చందమామ
పిల్లల మాస పత్రిక గురించి తెలియని క్రిందటి తరం భారతీయులు లేరు అని అంటే
అతిశయోక్తి కాదు. 1947 జులైలో ప్రముఖ సినీ నిర్మాతలు, విజయ సంస్థ అధినేతలు
అయిన శ్రీ బి. నాగిరెడ్డి, చక్రపాణి ల మానస పుత్రిక ఈ పత్రిక. మొదట్లో
తెలుగు, తమిళ భాషల్లో ఆరంభమైన ఈ పత్రిక మొత్తం 13 భారతీయ భాషలు, ఇంగ్లీషు,
ఒక గిరిజన (సంతల్ ) భాష, సింహళ భాషలలో ప్రచురితమౌతొన్ది. అందులకోసం తెలుగు,
ఇంగ్లీషు బ్రెయిలీ లిపిలో వెలువడుతున్న ఏకైక పత్రిక చందమామ. television ,
కంప్యూటర్ లేని ఆ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు ఒక వినోద సాధనం చందమామ. పెద్దలు కూడా నెల తిరిగేసరికి కొత్త సంచిక మార్కెట్లోకి ఎపుడు వస్తుందా అని ఎదురు చూసేవారు.
ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు సంపాదకుడిగా పనిచేసిన ఈ పత్రికలో కథలు, ధారావాహికలు పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరించేవి. వివిధ దేశాలకు చెందినా జానపద గాధలు, నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించేవి. ప్రతి సంచికలో వచ్చే బేతాళ కధలు పిల్లలకు తెలివితేటలను, విజ్ఞానాన్ని అందించేవి. ఇక సీరియల్స్ సంగతి సరే సరి. శిధిలాలయం, రాకాసి లోయ, మాయ సరోవరం, భల్లుక మాంత్రికుడు, గ్రీకు పురాణాల ఆధారంగా వచ్చిన రుపధరుని యాత్రలు, భువన సుందరి -- వీటిని ఎవరైనా మర్చిపోగలరా? దాదాపు అన్ని భారతీయ పురాణాల మిద చందమామలో సీరియల్స్ వచ్చాయి.
ఇక ప్రతినెల ప్రతి సంచికలో వచ్చిన దెయ్యాల కథలు అన్ని శ్రీ మాచిరాజు కామేశ్వర రావు గారు రచించినవే. చందమామలో దెయ్యాలు ఎవరికీ హాని చేసేవి కావు. ఇవి రెండు రకాలు. ఒకటి పరులకు మేలు చేసేవి, రెండు అల్లరి చేసి ఆట పట్టించే చిలిపి దెయ్యాలు. ప్రజలలో మూఢ నమ్మకాలూ తొలగించేందుకు చందమామలో ప్రముఖ ఇంద్రజాలికుడు పి,సి. సర్కార్ తో ఇంద్రజాల మహిమల పైన కథలు వచ్చేవి.
పిల్లల పుస్తకంలో బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. శంకర్, చిత్ర గిసిన బొమ్మలు ప్రతి పేజీలోను ఆ సన్నివేశానికి అనుగుణంగా చక్కటి హావభావాలతో ఉండేవి. ఒక్క ఇంగ్లీషులో తప్ప మిగిలిన అన్ని భాషల చందమామలకు శ్రీ వడ్డది పాపయ్య గారు గిసిన ముఖ చిత్రాలు పత్రికకే వన్నె తెచ్చాయి.
చందమామ పత్రికలో రచన శైలి జాతీయాలు, సామెతలు నుడికారాలతో కూడి ఉండి, పిల్లలకు ఎంతో సులభంగా అర్ధమయ్యేలా ఉండేది. అసలు తెలుగే కాక, ఏ భారతీయ భాషనైనా నేర్చుకోవటానికి చందమామ శైలి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. శైలి, సంచిక కూర్పు వంటి విషయాలలో చందమామ మిగిలిన పిల్లల పత్రికలకు ఆదర్శం అయింది.
1947లొ ప్రారంభమైన చందమామ అనివార్య కారణాల వల్ల 1998లొ ఆగిపోయింది. కానీ మళ్ళి 1999లొ పునః ప్రారంభం అయింది. కానీ చక్రపాణి, నాగిరెడ్డి ల కుటుంబ సంస్థగా ఉన్న విజయ పబ్లికేషన్స్, చందమామ యాజమాన్యం 2009 నాటికీ ముంబైకి చెందినా జియోదేశిక్ అనే software సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చందమామ online లో కూడా దొరుకుతోంది.

No comments:
Post a Comment