శ్రీకృష్ణుడు మరియు ఇలా చెప్పుచున్నాడు.
ఓ అర్జునా! నీకును, నాకును, పెక్కు జన్మలు గతించినవి.వాటిని నేను ఎరుగుదును, నివు ఎరుగావు. నేను నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోవుచున్నప్పుడు, నన్ను నేను సృజించుకొందును. ఒక సాకార రూపముతో అవతరింతును. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్తిరపరచుటకు నేను ప్రతి యుగమునందు అవతరించెదను. ఓ అర్జునా! నా జన్మలు, కర్మములు, దివ్యములు, నిర్మలములు, అలౌకికములు, నా తత్వ రహస్యమును తెలుసుకొన్నవాడు తనువును చాలించిన పిమ్మట మరు జన్మ లేక నన్నే చేరుకొనును. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు, ద్రుఢమైన భక్తీ తో స్థిర బుద్ది కలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు తప: సంపన్నులై నన్ను చేరిరి. మనుష్యులందరూ వివిధ మార్గములలో నన్ను సేవింతురు, నన్ను వారు సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. నాకు కర్మ ఫలాసక్తి లేదు. నా తత్వమును తెలిసినవారును కర్మ బద్దులు కారు.
కర్మ యందు ఆకర్మను, అకర్మ యందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. ఎవని కర్మలు శాస్త్ర సంమతములై, కామ సంకల్ప వర్జిథములై జరుగునో, ఎవరి కర్మలు జ్ఞానగ్నిచే తగలబడునో, వానిని పండితులు అందురు.అంత:కారణమును, శరీర ఇంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామగ్రిని త్యజించువాడు,ఆశారహితుడు అయిన వాడు కేవలము శారీరిక కర్మలను ఆచరించినప్పటికి పాపమును పొందడు. తనకు లభించిన పదార్ధములతో సంతుష్టుడైన వాడు, అసూయా లేనివాడు, హర్ష శోకములకు అతీతుడైన వాడు, సిద్దియండును, అసిద్దియండును సమదృష్టి కలిగి ఉండును.అట్టి యోగి కర్మలను అచరించుచున్నను వాటి బంధములో చిక్కు పడడు పరమాత్మ జ్ఞానమునందే దృష్టి ఉంచు వాడు, యజ్ఞార్ధమే కర్మలను నిర్వహించువాని కర్మలు విలీనమగును.
యజ్ఞ కార్యములందు వినియోగింపబడు సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్త బ్రహ్మము. హవనక్రియ బ్రహ్మము. ఇట్లు బ్రహ్మ కర్మ యందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందిన యజ్ఞ ఫలము కుడా బ్రహ్మమే.
యజ్నవిడులైన సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపు మాపుదురు.యజ్ఞసెశమును అనుభవించు యోగులకు పరమాత్మా యొక్క లాభము కల్గును. యజ్ఞము చేయని వారికీ ఈలోకమే సుఖప్రదము కాదు, ఇక పరలోకము సంగతి చెప్పనేల?

No comments:
Post a Comment