"నాకు నచ్చిన పుస్తకం" శీర్షికన ఈరోజు నేను ఒక రష్యన్ అనువాద నవల గురించి పరిచయం చేయబోతున్నాను. మా చిన్నతనాల్లో చాలా రష్యన్ నవలలు తెలుగులోకి అనువాదం అయ్యేవి..అప్పుడు ఆ నవలలు చదివే అలవాటు ఉన్నవారు ఈ నవల చదివే ఉంటారు..
నవల పేరు "సెర్యోష". ఒక ఏడుసంవత్సరాల పిల్లవాడి కథ. మన దేశంలో లాగా, చిన్నతనం నుంచీ పుస్తకాలతో కుస్తీ పట్టించడం విదేశాలలో అలవాటులేదు, అందునా రష్యాలో పిల్లలకు, వారి భవిష్యత్ కీ ఎంతో విలువ ఇచ్చేవారు కాబట్టి అక్కడ చిన్నపిల్లలపై అంత చదువు ఒత్తిడి లేదు...
సెర్యోష ఏదు సంవత్సరాల పిల్లవాడు. వాడి చిట్టి బుర్రనిండా ఎన్నో సందేహాలు..వాడి చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో గమనించవలసిన విషయాలు ఎన్నెన్నో...ప్రతి రోజూ రాత్రి అయ్యేలోపల వాడికి చుట్టూ ఎన్నో ఆశ్చర్యాలు..ప్రతీదాన్నీ అనుభవించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస తో రాత్రి అయ్యేసరికి ఒంటినిండా గాయాలు, ఎంతో అలసట.
వాళ్ళు నివసించే ఆ చిన్ని పట్టణంలో వాళ్ళు ఉండే "దాల్నయ వీధి" లో వాడు, వాడికన్నా వయసులో పెద్దవాళ్ళైన కొంతమంది ఫ్రెండ్స్...వాస్య, జేన్య, షూర, లీద (అమ్మాయి) .....అందరివీ మధ్యతరగతి కుటుంబాలే...ఒక్కొక్కరిదీ ఒక్కో కుటుంబ నేపధ్యం...యుద్ధసమయం..ముసలివాళ్ళు తప్ప వయసులో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతే, ఎదిగీ ఎదగని ఈ పిల్లలే కుటుంబ బాధ్యతలు తీసుకోవడం....వీటన్నిటి మధ్య పెరుగుతున్న సెర్యోష కు జీవితం అంటే అవగాహన లేదు...తెలిసినదల్లా తాను, తన స్నేహితులు, తన ఇల్లు, అమ్మ, పాష అత్తయ్య, లుక్యానిచ్ మామయ్య...యుధ్ధంలో సెర్యోష తండ్రి ఎంతో కాలం ముందే మరణించడంతో అతనికి తండ్రితో పరిచయం లేదు...అసలు నాన్న అనే మాటకు అర్ధం తెలియదు...తల్లి వీడి భవిష్యత్ కోసం మరల పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది..కొత్త నాన్న వాడిని ఏమాత్రం ప్రేమించలేడని భయపెట్టినప్పటికీ తనకు కొత్త తండ్రిగా వచ్చే "కొరొస్తెల్యోవ్" తనకు ముందే పరిచయం కావడం వల్ల, అతను చాలా మంచివాడని నమ్మిన సెర్యోష అతనితో తనకు ఇబ్బంది ఏమీ ఉండదని నమ్ముతాడు. అతని ప్రేమలో జీవితంలో కొత్త పొజిషన్ ని ఎంతో ఆనందంగా అనుభవిస్తుంటాడు.. వాడికి గుండె కొట్టుకోవటం, కొత్తనాన్న వచ్చిన రోజునే తనను చిన్న పిల్లవాడిగా పరిగణించకుండా పెద్ద కుర్రాడిలాగా చూడడం, ఓ ట్రైసికిల్ కొనిస్తానని మాట ఇవ్వడం, పొడవైన తండ్రి భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని జయించినంత గర్వంగా బయటకు వెళ్ళడం, ఇవన్నీ అంతులేని ఆశ్చర్యానికి కారణాలే...
కొత్త పరిచయాలు, కొత్త బంధువులు, కొత్త బంధాలు..కొత్త నాన్న యొక్క తల్లి మరణం వాడికి భయం కొల్పుతుంది.. నేవీలో పనిచేసే వాస్య మామయ్య వంటి మీద ఉన్న పచ్చబొట్టులు చూసిన పిల్లలందరూ సొంతంగా ట్రై చేయడం సెర్యోష ప్రాణాలమీదకి వస్తుంది...వాడికి కొత్తగా తమ్ముడు పుట్టడం కూడా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం...అంత చిన్న దేహంతో, అంత చిన్న తలకాయతో ఉన్న పిల్లవాడు ఎలా ఊపిరితీసుకుంటాడో కూడా వాడికి అయోమయమే...
ఇంతలో తండ్రికి వేరే ఊరు బదిలీ అవుతుంది. అక్కడి మంచుతో కూడిన వాతావరణం సెర్యోష కు పడదని, వాడిని ఇక్కడే ఉంచేసి తల్లి, తండ్రి, తమ్ముడు మాత్రమే వెళ్ళాలని వారు తీసుకున్న నిర్ణయంతో హతాశుడవుతాడు....కానీ, తండ్రి అప్పుడెప్పుడో మగవాళ్ళు ధైర్యంగా ఉండాలి, లేకపోతే ఇంటిని ఎలా చూసుకుంటారు, యుద్ధం ఎలా చేస్తారు అనే మాట మేరకు కన్నీళ్ళు , బాధ గొంతులోనే ఆపుకుంటాడు. ..చివరి క్షణంలో వాడి ముఖంలోకి చూసిన తండ్రి తట్టుకోలేక ఆరునూరైనా సరే, వాడిని కూడా తమతో తీసుకెళ్ళాలని తీసుకున్న నిర్ణయం వాడికి తండ్రి మీద మరింత ప్రేమను, నమ్మకాన్ని పెంచుతుంది...
క్లుప్తంగా ఇదీ కథ....అయితే ఈ నవలను రాసిన రచయిత్రి, "వేర పనోవా" తన ముందు మాటలోనే "ఈ నవల నేను కేవలం పిల్లల కోసమే కాక, తల్లితండ్రుల కోసం, భార్యాభర్తల కోసం వ్రాసాను" అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీ లేదు...... మనం సాధారణంగా "చిన్నపిల్లాడివి, మాట్లాడకు, నోర్మూసుకో, చిన్నపిల్లాడు, వాదికేం తెలుస్తుంది" అని కొట్టివేసే వాళ్ళ మనసుల్లో ఎంతటి దృఢమైన ఆలోచనలు ఉంటాయి, ప్రతి విషయాన్నీ ఎంత కూలంకషంగా ఆలోచించగలరు అనే విషయం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది ఈ పుస్తకం చదివితే....ఈ పుస్తకాన్ని ఆమె తన పిల్లలు నతాల్య, యూరియ్, బోరిస్ లకు అంకితం ఇవ్వడంలోనే ఆమె పిల్లలకు ఎంత విలువ ఇస్తుందీ అర్ధం అవుతుంది. ఈ నవలను 1960 లో సినిమా గా కూడా తీసారు..అనుకుంటాను సినిమా పేరు....ఈ చిత్రానికి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి...
పిల్లలను అక్కర్లేని కట్టుబాట్లు, కచ్చడాల్లో పెంచకుండా, అవసరమైన విషయాలలో తగినంత స్వేచ్చ ఇస్తే, పిల్లలు ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు, ఎంత వికాసాన్ని పొందుతారు, ఎంత పాజిటివ్ గా ఆలోచించగలుగుతారు, ఎంత ధైర్యంగా పెరుగుతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు...
ఈ నవల మూల రచయిత్రి "వేర పనోవా"...శ్రీ ఉప్పల లక్ష్మణ రావు గారు తెలుగులోకి అనువాదం చేసారు. ప్రగతి ప్రచురణాలయం , మాస్కో వారు ప్రచురించారు.....అప్పట్లో ఈ పుస్తకం వెల ఒక్క రూపాయి. .ఈ కాలం లో వచ్చిన మరికొన్ని పుస్తకాలు పిడిఎఫ్ లో దొరుకుతున్నాయి...అందరూ తప్పక చదివి తీరవలసిన పుస్తకం ఇది...

No comments:
Post a Comment