Monday 13 January 2014

నిన్నటి భాగం తరువాయి......

వరపూజ:

కన్యాదాత వరుని లక్ష్మి నారాయణస్వరూపముగా   భావించి పూజించును. పాదములను కడుగును. అర్ఘ్య పాద్యములు అయిన తరువాత మధుపర్కం అను తీయని పానియమును వరునికి ఇచ్చును.

కన్యాదానం:

దానములలో సాలంక్రుత కన్యాదానం ఎంతో గొప్ప ఫలము కలది అని చెపుతారు కన్యాదానము చేయునపుడు కన్యాదాత చెప్పే మంత్రముల అర్ధములు:
పుత్రునితో సమానముగా నేను పెంచిన 8 సం. ( ఈ ప్రాయ: ప్రమాణం పూర్వకాలములో. ఇప్పుడు వదువుకు నిర్దిష్టమైన వయసు పరిమితి లేదు కదా... అయినా మంత్రం మాత్రం అదే చెప్తారు.) ల వయసు గల ఈ కన్యను నీకు ఇచ్చుచున్నాను. నీవు ఈమెను ప్రేమ, అభిమానములతో చూసుకొనుము.

సువర్ణ ఆభరణములతో అలంకరింప బడిన ఈ సువర్ణము వంటి కన్యను, బ్రహ్మ లోకమును సాధించుట కొరకై విష్ణు స్వరూపుడగు నీకు దానము ఇస్తున్నాను.

పితరులు తరించుటకు, ఈ కన్యను దానము చేయుచున్నాను.
పంచభూతములు, సమస్త దేవతలు సాక్షులగుదురు గాక. 

సాధుశీల యగు, అలక్రుతమైన ఈ కన్యను ధర్మ కామ అర్ధ సిద్ది కొరకు సుశీలుడగు ఈ బుద్ధిమన్తునకు దానము చేయుచున్నాను.

వరుడు చెప్పే మాట:-   సంతతిని పొందుటకు, కర్మల కొరకు ఈ కన్యను వరించుచున్నాను. ఈ కన్యాదాతకును, నాకును, బాంధవ్యము కలుగు గాక.

కన్యాదాన ఫలము:
గంగ నది యొక్క ఇసుక రేణువులతో సప్తర్షి మండలము వరకు వరుసగా పెర్చగ వచ్చిన సంవత్సరములను వెయిథొ గుణించగా వచ్చిన సంవత్సరములు అయిపోయిన తరువాత మళ్లీ ఒక్కొక్క రేనువును తొలగించుచు అన్ని రేణువులను తొలగించుటకు కావలసినంత కాలము బ్రహ్మ లోకము న నివసించు భాగ్యము కలుగుటకు, కన్యాదానము చేయుదురు.

నాతి చరామి: ( న + అతి చరామి ) :

కన్యాదానము  గుణవంతము అగుటకు సాలగ్రామ దానము చేస్తూ, కన్యాదాత ధర్మ, అర్ధ , కామ, ఆచరణలో ఈమెను అతిక్రమించి నీవు చరింప రాదు అని పలుకును. దానికి వరుడు అట్లే అతిక్రమించి చరించను అని హామీ ఇచ్చును.

(సశేషం)

No comments:

Post a Comment