియ జగన్నాధ రథోత్సవం. స్కాందపురాణం ప్రకారం ఈ విదియ రోజున పుష్యమీ నక్షత్రాన  సుభద్రా బలరాములను రథముపై ఊరేగిస్తారు. కళింగ ప్రాంతమున (నేటి ఒరిస్సా) పూరీజగన్నాధ క్షేత్రములో లోకకళ్యాణార్ధమై రథయాత్ర నిర్వహించబడుతుంది.ముగ్గురు దైవాలు మూడు రథములపై ఊరేగే ఈ సంప్రదాయక ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది.  ఈ విదియ రోజు, ఆదినారాయణునకు రథయాత్ర ఎంతో ప్రీతికరమైనది అని శాస్త్రవచనాలు చెప్తున్నాయి.

శయనైకాదశి (తొలి ఏకాదశి)

ఆషాఢ శుధ్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయనైకాదశి అంటారు. ఈ ఏకాదశి నుండి, కార్తీక శుధ్ధ ఏకాదశి (నాలుగు నెలలు ) వరకు చేసే వ్రతం, చాతుర్మ్యాస వ్రతం. ఈ వ్రతం చేసేవారు గుడం,( బెల్లము ) తైలం, కాల్చి వండిన పదార్థాలు, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చెరకు, కొత్త ఉశిరిక, చింతపండు, శయ్యాశయనం (మంచముపై శయనించుట),పరాన్నం, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, తీసుకోరాదు. నిమ్మ, రాజమాషములు (రాజ్మా) ముల్లంగి, ఎర్రముల్లంగి, అలసందలు,  విష్ణువుకు నివేదించని పదార్థములు తీసుకోరాదు. భగవత్పూజలో కాలం గడపాలి. ఈ పుణ్యదినాన విష్ణువు పాలసముద్రములో పవ్వళీస్తాడు అని, కార్తీక శుధ్ధ ఏకాదశి నాడు మరల భక్తులను రక్షించుటకై మేలుకొంటాడు అని శాస్త్రవచనం. ఈ చాతుర్మ్యాస వ్రతములో మొదటి ఏకాదశి కనుక ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పేరు.

ఈ చాతుర్మ్యాస వ్రతము లో శ్రావణమాసము, కూరలను (శాకములు ), బాధ్రపద మాసమున పెరుగును, ఆశ్వయుజ మాసమున పాలును, కార్తీక మాసమున పప్పు పదార్థములను విసర్జించాలి.

వ్యాసపూర్ణిమ:

వేదవ్యాసుని జయంతి ఈరోజు, తొలిగురువు వ్యాస మహర్షులవారే కనుక ఈరోజు, వ్యాసుల వారితో పాటు, ప్రజలు తమ తమ గురువులను కూడా పూజించాలి.చదువులు చెప్పే గురువులను, మంత్రోపదేశం చేసే గురువులను యథాశక్తి అర్చించాలి. వారి వారి గురుపరంపరను పూజించాలి. సన్యాసులైన వారు, ఈ పూర్ణిమానాడు చాతుర్మ్యాస వ్రతం ఆరంభించి, ఈ నాలుగు నెలలూ, ఎక్కడికీ సంచారం చెయకుందా, ఒకచోట స్థిర నివాసం చేయాలి.




జ్యేష్ట మాస ప్రాశస్త్యం:

ఈ మాసం లో మొదట వచ్చే తదియ నాడు పార్వతీదేవి ని పూజిస్తారు. తరువాతరోజు "ఉమా" నామంతో అమ్మవారిని అర్చిస్తారు.

దశపాపహరదశమి :

ఈ దశమినాడు గంగాస్నానం, గంగా స్మరణం శ్రేష్టం.మానవుడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపములు, దుష్టకర్మలు ఈ రోజున గంగా స్నానం కానీ, గంగా మాత స్మరణం కానీ చేస్తే తొలగింపబడతాయి అని శాస్త్రం చెప్తోంది.  మహాత్ముల సాంగత్యంలో అమోఘమైన శక్తి ఉంటుంది. వారి మాట, స్పర్శ, సంకల్పం మహతర ప్రభావం కలిగి ఉంటాయి. బాగవతం లోని గంగావతరణ ఘట్టం ఈ సత్యాన్ని వెల్లడిస్తుంది. భగీరధుడు గంగను భూలోకానికి రప్పించడానికి ఘోరమైన తపస్సు చేశాడు.

"ఓ రాజా! నేను భూలోకానికి రాను. వస్తే పాపాత్ములు నాలో స్నానం చేసి, వారి పాపాలను నాలో వదినివేస్తారు. ఆ పాపభారాన్ని నేనెలా మోయగలను?" అన్నది గంగాదేవి. అప్పుదు భగీరధుడు, " అమ్మా గంగాదేవీ! నీలో పాపులే కాదు, సాధు పుంగవులు, శాంతస్వభావులు, ధర్మపరాయణులు కూడా స్నానమాచరిస్తారు. సర్వపాపహరుదైన శ్రీహరి వారిలో కొలువై ఉంటాడు. ఆ పుణ్యాత్ర్ముల స్పర్శ వలన ఆ పాపభారమంతా దూరమౌతుంది" అన్నాడు. గంగాదేవి అతని మాటలకు త్రుప్తి చెంది, భూలోకానికి వచ్చింది. మహాత్ముల మాటలకు అంతటి మహిమ ఉంది. ఈనాడు

"నమో భవత్యై హశపాపహరాయై, గంగాయై, నారాయణ్యై,
రేవ్యై, శివాయై, దక్షాయై, అమృతాయై, విశ్వరూపిణ్యై
నందిన్యై తే నమో నమ:

అనే మంత్రం తో గంగను పూజించాలి.

నిర్జల ఏకాదశి:

ఈ ఏకాదశి చాలా విశేషమైనది. పగలంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవసించి, ద్వాదశి నాడు త్రివిక్రమ మూర్తిని పూజించి, దానాదులు చేసి, పారణ చేయాలి. ఈ ఒక్క ఏకాదశిని ఆచరించిన, 12 ఏకాదశులు ఆచరించిన పుణ్యం వస్తుంది అని శాస్త్ర వచనం.

వట సావిత్రీ వ్రతం..

ఈ వ్రతం జ్యేష్ట పూర్ణిమ నాడు ఆచరిస్తారు. జ్యేష్ట అమావాస్యకు కొంతమంది చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్ప వరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు. మంగళ గౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రీ వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలొ వట సావిత్రీ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలాలు. ఈ వ్రతం రోజు, సుమంగళులు ఈ వృక్షాన్ని పసుపు కుంకుమలతో, పూజించి, వృక్షాన్ని పువ్వులతో అలంకరించి, గాజులు మొదలైన అలంకరణ సామగ్రిని సమర్పించి, ధూప దీప నైవేద్యాలతో అర్చిస్తారు. తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేస్తూ ముడి ప్రత్తి నుండి తీసిన దారం చుట్టుకుంటూ వెళతారు. వటవృక్షం యొక్క అఖండ ఆయుర్దాయంతో, తమ భర్తల యొక్క అయుర్దాయాన్ని బంధించటమే, ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. పూజ అయ్యాక, ప్రతి స్త్రీ 5గురు సుమంగళులను పసుపు కుంకుమ, దక్షిణ, తాంబూలం, నైవేద్యంతో గౌరవిస్తుంది. స్త్రీలు అందరూ ఈరోజు ఉపవాసం చేస్తారు. ఈరోజు అఖండ సౌభాగ్యం కొరకు యమునితో పోరాడిన పతివ్రతా శిరోమణి సావిత్రీ, ఆమె భర్త సత్యవంతుల గాధను స్మరించుకుంటారు. ఎంతో విశేష ఫలితాలను ఇచ్చే పుణ్యదినం ఈ జ్యేష్ట పౌర్ణమి.

ఈరోజున నువ్వులు, గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే, అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది.


జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు. ఇది కృషీవలుల పండుగ. ఈరోజున రైతులు అందరూ, తమ తమ ఎడ్లను యధాశక్తి పూజించి, ఊరేగింపుగా పొలాలకు నాగళ్ళతో కదిలి వెళతారు. అక్కడ తొలి దుక్కి దున్నుతారు. ఇది ఒకరకంగా చెప్పాలంతే వ్యవసాయ ప్రారంభ పండుగ. 
వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి జరిగింది అని శాస్త్రాలు చెప్తున్నయి. మరల ఈనాడే క్రోధితుడైన జహ్ను మహర్షి గంగను తాగేసి, మరన గంగ వేడుకున్న మీదట కుడి చెవి నుంచి వదిలాడు . జహ్ను మహర్షి చెవి నుండి వెలువడిన గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. వైశాఖ శుధ్ధ సప్తమి నాడు గంగాదేవి ఆవిర్భవించినట్లు శాస్త్రాలు పేర్కొన్నాయి. అయితే, భగీరథుని తపస్సు కారణంగా జ్యేష్ట శుధ్ధ దశమినాడు గంగ భూలోకాన్ని చేరింది. అందుకే ఆ రోజు  గంగానదిలో స్నానం చేయడం, చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. గంగాదేవిని స్మరిస్తూ, పుణ్య నదుల్లో స్నానం చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ జ్యేష్ట శుధ్ధ దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. ఈరోజున గాంగ దేవిని స్మరించడం, పూజించడం ద్వారా అశేష ఫలితాలను పొందవచ్చు. గత జన్మల నుండీ ఉన్న సంచిత పాపములను కూడా తొలగించుకోవచ్చు.
వైశాఖ మాస ప్రాశస్త్యం

మేష, తుల, మకర, సంక్రమణ కాలాలు, స్నానానికి విశిష్టమైనవి. ఈ మాసం లో నల్ల తులసి, తెల్ల తులసి రెండూ కూడా విష్ణు పూజకు యోగ్యమైనవే. శ్రీహరికి ఇష్టమైన అశ్వద్ఠ మూలాన్ని  నీటితో తడపడం కూడా పుణ్యదాయకమే. స్నానానంతరం అశ్వధ్ధ పూజ కూడా ఉత్తమం.

ఆవును వెనుక భాగమున నిమిరి, అటుపైన స్నానం చేసి, పిప్పల తర్పణం చేసి, గోవిందుని అర్చించిన వారికి ఎన్నడూ దుర్గతులు సంభవించవు. యధాశక్తి నక్తం, ఏకభుక్తం, అయాచితం, వీనిలో ఎదైనా ఆచరించే వారికి కోరిన కోరికలన్నీ సిధ్ధిస్తాయి. వైశాఖం లో చలివేంద్రాలు నిర్వహించడం, పరమశివునికి, లింగమూర్తికి, గలంతిక ( నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాటు) పితృదేవతల తృప్తికై చెప్పులు, విసనకర్ర, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, ఘట పూరిత జలం, పూలు, పండ్లు, దానం చేయడం, అన్ని విధాలా మేలు కలిగిస్తాయి. ఈ మాసం నెల రోజులూ స్నానం ఆచరించలేని వారు కేవలం మూడు రోజులు స్నానాన్ని ఆచరించడం లో తప్పు లేదు. ఆ తిథులు ఏమిటంటే, శుక్ల పక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. ఈ మూడు రోజుల్లో స్నానం అచరించుట వలన పాపములు నివృత్తి కాబడతాయి.

అక్షయ తృతీయ.

వైశాఖ శుధ్ధ తృతీయ ను అక్షయ తృతీయ అంటారు. కృతయుగం ఈనాడే ప్రారంభమైందని చెప్తారు. ఈ రోజున చేసేపూజలు, హోమము, దానము. పితృతర్పణము అక్షమయైన పుణ్యఫలాని ఇస్తాయి.  ఈరోజున నీటితో నిండిన కుండ, గోధుమలు, శనగలు మొదలగు ధాన్యాలు, పెరుగన్నం దానం చెయడం వలన శివసాయుజ్యాన్ని పొందవచ్చూని భవిషయ పురాణం, దేవీపురాణం చెబుతున్నాయి. గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారము, వస్త్రాలను దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. కొన్ని ప్రంతాలలో ఈ రోజున గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణునికి చందన లేపనం చేసే సంప్రదాయం కూడా ఉంది.

పరశురాముని కథ:


జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు. రేణుకా దేవి ఒకరాజుని మోహించిందని భావించి, జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలిన వారు నిరాకరించగా, పరశురాముడు, తండ్రి ఆజ్ఞ నిర్వర్తించాడు. తండ్రి సంతోషించి, వరం కోరమంటే, తల్లిని బ్రతికించమని, సోదరులను మన్నించమని అడిగాడు. తండ్రి అతని కోరిక తీర్చాడు. తరువత పరశురాముడు తాత రుచీకుడి వద్దకు వెళతాడు. రుచీకుడు మనవడి తీరుతెన్నులు గమనించి, తపస్సు చేయమని సూచిస్తాడు. పరశురాముడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరమన్నడు. రౌద్రాస్త్రం ఇమ్మని అడిగాడు పరశురాముడు. అంత అస్త్రాన్ని భరించగల శక్తి నీకు లేదు అన్నాడు శివుడు.  పరశురాముడు తపస్సు కొనసాగించాడు. అంతలో దానవులు దేవలోకం మీద దాడి చేశారు. శివుడు పరశురాముని రప్పించి దానవులను తరిమేసే బాధ్యతను అప్పగించాడు. నా దగ్గర ఆయుధం లేదే అన్నాడు పరశురాముడు. అప్పుడు శివుడు అతనికి పరశువు ( గొడ్డలి) ఇస్తాడు. పరశురాముడు దానవులను తరిమికొట్టి, మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. శివుడు మరోసారి ప్రత్యక్షమై అతడు కోరిన అస్త్రాలన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత, వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు అనే రాజు సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్ని తన వద్దనున్న కామధేనువు వల్ల అన్ని పదార్థాలు పొంది, రాజుకు విందు చేశాడు. రాజు ఆ కామధేనువును అపహరించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని భటులు సంహరించారు. భృగు మహర్షి వచ్చి జమదగ్నిని మరల జీవింపచేస్తాడు. కార్తవీర్యుని దురాగతం తెలుసుకున్న పరశురాముడు, ఇరవై ఒక్క సార్లు దండెత్తి, కార్తవీర్యునితో సహా రాజులందరినీ వధించాడు. అలా సంపాదించిన భూమిని కశ్యపునికి దానం చేసేసి, హింసకు ప్రాయశ్చిత్తంగా తండ్రి సూచనపై తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంతటి మహాతపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా వైజశాఖమాసం లోని తదియ నాడు రుపుకుంటున్నాం.