వాగ్భూషణం భూషణం....
భర్తృహరి చెప్పిన ఈ మాట అన్ని కాలాలకి పనికి వచ్చే మాట. మనం ఎక్కడో, ఒక సభ కో ఒక ఫంక్షన్ కో వెళతాము. అక్కడ కొత్తవారితో పరిచయం చేసుకుంటాము. అవతలి వారి వివరాలు (ఆస్తులు, చదువు, ఉద్యోగం వగైరా ) మనకు తెలియవు, మన వివరాలు వారికీ తెలియవు. కేవలం మాటని, పలకరింపుని బట్టే ఎదుటి వారి మనస్తత్వాన్ని మనం అంచనా వేస్తాము. మాట బాగుంటే పరిచయం పెరిగి స్నేహం గా మారుతుంది. పలకరింపు బాగాలేకపోతే అంతటితో వారిని మర్చిపోతాము. ఒక మనిషికి ( అడ అయినా, మగ అయినా) చక్కటి చదువు , ఆస్తి, ఉద్యోగం ఉండి, పలకరింపు బాగోపోతే, అందరు ఏమి అనుకుంటారు? అన్ని ఉన్నాయి కానీ మాట పద్ధతే బాగోలేదు అనుకుంటారు. అదే పలకరింపు బాగుంటే, చక్కటి చదువు, తో పాటు చక్కటి సంస్కారం కూడా ఉండి అనుకుంటారు. ఒకవేళ ఆస్తులు వగైరా లేకపోయినా మాట, పలకరింపు బాగుంటే, " ఏమి లేకపోయినా , చక్కగా నవ్వుతు పలుకరిస్తున్నారు" అని మెచ్చు కుంటారు. అంటే ఏమిటన్న మాట? అందం, ఆస్తి, చదువు, ఇవన్ని ఉన్నా లేకపోయినా, ముఖం మిద ఒక చిన్న చిరునవ్వు, మంచి పలకరింపు ఉంటె అందరు మనలను అభిమానిస్తారు. మనకన్నా పెద్దవారితో గౌరవంగా, సమవయస్కులతో, మన కన్నా చిన్నవారితో స్నేహంగా, ప్రేమగా మాట్లాడడం అందరు నేర్చుకోవాలి. మనలను ఎవరైనా పలకరించినపుడు ఆ క్షణం మనం ఏవో చికాకులలో ఉండొచ్చు, అయినా కూడా అవన్నీ మర్చిపోయి ఆ క్షణానికి నవ్వుతూ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే, అవతలి వారు కూడా ఆ క్షణమే గుర్తు పెట్టుకుంటారు. మన చికాకులు, ఇబ్బందులు వారికీ తెలియవు కదా.
నలుగురు కలిసి ఉన్నచోట ఎవరో ఒకరిని అదేపనిగా విమర్శించడం, ఎవరో ఒకరిని వేలెత్తి చూపడం.... ఇటువంటి అలవాట్లు మానుకోవాలి. వీటి వల్ల అందరిలో మన గౌరవమే పోతుంది అని గుర్తుంచుకోవాలి. ఇటువంటి వారిని అందరు avoid చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే, మనకు తారస పడిన ప్రతి ఒక్కరిని ఈసడించు కోవడం, తక్కువగా చూడడం, నేనే నీకన్న అన్నిటిలో గొప్ప అనే విధంగా ప్రవర్తించడం మానుకోవాలి. మనం అలా ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నా, వారు భరించి ఊరుకుంటున్నారు అంటే అది వాళ్ల సంస్కారమే కానీ, మన గొప్పదనం కాదు. అందరిని చిన్న చూపు చూసేవారు గమనించ వలసిన విషయం ఇది. సాధ్యమైనంత వరకు ఆత్మ స్తుతి, పరనింద మానుకోవాలి.
కొంత మంది ఎదుటి వాళ్ళు ఏమి చెప్పినా, అన్ని తమకే తెలిసినట్టు వితండవాదం చేస్తూ ఉంటారు. మనం అవునంటే కాదని, కాదంటే అవునని వాదన మొదలు పెడతారు. అటువంటివి కొంత సమయం వరకే ఎవరైనా భరించ గలరు. తరువాత అందరు వారిని విడిచి వెళ్ళిపోతారు అని తెలుసుకోవాలి.
కొంతమంది ఏ శుభకార్యానికి వెళ్ళినా, మర్యాదలు సరిగా జరగలేదు, ఏర్పాట్లు సరిగా లేవు అని నసపెడుతూ ఉంటారు. ఒక శుభకార్యం నిర్వహించాలి అంటే ఆ గృహస్తులు ఎంతో కష్టపడాలి. ఒక్కోసారి నిర్వహణా లోపం జరగోచ్చు. మనకు చేతనైతే వారికీ పని సహాయం చేసి, వాళ్ల భారం తగ్గించాలి. లేదా, కనీసం మాట సాయం చేసి వాళ్ళకి మనో నిబ్బరం కలిగించాలి. కానీ, ఊరికే నసపెడుతూ వాళ్ళకి ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టకూడదు.
విద్య యొసగును వినయము, కాయలున్న చెట్టే వంగి ఉంటుంది , అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది...... ఇటువంటి సూక్తులు ఎన్నో మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. అవి అన్ని ఆచరణలో పెడితే బాగుంటుంది.

No comments:
Post a Comment