Saturday, 1 March 2014

భగవద్గీత పార్ట్ 5:

శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పుచున్నాడు.

యజ్నములన్నియు త్రికరణ శుద్ధిగా ఆచరించినపుడే సుసంపన్నములయి కర్తను సర్వ ప్రాపంచిక బంధములనుండి విమిక్తుని కావించును. ఇందు జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. కర్మనన్నియు జ్ఞానము నందే సమాప్తి యగును. నివు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, వారినుండి జ్ఞానమును గ్రహిమ్పుము. వారికీ ప్రణామము లాచరించి, సేవ చేసి, భక్తీ శ్రద్ధలతో పరమాత్మా తత్వమును చక్కగా అడిగి తెలుసుకొనుము. నీ సేవల వల్ల జ్ఞానులు సంప్రీతులై, ఆ పరమాత్మ తత్వమును నీకు ఉపదేశించెదరు.నివు ఈ తత్వజ్ఞానమును తెలిసికోనినచో, మరల ఈ వ్యామోహములో చిక్కుకొనవు. సమస్త ప్రాణులను నీలో చూడగలవు. ఎంత పాపియైన, జ్ఞానమనే నౌక సహాయముతో పాపమనే సముద్రము నుండి బయటపడగలదు. అగ్ని సమిధలను భస్మము చేసినట్టు జ్ఞానము కర్మల నన్నిటిని భస్మం చేయును. సహన పరాయణుడు, జితేంద్రియుడు, శ్రద్దాలువు అయిన మానవుడు ఈ భగవత్ తత్వ జ్ఞానమును పొందును. వెంటనే అతడు భగవత్ స్వరూపమైన పరమ శాంతిని పొందును. అవివేకి, శ్రద్ధా రహితుడు, మరియు సంశాయాత్ముడు అయిన వానికి ఈ లోకమునందు, మరియు పరలోకమునందు ఎట్టి సుఖము ఉండదు. ఓ అర్జునా! విధి పూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలమునంతటిని భగవద్ అర్పణము గావించుచు, వివేకము ద్వారా సంశయము లన్నిటిని తొలగించుకొనుచు, అంత:కరణమును వశము నందుంచు కొనువానిని కర్మలు బంధింప జాలవు. నీ హృదయమునందు ఉన్న సంశయమునంతను జ్ఞానమనే ఖడ్గముతో ఖండించి యుద్ధమునకు సంసిద్దుడవు కమ్ము...............

No comments:

Post a Comment