"ఏవండీ! నాకు ఈసారి ఊరు మారినప్పుడు ఓ ఉయ్యాల బల్ల కొనరా!" వంటింట్లోంచి అడిగాను నేను....
"ఏంటి! మిరియాల పాలు కావాలా? ఏం? ఇంట్లో మిరియాలు లేవా? తెస్తాలే!!" మావారి జవాబు...హాల్లోంచి...
అప్పుడే అనుమానం వచ్చింది నాకు...ఈయన గారు ఏంచేస్తున్నారా అని, ఇలా అవకతవక జవాబు ఆయన నోటినుంచి వచ్చిందీ అంటే ఖచ్చితంగా దినపత్రిక పఠనం లో ఉండి ఉంటారు...పేపరు చదువుతున్న పతిదేవుణ్ణి పలకరిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి...ఎన్నేళ్ళొచ్చినా, ఎన్నేళ్ళ నుంచో ఇంట్లో జరుగుతున్న భాగోతమే అయినా నాకు బుధ్ధి రాదు...మిరియాల పాలు కావాలంటే నేను కలుపుకోనూ.....ఎప్పుడూ వంటింట్లోనే వేళ్ళాడుతూ ఉంటాను కదా, ఏదో పొద్దున్నే గుర్తొచ్చి ఉయ్యాల బల్ల అడిగాను...
చెప్పాలంటే నావి కొంచెం పాత టేస్టులు...మండువా లోగిలి ఇల్లు...(అంత కుదరకపోతే, ఓ పెద్ద వసారా, పెంకుటిల్లు,) ముత్తైదువలు ఇంటికి వస్తే బొట్టు పెట్టి ఓ కొబ్బరిబొండాం ఇవ్వడానికి వీలుగా ఓ కొబ్బరి చెట్టు, దొడ్లో ఓ నుయ్యి, ఓ పెద్ద తులసి కోట...ఇంటికి ముందువైపో, వెనక వైపో ఎత్తరుగులు.....ఇవన్నీ నా ఊహల్లో కట్టుకున్న ఇంటి నమూనా.....నా పిచ్చికి నన్నొదిలేసి ఓ నాలుగు గోడల అపార్టుమెంటు కొనేసారు మావారు...ఇప్పుడు ఇది సులువై పోయింది...రెడీమేడ్ జీన్సు, చొక్కా కొనుక్కుని వచ్చేసినట్టు, డబ్బు పట్టుకెళ్ళడం, సంతకం పెట్టేసి మనది అని మమ అనిపించుకోవడం....ఇల్లు సొంతం అవ్వాలంటే కష్టం లేదు..ఇసుక మోయాలనే బాధ లేదు, దింపిన ఇటుకలు ఎన్నున్నాయో లెక్కెట్టుకోక్కర్లేదు...నాలాంటి పిచ్చోళ్ళని పక్కనపెడితే..... ఇందులో ఉండే లాభాలు ఇందులో ఉన్నాయిలెండి....
ఉయ్యాలబల్ల మీద పడుకుని ఓ శ్రీపాద వారి కథలో, అమరావతి కథలో చదువుకుంటుంటే ఆ మజాయే వేరు...పక్కన సన్నగా జేసుదాసు గారి పాటలు వినిపిస్తుంటే, ఆక్షణాన్న ఊపిరి ఆగిపోయినా ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తామన్న నమ్మకం నాకు...
ఏమిటో జీవితంలో చిన్న చిన్న సరదాలే తీరవు....పెద్ద పెద్ద కొరికలు వెంటనే తీరతాయి....ఇదేం రహస్యమో తెలియదు.....లక్ష రూపాయలు పట్టుకెళ్ళి ఓ నెక్లెస్ కొనుక్కోవడం అవుతుంది..స్టీలు సామాను కొట్లో 10 రూపాయలకు దొరికే బుజ్జి గుండుచెంబు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు పడుతుందో...అద్దాల్లోంచి ఊరిస్తూ ఉంటుంది బుజ్జి తల్లి......అక్కడ ఆగి కొనుక్కోవడమే అవ్వదు ఎప్పుడూనూ....నా సొంత ఇల్లు కూడా అలాగే కలలా మిగిలిపోయింది....
ప్చ్....కొన్ని కలలు అంతే...ఏం చేయలేం.....

No comments:
Post a Comment