ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటారు. ఈ లోకోక్తి వచ్చిన రోజుల్లో ఎలా ఉండేదో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ఈ మాట అక్షరాల నిజం. ధనం చుట్టూనే లోకం తిరుగుతోంది. సంపాదన, ఆస్తులు సమకూర్చుకోవడం అనేవి అందరి వ్యక్తిగత విషయాలు. దాని గురించి మాట్లాడక్కరలేదు. కానీ, సమాజంలో ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే గౌరవం. అది ఎలా సంపాదించినా సరే. వాళ్ళ మనసు, మంచితనం ఎలా వున్నా లెక్క లేదు. అలాగే పెళ్ళిళ్ళు ,పేరంటలలో నగలు ఒంటి నిండా వేసుకున్న వారికే ప్రధమ తాంబూలం. ఎందుకు సమాజం ఇలా మారిపోతోంది? ఇదివరకు రోజుల్లో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అన్న, వదిన, మామయ్య, అత్తయా, పిన్నిగారు అంటూ వరసలు కలిపి పిలుచుకునేవారు. ఇపుడు వరసైన వాళ్ళు కూడా డబ్బు మూలంగా విడిపోతున్నారు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఏ బంధుత్వం మిగలటం లేదు. ఎవరో చెప్పినట్టు ఏ బంధుత్వం కూడా సహజంగా చెడిపోదు. అహంకారం, చిన్న చూపు, అపార్ధాల వల్లనే రిలేషన్స్ చెడిపోతాయి. మరి ఒక కడుపున పుట్టిన వాళ్ళలో కూడా ఎందుకు ఈ రాగ ద్వేషాలు పెరుగుతున్నాయి? ఒక అనుబంధం, అభిమానం లని మించి మనకు అహంకారం, అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయి? ఇదిఇంచుమించు ప్రతి ఇంట్లోను జరుగుతోంది. కాలం మారుతోందా? లేక మనుషులు మారుతున్నార? నిజంగా ఇది డబ్బు చేస్తున్న మాయేనా? లేక మనుషుల మనసులు పెడదార్లు తొక్కుతున్నాయ?
No comments:
Post a Comment