వివాహ మంత్రాల లోని అర్ధాలు.: (క్రిందటి భాగం తరవాయి)
బ్రహ్మముడి వేయుటలోని అంతరార్ధం:
వధూవరుల కొంగులు ముడి వేస్తూ --ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని స్తిరత్వమును కలుగజేయుదురు గాక. తరువాత వరుడు వధువు చేయి పట్టుకొని " ఇంటి యజమనురలవుగా సర్వమునకు పెత్తనము వహించి తీర్చి దిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము" అని పలుకును.
ాణిగ్రహణము:
పెద్దలు ఎట్లు ఆచరిన్చిరో అట్లే నేనునూ, మంచి సంతతి కొరకు నీ హస్తమును గ్రహించు చున్నాను. మన పూర్వులు శిరొధార్యమగు శీలముతో ఎట్లు వెలుగొన్దిరొ అట్లు వెలుగొన్దునత్లు ఈమెను సరస్వతి సమగ్రముగా రక్షించు గాక! లోకములోని జీవులకు ఈమెను అగ్రగన్యగా చేయుగాక! అని వరుడు పలుకును.
సప్తపది ఘట్టము లోని మంత్రాల అర్ధములు ఇదివరకే చెప్పుకొని ఉన్నాము.
ఇట్లు మన హిందూ వివాహ కార్యక్రమములోని అన్ని ఘట్టములలో స్త్రీకి ప్రముఖ పాత్ర ఇచ్చి యున్నారు.వివాహ బంధముతో ఆమెను ఒక కుటుంబములోనికి ఆహ్వానించి ఆమెను సర్వానికి అధిపతిని చేయుచున్నారు. ఒక ఇంటికి ఇల్లాలే అధిదేవత. ఆమె చేతి మీదుగానే కుటుంబ కార్యక్రమములు జరుగవలెను . ఇవన్ని ఈ మంత్రముల వల్ల స్పష్టము అవుతున్నాయి. ఇవి తెలియని వారు మన వివాహ తంతు గురించి పెడగా మాట్లాడుతున్నారు. యొక్త్ర ధారణ విషయములో, కాడి నుంచి జలమును పంపే విషయములో, ఇలా ఎన్నో రకాలుగా పెడార్ధాలు తీసి మాట్లాడుతున్నారు. వారందరూ ఈ మంత్రముల అర్ధం తెలుసుకొంటే బాగుంటుంది. ఇవన్ని పెద్దవాళ్ళు చిన్నవల్లకు చెపితే బాగుంటుంది. కానీ చెప్పే ఆసక్తి, పెద్దలకు గానీ , పురోహితులకు గాని, వినే జిజ్ఞాస పిల్లలకు, వధూవరులకు కానీ ఉండడం లేదు. వేదకాలం నుంచి స్త్రీకి సమాజంలో ఎంతో విలువ ఇచ్చారు. దురదృష్ట వశాత్తు ఈరోజుల్లో మగవారికి, ఆడువారికి విలువ ఇవ్వడం చేతకావట్లేదు. ఇచ్చిన విలువని నిలుపుకోవటం ఆడువారికి చేతకావట్లేదు.
దయచేసి మన వివాహ పద్ధతిని అపహాస్యం చేయకండి. వేరే మతాల వాళ్ళు అపహాస్యం చేస్తే ఒప్పుకోకండి. సమాధానం చెప్పండి.

No comments:
Post a Comment