శ్రీ రామ నామ సంకీర్తన ---3
రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము
జివితంబున నిత్యజపమున చేయవలె శ్రీరామ నామము
మరణ కాలము నందు ముక్తికి మార్గమగు శ్రీ రామ నామము
పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామ నామము
ఎందఱో మహానుభావుల డెందమాయెను శ్రీరామ నామము
తుంటరి కామాదులను మంట గలుపునది రామనామము
మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము
సిధ్ధముర్తులు మాటిమాటికి చేయునది శ్రీరామ నామము
వెంట తిరిగెడి వారికేల్లను కంటిపాపే రామనామము
ముదముతో సద్భక్తి పరులకు మూలమంత్రము రామనామము
కుండలిని చేదించి చూచిన పండువెన్నెల రామనామము
గరుడ గమనాదులకైన కాదు రమ్యమైనది రామనామము
విధాత వ్రాసిన వ్రాత తుడిచేడి దైవమె శ్రీరామ నామము
పుట్ట తానై, పాము తానై, బుసలు కొట్టును రామనామము
అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము
అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామ నామము
జ్ఞాన భూముల నేడు గడచినా మౌనదేశము రామనామము
తత్వ శిఖరమునందు వెలిగే నిత్యసత్యము రామనామము
దట్టమౌ గాఢఅంధకారమును రూపుమాపును శ్రీరామ నామము
పంచ భుతాతీతమగు పరమాత్మ తత్వము రామనామము.
(ఇంకా ఉంది)

No comments:
Post a Comment