చారిత్రక ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథ రథ యాత్ర ఈరొజు మొదలయింది....జగన్నాధుడు తన సోదరి సుభద్ర, కలిసి బలభద్రులతో ఊరేగింపుగా గుండీచా మందిరానికి వెళ్ళడమే రథయాత్ర....ఇందులో జగన్నథుడు కొలువుండే రథం పేరు "నందిఘోష".ఇది 45.6 అడుగుల ఎత్తుతో, 18 చక్రాలు కలిగిన రథం. బలభద్రుడి రథం 45 అడుగులు ఎత్తు ఉండి 16 చక్రాలతో అలరారుతుంది..దీనిపేరు తాళధ్వజ..ఇక సుభద్రా దేవి ఊరేగే రథం పేరు దేవదళన...ఇది 44.6 అడుగుల ఎత్తు ఉండి 14 చక్రాలతో ఉంటుంది. ఇవన్నీ రథయాత్ర ఉత్సవానికి కొన్ని నెలల ముందే రంగురంగుల వస్త్రాలతో చాలా ఆకర్షణీయంగా అలంకరింపబడతాయి.
ఈ యాత్ర ఆషాఢ శుధ్ధ విదియనాడు మొదలవుతుంది. వారి పినతల్లి ఇంటికి ఊరేగింపుగా వెళ్ళిన ఈ దేవతలు, 9 రోజులు అక్కడ గడిపి మళ్ళి దేవాలయనికి తిరిగివస్తారు.
"చేర పహరా" అనేది ఈ ఉత్సవంలో చెప్పుకోదగిన విధి...ఇందులో ఆలయ అనువంశిక ధర్మకర్తలైన గజపతి రాజులు బంగారు చీపురుకట్టతో, ఆ రథయాత్ర మొదలయ్యే ప్రదేశాన్నీ, రథాల చుట్టూను శుభ్రం చేసి, గంధపు నీరును, పొడిని చల్లి పవిత్రం చేస్తారు. భగవంతుని ముందు రాజు, సామాన్యుడు ఒకటే అనే అర్ధంలో ఈ విధిని జరుపుతారు.
9 రోజులను పినతల్లి ఇంట ఆనందోత్సాహాలతో గడిపిన బలరామ, కృష్ణ , సుభద్రలు మరల వెనుకకు పూరీ ఆలయానికి రావడంతో ఉత్సవం పూర్తి అవుతుంది. వారు వెనుకకు వచ్చే దారిలో "మౌసీ మా" గుడి దగ్గర ఆగినపుడు..."పోడి పీఠా" అనే పదార్ధాన్ని భక్తులకు పంచుతారు. ఈ రథయాత్ర పురాణాల కాలం నుంచీ జరుగుతోంది అని అంటారు. ఇందుకు సంబంధించిన వృత్తాంతాలు స్కాంద పురాణం , బ్రహ్మ పురాణం, పద్మ పురాణాల్లోను, కపిల సమ్హిత లోను చెప్పబడ్డాయి. ఘుండీచా గుడి నుండి ఈ రథాలు ఈనెల 14 న వెనుకకు వస్తాయి..ఈ పది రోజులు ఒరిస్సా అంతా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి..దేశం నలుమూలల నుండే కాక, విదేశీయులు కూడ ఎంతోమంది ఈ ఉత్సవాల్లొ పాలుపంచుకుంటారు. పూరీ పట్టణం అంతా రంగురంగుల ఉత్సవ శోభలతో మునిగిపోతుంది..
జగన్నాధ రథ యాత్ర శుభాకాంక్షలు ఎల్లరికీ.............................
జై జగన్నాథ !!
(సేకరణ)
No comments:
Post a Comment