"తెలుగు భాషా దినోత్సవం"...ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మన భాషను మనమే చంపేసుకుంటున్నాం కనుక...ఓ పక్క భాషను పూర్తిగా కప్పెట్టెయ్యడానికి లోతైన గోతులు తీసేస్తూ, "దినోత్సవం" చేసుకోవడంలో అర్ధం లేదు. ఏడాదికి ఓసారి మన భాషను గుర్తు చేసుకొని వలవలా ఏడవడం మనకే చెల్లింది...ప్రతిరోజూ గుర్తున్నా లేకపోయినా......పక్క వాళ్ళతో అన్నిటికీ పోటీపడతాం...పనికొచ్చే వాటికి తప్ప.....కొంచెం చిత్తశుధ్ధి ఉంటే చాలు...మన భాషను మనం కాపాడుకోవచ్చు.
1. ఎంత హోదాలో ఉన్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడడం.
2. ముఖ్యంగా పెద్దవాళ్లతో పిల్లల సంభాషణ తెలుగులోనే ఉండేలా చూడడం.
3. పిల్లలను ' గొ, తకె థిస్, స్లీప్ బబ్య్ , సిత్ ప్రొపెర్ల్య్ " అంటూ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో పెంచడం..
4. చిన్న పిల్లలకు కాలక్షేపానికి గాడ్జెట్స్ ని ఇవ్వకుండా..ఆడుతూ పాడుతూ వారికి తెలుగు భాష నేర్పించడం..
5. కొంచెం ఎదిగిన పిల్లలకు రామాయణ భారతాల వంటి గ్రంధాలను తెలుగులో పరిచయం చేసి చదివించడం...
6. పిల్లలకు ముఖ్యంగా "ణ, ళ, " వంటి అక్షరాలను ఉచ్చారణ దోషం లేకుండా పలకడం నేర్పించడం....
7. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినపుడు తెలుగులోనే మాట్లాడుకోవడం....మనకు ఉన్న ఈ జాడ్యం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా జోక్స్ వేసినా, మనకు బుధ్ధిరాదు...
ఇవన్ని మనం మన పిల్లల పట్ల ఆచరిస్తే, తెలుగు భాష ఇంకో తరం పాటు సజీవంగానే ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే, మరో తరం వరకు భేషుగ్గా వెలిగిపోతుంది మన భాష...మన తెలుగు కే సొంతం అయిన పద్య రచన, అవధానాలు, రంగస్థల నాటకాలు ఇటువంటి వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. మొదట్లో పిల్లలు వినకపోతే, ఓ పెద్ద బాలశిక్ష పుస్తకమో, తెలుగు లో బొమ్మల రామాయణాలో, కథల పుస్తకాలో వాళ్ళ కంటికి ఎదురుగా ఉండేటట్లు పెట్టండి. వాటినలా చూసి, చూసి, వాళ్ళకే ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న నీతి కథలు, సామెతలు, ఇటువంటికి ఆసక్తిని పెంచేలా చెప్తే, పిల్లలకు భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస పుడుతుంది.
ఎవరైనా తల్లితండ్రులు మా పిల్లలకు తెలుగు మాట్లాడ్డం, చదవడం చేతకాదండీ అని బీరాలు పోయినపుడు రోతెక్కిపోతుంది..ఆ తప్పు ఎవరిది? పిల్లలది కాదు..ఖచ్చితంగా పెద్దవాళ్ళదే...

No comments:
Post a Comment