Monday, 13 January 2014

శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యం జగద్వ్యాపినీం

వీణాపుస్తక ధారిణీం అభయదాం జాద్యామ్ధకారాపహాం

హస్తే స్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితం

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ల్

సరస్వతీదేవి శుద్ధ సత్యస్వరుపురాలు కనుక శుక్ల వర్ణంతో ప్రకాశిస్తుంది. ఆ ఆద్యాశక్తి జగద్వ్యాపిని. వీణ, పుస్తక, అభయ, స్పతికామాల ధరించిన నాలుగు చేతుల విద్యామయి. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. ఆ పరమేశ్వరి పద్మాసన సంస్థిత. బుద్ది ప్రదాయిని. ఈ స్తోత్రంతో సరస్వతిదేవిని ప్రార్ధిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు పుస్తక రూపిణి సరస్వతి పుజని చేసి ఈ స్తోత్రాన్నిపఠించిన వారికి విద్యాభివృద్ది కలుగుతుంది.

No comments:

Post a Comment