Monday 3 March 2014

ఈమధ్య బయోటెక్నాలజీ లో రిసెర్చ్ చేసిన ఒక మిత్రుడిని కలిసాము. మాటల్లో అయన ఇండియా లో మనుషుల ప్రాణాలకు విలువ లేదండి, మేము U .S  లో రీసెర్చ్ చేసేటపుడు స్టెమ్ సెల్ల్స్ కావాలంటే, దానికి చాల ప్రాసెస్ ఉండేది, ఇండియా లో అయితే ప్రతిష్టాత్మక AIIMS   వంటి సంస్థలో కూడా ఎ నిబంధనలు లేకుండా, చక్కగా ఇచ్చేస్తారు. అయన ఇంకా ఏమి చెప్పారంటే, వీళ్ళకు కావలసిన స్టెమ్ సెల్స్ ను ఆసుపత్రి వాళ్ళు రిక్షా లగేవాళ్ళ దగ్గర్నుంచి, రోజు కూలీ ల దగ్గర్నుంచి వాళ్ళకు నామమాత్రంగా డబ్బులిచ్చి సేకరిస్తారుట. ఎముక ములుగ లోనుంచి వీటిని తీయడం వల్ల, ఆ తరువాత కూడా వారికీ సరియైన చికిత్స, సంరక్షణ లేకపోవడం వల్ల, దాదాపు ఒక ఏడాది పటు వాళ్ళు చాల అనారోగ్యానికి గురి అవుతారు అని.

అయన చెప్పిన మాటల్లో మన దగ్గర మనుషుల ప్రాణాలకు విలువ లేదండి అనే మాట నన్ను ఆలోచింప చేసింది. అవును, మన పాలకులకు, ప్రభుత్వానికి మనుషుల ప్రాణాల విలువ తెలియదు. భారతదేశ ఉనికికి ఆధారమైన రైతన్న పంటలు పండించడానికి వర్షాలు ఉండవు. మోటార్ పెట్టుకుంటే కరంటు ఉండదు. రైతన్న పండించే గింజలే మనకు ఆధారం అని తెలిసినా ప్రభుత్వం ఎ విధమైన చర్యలు తీసుకోదు. ఒకవేళ కానికాలం లో అతివృష్టి, తుపానులు వచ్చిన ముందు హెచ్చరిక చేసే వ్యవస్థ ఉన్నా, అధికారుల అలసత్వం వల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారు.
ఎంతో మంది రైతులు సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి. కరువు తట్టుకోలేక అన్నదాత ఆత్మహత్యలు చేసుకున్నా నిమ్మకు నీరేత్తినట్లుందే ప్రభుత్వం. అవును, మన దగ్గర ప్రాణాలకు విలువ లేదు.

మన దేశం లోని చెతివ్రుత్తులలొ ముఖ్యమైన చేనేత రంగానిది మరో వ్యధ. నేత నేసె కార్మికుడికి ముడిసరుకు సరిగా దొరకదు. చేనేత కు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. నేసిన బట్టకు సరియైన ధర రాదు. ఈ రంగం లో ఇమడలేక అప్పులు తీర్చలేక, ఇంట్లోని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న నేతకారులు ఎంతమందో? అయినా మన నేతల కళ్ళకు ఇవి ఏవి కనబడవు. అవును, మన దగ్గర ప్రాణాలకు విలువ లేదు.

విద్యారంగం లో కూడా, రిజర్వేషన్స్ పుణ్యమా అని, ప్రతిభకు సరియైన గుర్తింపు లేదు. విదేశాలకు వెళ్లి చదువుకునే, లేదా ఉద్యోగం చేసే భారతీయులకు అక్కడ రక్షణ లేదు. వారి ప్రాణాలకు భరోసా లేదు. వారానికి కనీసం ఒకటి రెండు కధనాలు వింటూనే ఉన్నాం. విదేశాలలో భారతీయుల హత్య అంటూ. వీటిని అపేవాళ్ళు లేరు. కనీసం వారి మృతదేహాలను వెంటనే వారి కుటుంబీకులకు చేర్చే వ్యవస్థ కూడా మనకు లేదు .

ఇక ఆడపిల్లల రక్షణ, వారి మిద అకృత్యాలు అనే విషయం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆడవారి మిద అకృత్యాలు చేసే మృగాలకు వెంటనే శిక్ష పడే పధ్ధతి మనకు లేదు. విచారణలు, వాయిదలతోనే కాలం గడిచిపోతుంది. వెంటనే కఠిన శిక్షలు అమలు చేస్తే నేరం చేయాలన్న, ఒక భయం ఉంటుంది. ఇక్కడ నేరస్తులకు వెంటనే బెయిల్ దొరుకుతుంది. వారు చేసినది ఎలాంటి నేరమైనా సరే. అదేదో సినిమాలో చెప్పినట్టు, ఇలా కొంతకాలం ఆడపిల్లలు వేధింపులకు, అత్యాచారాలకు గురి అయితే, ఇప్పుడిప్పుడే బయటికి ధైర్యం గా వస్తున్న ఆడపిల్లలు మళ్లీ ఇంట్లో నే బందీ అయిపోతారు.

మన రా.కీ.నా. లకు తమ పదవి, అధికారం, తమ సంపాదన, కొరకు కుమ్ములాడుకోవడం తప్ప, ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం అనే యోచనే రాదు. వాళ్ళు పెట్టె ప్రతి పధకం, అధికారులకు, మధ్యవర్తులకు బంగారు బాతులాగా ఒక ఆదాయ వనరు అవుతుంది తప్ప సామాన్య పౌరుడికి వీసమెత్తు ఉపకారం ఉండదు. మేరా భారత్ మహాన్, భారత్ వెలిగిపోతోంది అని చాటింపు వేసుకోవడానికే తప్ప, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, గూడు సమకూరని ప్రజలు కోకొల్లలు. ఇవన్ని ఆలోచించే తీరిక, ఓపిక మన ప్రభుత్వానికి లేదు. అవును, మన దగ్గర ప్రజల ప్రాణాలకు విలువ లేదు.

No comments:

Post a Comment