ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కొండొకచో అవి వడగల్లై జనాలకే తగులుతున్నాయి. ప్రతి పార్టీ మేనిఫెస్టో చూసిన సామాన్యుడు ఇప్పుడు నిజంగానే నాయకుల బుట్టలో పడి ఎన్నికలయ్యాక ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా తన్నుకుంటాడు. అసలు ఈ మేనిఫెస్టో లు పార్టీలకు కాకుండా వోటు వేసే వోటరుకు ఉండి ఉంటె..... నా మేనిఫెస్టో లో నా ఓటు అడిగే పార్టీలను నేను ఇలా అడుగుతాను. :
1. మాకు ఉచిత బియ్యం, సరుకుల సంచులు వద్దు. మొత్తంగా అన్ని సరుకుల ధరలు కొద్దిగానైనా తగ్గించండి.
2. మాకు రిజర్వేషన్స్ వద్దు, చదువుకున్న ప్రతి యువతీ, యువకులకు ఉద్యోగ/ఉపాధి కల్పించండి. ఉద్యోగ భద్రతా కూడా కల్పించండి.
3. మాకు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీ లు వద్దు. ప్రభుత్వ విద్య సంస్థలలో ప్రైవేటు యాజమాన్యాలకు దీటుగా ప్రమాణాలు పెంచండి.
4. విద్యాసంస్థలలో ఆడపిల్లలకు కావలసిన ప్రత్యెక సదుపాయాలు కల్పించండి.
5. హేమమాలిని బుగ్గల్లాంటి నున్నటి రహదారులు కాకపోయినా, రాష్ట్రం లోని ప్రతి ఏజెన్సీ, గిరిజన ప్రాంతం నుంచి, గ్రామాల నుంచి రవాణా వ్యవస్థ మెరుగు పరచండి.
6. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ లోని విద్యార్థులు ఆతీ గతీ పట్టించుకోండి.
7. మాకు డబల్ డెక్కర్ బస్సులు, బులెట్ రైళ్ళు వద్దు, ఉన్న రైళ్ళలో బోగీలు పెంచి, రైలు మార్గాలు పెంచి, టికెట్లు సులభంగా అందరికి దొరికేలా చూడండి. బస్సుల సంఖ్యా పెంచి, వాటి నిర్వహణ లోపాలు అరికట్టండి.
8. ఆడపిల్లల రక్షణకు ప్రత్యెక విభాగం ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష విధించడం ద్వారా బాధిత ఆడపిల్లలకు న్యాయం చేయండి. ఆడపిల్లలకు, మహిళలకు, ధైర్యాన్నివ్వండి.
9.రైతులకు ఉచిత విద్యుత్ తరువాతి మాట, ముందు నాణ్యమైన నిర్ణీత సమయాల్లో విద్యుత్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, అందించండి.
10. మారుమూల ప్రాంతాలకు కుడా మంచి నీటి సరఫరా ఇవ్వండి.
11. కోతలు లేని కరంటు సరఫరా చేయండి.
12. సంప్రదాయేతర ఇంధన వనరులను అన్ని రంగాల్లో ప్రోత్సహించండి.
13. రాష్ట్రం అంతటా పోరంబోకు స్థలాలు ( ఉపయోగం లో లేనివి) ఎన్నో ఉన్నాయి. వాటిని సరి అయిన విధానం లో ఉపయోగం లోకి తీసుకు వచ్చి, ప్రజలకు మేలు చేయండి.
14. మీ మీ నియోజక వర్గాల్లో చెత్త పేరుకు పోకుండా వారానికి ఒకసారి అయినా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టండి.
15. మీ మీ నియోజక వర్గాల్లో ఉన్న చెరువులు, కాలువలు శుభ్ర పరచి, ఉపయోగకరంగా తీర్చి దిద్దండి.
16. ఆరోగ్యశ్రీలు, బంగారు తల్లులు పధకాలు తర్వాత. చేతిలో పైసా లేని పేదల వైద్యానికి వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలు పెంచండి. ప్రభుత్వ వైద్యులలో జవాబుదారీ విధానాన్ని తీసుకురండి.
17. వయసు అయిపోయి ఎటూ కదలలేని పేద కుటుంబాలలోని వృద్ధులకు జీవన భ్రుతి ఏర్పాటు చేయండి.
18. నడుములు విరిగె గుంటలు, వర్షాకాలం లో మనుషుల ప్రాణాలు తీసే manholes లేకుండా రహదారులను మరమ్మత్తు చేయండి..
19. మీరు మా సొమ్ము స్వాహా చేస్తే చేసారు, మాకు కుడా కొంత లాభం చేకూరే పనులు చేపట్టండి.
20. ముఖ్యంగా రాజకీయ స్వార్ధంతోనో, లేదా పార్టీల మధ్య సమన్వయము కొరవడడం తోనో, లేదా ఎవరికో పేరు, హోదా దక్కుతుందేమో అనే దుర్బుద్దితోనో మన రాష్ట్రానికి రావలసిన కంపెనీలను ప్రక్క రాష్ట్రానికి పోనివ్వకండి. మనకు ప్రతిభా వంతులైన యువత ఎంతోమంది ఉన్నారు. వారి మేధస్సును ఉపయోగించుకోండి.
మిత్రులారా, మీలో ఎంతమంది నాతొ ఏకీభవిస్తారు? మీ మీ మేనిఫెస్టో లలో ఏ ఏ అంశాలు చేరుస్తారు?

అన్ని అంశాలు బాగున్నాయి..నిజంగా ఇవి మన రాజకీయ నాయకులకు పెద్ద సవాల్..వీటిలో ఒక 5 సమస్యలని పూర్తిగా తొలగించండి..మీరు తరువాత ఎన్నికలకి ప్రచారానికి కూడా రావక్కర్లేదు .. మన దేశాన్ని ని సింగపూర్, జపాన్ చెయ్యక్కర్లా....అందరికి కనీస సౌకర్యాలు కల్పించండి చాలు ..అంత కన్నా మీ దగ్గర్నుంచి మేము ఏమీ ఆశించం...
ReplyDeleteనేను ఈ మేనిఫెస్టో లో చేర్చే అంశాలు :
ReplyDeleteమీరు మీరు ఎన్ని రాజకియలేనా చేసుకోండి...ఎన్ని అల్లర్లు ఐనా చేసుకోండి..కానీ వాటిల్లోకి విద్యార్ధులని, అమాయకులని లాగకండి..
వోటు కొనుక్కునే డబ్బులతో పై సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నించండి..