విదురనీతి 67
విదురుడెరిగించిన కొన్ని నీతులను. ధృతరాష్త్రునికి ఆ నీతుల ద్వారా చెప్పిన కొన్ని ఆచరణలు.
** మాతృభూమిని సేవించాలి.
** ధర్మపరాయణుణ్ణి సత్యమనే నావపై దాటిస్తారు.
** భగవాన్!! మాకందరికీ జ్ఞానాన్ని కలిగించు. సత్సంకల్పాలు కలిగించు.
** దేవతలు యజ్ఞయాగాలు చేసేవారిని, పురుషార్ధానికి పాటుపడే వారిని కోరుతారు కాని, సోమరిని ఎప్పటికిని ప్రేమించరు.
** మనమెప్పుడూ మంగళాన్ని కలిగించే వాక్కులనే విందాం.
** పరమేశ్వరా!! మా సంతానానికి సుఖం కలిగించు.
** ఎవరి ధనానికీ, సంపదకూ ఆస్తికి ఆశపడవద్దు.
విద్వాంసులను నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటివానిని నింధించడమే స్వభావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస ధుష్టులకు బలం...దండనీతి రాజులకు బనక్. సేవ స్త్రీలకు బలం. క్షమ గుణశీలికి బలం.
వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం మహాకష్టమైన పని...చమత్కార యుక్తులతో, విశేషార్ధాలను ప్రతిపాదించగల వాని వాక్కు మితంగానే ఉంటుంది. మధుర శబ్దయుతమైన విషయం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్టులతో నిండితే అనర్ధదాయకమవుతుంది. గొడ్డలి దెబ్బలుతిన్న అరణ్యం లోని వృక్షాలు చిగురించవచ్చు. కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు.
ప్రబూ! వృధ్ధులూ, గురువులూ లేనిది సభ కాదు. ధర్మం చెప్పలేనివాడు గుర్వూ, వృధ్ధుడూ కాదు. సత్యబధ్ధం కానిది ధర్మం కాదు. కపటమైనది సత్యం కాదు. సత్య., వినయశాస్త్రజ్ఞానము, కులీన, శీల, బల, ధన, శూరత్వ, విద్యా, మృదుభాషితాలు స్వర్గహేతువులు. నిందితుడెప్పుడూ పాపకర్మలే చేస్తూ తత్ఫలమే పొందుతారు. పుణ్యాత్ములు సత్కర్మలే చేస్తూ స్వర్గం చేరుతాడు. పాపకర్మలు బుధ్ధిని నశింపచేస్తాయి. ధీమంతుడు సత్కర్మలే ఆచరిస్తూ ఏకాగ్ర చిత్తుడై పుణ్యకర్మ రతుడౌతాడు.

No comments:
Post a Comment