భూమి
మిద ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు. ప్రతిరోజూ ఉదయిన్చినప్పటినుంచి
అస్తమించే వరకు బంగారు వన్నెలతో తన వెలుగును భూమికి పంపుతాడు. ఒక ఘడియ
బంగారు రంగు అయితే ఇంకో ఘడియ తెల్లని తెలుపు, ఒక నిముషం వెండి వెలుగులు
అయితే, మరొక నిముషం ముత్యాల మెరుపుతో కనిపిస్తాడు. ఈ చక్కని విషయాన్ని ఒక
కవి ఒక పాటలో ఎంత చక్కగా వర్ణించారో చుడండి.
ఈ పాట అల్ ఇండియా రేడియో లో ప్రతి ఆదివారం ఉదయం వచ్చేది మా చిన్నపుడు. ఇపుడు రేడియో వినటం లేదు కదా. వస్తోందో లేదో తెలియదు. భక్తీ టీవిలో ఉదయం 6 గంటలకు వస్తోంది.
శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా,
పొడుస్తూ భానుడు పొన్నపువు చాయ,
పొన్నపువ్వు మిద పొగడపువు ఛాయా.
ఉదయిస్తూ భానుడు ఉల్లిపువు చాయ
ఉల్లిపూవు మిద వుగ్రంపు పొడి చాయ ll
గడిఎక్కి భానుడు కంబపువ్వు చాయ
కంబ పువ్వు మిద కాసారి పూ చాయ 11
జామేక్కి భానుడు జాజిపూవు చాయ
జాజిపూవు మిద సంపెంగ పొడి చాయ ll
మధ్యాహ్నభానుడు మల్లె పువు చాయ
మల్లెపూవు మిద మంకెన్న పూ చాయ ll
మూడు జాముల భానుడు మునగ పువు చాయ
మునగ పువు మిద ముత్యంపు పొడి చాయ ll
అస్తమాన భానుడు ఆవపూవు చాయ,
ఆవపూవు మిద అద్దంపు పొడి చాయ ll
వాలుతూ భానుడు వంగపూవు చాయ
వంగపూవు మిద వజ్రంపు పొడి చాయ ll
క్రుంకుతూ భానుడు గుమ్మడి పూ చాయ
గుమ్మడి పువు మిద కుంకంపు పొడి చాయ.
శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా....
పైన పాటలో పేర్కొన్న పూవులు అన్ని తెలుపు లేదా పసుపు రంగులో ఉండేవే. కానీ అందులో వివిధములైన shades లో ఉంటాయి. ఉదయించి నప్పటి నుంచి పొద్దు గుంకే వరకు ఉన్న అన్ని వర్ణనలు పసుపు లేదా తెలుపు లో ఉన్నాయి. కానీ మధ్యాహ్నం, మంకెన్న పువ్వు.( ఇది ఎర్రగా ఉంటుంది), క్రున్కుతున్న సమయములో కుంకంపు పొడి ( ఇది కూడా ఎర్రగానే ఉంటుంది కదా) అని వర్ణించడం ఎంత గొప్పగా ఉందొ కదా.. వ్రాసిన కవికి పాదాభివందనములు.
ఈ పాటను మాఘ మాసంలో ప్రతి రోజు పాడుకోవటం తెలుగు మహిళలకు అలవాటు.
గమనిక: ఈ పాట వ్రాసిన రచయితా ఎవరో, ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పగలరు.

No comments:
Post a Comment