Sunday, 30 March 2014

విజయనగరం జిల్లా లోని చారిత్రక నగరం విజయనగరం పట్టణం లో పురప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కన్నుల పండువగా ఒక అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకొంది. దాని పేరు "రామనారాయణం_శ్రీమద్రామాయణ ప్రాంగణం"

ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో నిర్మింప బడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్ళే దారిలో 9 km దూరంలో 20 ఎకరాల విస్తీర్ణం లో ఈ కట్టడం రూపు దిద్దుకొంది.  ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్న హర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది. ఈ కట్టడం రెండు అంతస్తులు గా ఉంది. ఈ కట్టడం ఎక్కుపెట్టిన విల్లు ఆకారం లో ఉంది అని చెప్పా కదా,పై అంతస్తులో ధనువుకు  ఒక చివర, విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 75 murals (కుడ్య చిత్రాలు) లో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం AC . ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా వ్రాసారు. ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 35, మలి సగం కారిడార్ లో 40 మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం-విష్ణువే రామునిగా అవతరించాడు అని. ధనువు మధ్య భాగం లోని కట్టడం లో ఒక పెద్ద వేదిక పైన 70 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టి పడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురులు యొక్క విగ్రహాలు ఉన్నాయి.

కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా 5,6 ఆవ్రుత్తాలలో పూలమొక్కలు ఉన్నాయి.

కింద అంతస్తులో అల్పాహార శాల, అన్న ప్రసాద శాల, గ్రంధాలయం, వేద పాథశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల -- కూడా నిర్మాణం లో ఉన్నాయి. వీటన్నిటికి, శబరీ, సుగ్రీవ, -- ఇలా రామాయణం లో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఔషధి వృక్షాలతో కనువిందు చేస్తుంది.

పైన ఉన్న కుడ్య చిత్రాలలోని రామాయణ పాత్రలు ఎంతోఅందంగా  సజీవంగా ఉన్నాయి. ఇవి అన్ని 3d ఎఫెక్ట్ తో ఉన్నాయి. సీతాదేవి యొక్క సన్నని మేలి ముసుగు కూడా ఎంతో అందంగా ఉంటుంది. అది చూడవలసినదే కాని వర్ణించ సాధ్యం కాదు. మనం ఇంత వరకు salarjung museum  లోనే రెబెక్కా యొక్క మేలిముసుగును చూసి ఆశ్చర్యపోయాం. ఇక్కడ ఉన్న కుడ్యచిత్రాలు రెబెక్క కు తీసిపోవు. మొత్తం ఎంతమంది శిల్పులు, చిత్రకారులు, ఇతర కార్మికులు ఎన్ని రోజులు , ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కానీ వారి కష్టం అంతా ఈ కట్టడం లోను, ఈ చిత్రాలలోనూ ప్రతిఫలిస్తోంది.

ఇంతవరకు, దేశం లో పలుచోట్ల  బిర్లాలు నిర్మించిన ఆలయాలను చూసి ఆనందించాం, ఆశ్చర్యపోయాం. ఈ ఆలయం వాటికీ సాటి వస్తుంది. ఇక విజయనగర ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు మాకు కూడా అటువంటి ఆలయం ఉంది అని.

విజయనగరానికి చెందిన NCS  charitable  trust స్థాపకులు,  నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తిగారి సంకల్పం తో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చ్ 22, 2014 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహ మూర్తిగారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వర రావు గారితో సహా ఎందఱో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింప చేసారు.

ధనువు ఆకారం లో ఉన్న ఈ కట్టడం రాత్రి పూట విద్యుత్ వెలుగులలో అచ్చం ధనువు లాగే కనపడుతోంది. ఈ ఆలయాన్ని, పగలు ఒకసారి చూసినా, రాత్రికూడ ఒకసారి దర్శించుకోండి. ఆ అనుభూతే వేరు.

ఇప్పటికే సంగీత సాహిత్య పరంగా ఎంతో పేరెన్నిక గన్న విజయనగరం పట్టణం ఇపుడు భక్తీ పరంగా కూడా ఎంతో ఖ్యాతిని పొందుతోంది. ఇటువంటి మహత్తర ఆలయాన్ని మా సొంతం అని చెప్పుకునే విజయనగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు.

Friday, 28 March 2014

సోనియా గాంధీ ఎవరు?;;

నిజం చెప్పాలంటే సోనియా గాంధీ అని వాస్తవంగా ఎవరూ లేరు. పాస్ పోర్ట్ లో ఆవిడ పేరు సోనియా కాదు, గాంధీ కాదు. హేద్విగ్ అన్తోనియా అల్బిన మొఇనా ఆవిడ అసలు పేరు. సోనియా అనేది ఇటాలియన్ పేరు కాదు. అది ఒక రష్యా పేరు. కానీ, ఆంటోనియా ఒక ఇటాలియన్ పేరు అందుకే ఆవిడకు ఇటాలియన్ పాస్ పోర్ట్ ఉంది. రాజీవ్ గాంధీ ని పెళ్ళాడినా ఆవిడ తన అస్తిత్వాన్ని మార్చుకోడానికి ఇష్టపడలేదు.

అసలు రాజీవ్ గాంధీ అసలు పేరు ఏమిటి? రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్, ఒక పఠాన్ ముస్ల్లిం కుటుంబానికి చెందినవాడు. ఇందిరా, ఫిరోజ్ మధ్య ప్రేమ నెహ్రు కుటుంబంలో కలకలం రేపినపుడు మహాత్మా గాంధీ  తన పేరును ఫిరోజ్ కు ఇచ్చి వారి వివాహం జరిగేల చూసాడు. అలా ఒక ముస్లిం గాంధీ పేరుతొ చలామణి అయాడు. ఇందిరా కూడా అప్పటి మతాచారం ప్రకారం ఇస్లాం మతం లోకి మారి, పేరు కూడా మార్చుకున్నది (ట). ఫిరోజ్ అనుమానాస్పద మరణానంతరం ఆమె మళ్లీ గాంధీ అనే పేరును తన పేరు వెనక తగిల్చింది.

తండ్రి:

స్టేఫానో యూజీన్ మైనో సోనియా తండ్రి.  అయన హిట్లర్ సైన్యానికి చెందిన ఒక జర్మన్ జాతీయుడు. హిట్లర్ సైన్యం రష్యా వెళ్ళినపుడు అక్కడ పట్టుబడి  4 సం. కారాగార వాసం చేసాడు. అయన తిరిగి వచ్చిన తర్వాత కూతురుకు సోనియా అని రష్యా పేరును పెట్టాడు. ఆయన జైలులో ఉన్న నాలుగేళ్లలో సోనియా పుట్టింది. సోనియా అసలు తండ్రి ఎవరో ఖచ్చితంగా తెలియదు.

సోనియా తల్లి పులా మైనో . సోనియా కు ఇటలీ లో ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. సోనియా తను ఇటలీ లోని తురిన్ దగ్గర ఉన్న బెసనో లో పుట్టాను అని చెప్పుకుంటారు కానీ, ఆమె స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్న లూసియానా లో పుట్టారు. అది ఒక్కప్పుడు యుద్ధం లో పాల్గొన్న జర్మన్ సైన్యం ఉన్న పట్టణం.

ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుకున్నాను అని భారత ప్రభుత్వానికి చెప్పిన మాట ఉత్త అబద్ధం. కేంబ్రిడ్జ్ లోని బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో ఇంగ్లీషు చదువుకున్నాను అని తెలియ చేసే సర్టిఫికేట్ కూడా అబద్ధం . ఆవిడ 5వ తరగతి తరువాత చదువుకోలేదు. ప్రాధమిక విద్యా కూడా పూర్తీ చేయని ఆమె వయసులో ఉన్నపుడు 5 సంవత్సరాలు ఇంగ్లాండ్ లో ఉన్నారు.

సోనియా తన ఇటలీ పౌరసత్వాన్ని ఇప్పటికీ వదులుకోలేదు. భారత రాజకీయాలలో పాల్గొనడానికి అత్తగారైన ఇందిర ఆమె అధికారం ఉపయోగించి ఆమెకు భారత పౌరసత్వాన్ని ఇప్పించారు. వాస్తవానికి అది నకిలీ పౌరసత్వం. అయినా కేంద్ర హోం శాఖా ఏ చర్యలు తీసుకోలేదు.

రాజీవ్ గాంధీ, ఇందిర ల మరణానంతరం ఆమెకు వారసత్వ ఆస్తి లభించింది. రాజీవ్ కు, సోనియా కు కలిపి స్విస్ బ్యాంకు లో 2 మిలియన్ యు. ఎస్. డాలర్లు ఉన్నాయి. (1991 లెక్కల ప్రకారం )

సోనియా సోదరి అలేగ్సంద్రియా కు ఇటలీ లో పురావస్తు సామానులు అమ్మే షాప్ ఉంది. అందులో అమ్మే వన్నీ ఇండియా నుంచి స్మగుల్ చేయబడినవే. వాటిని తనిఖీ చేయని ఎయిర్ ఇండియా విమానాలలో సోనియా నే ఎగుమతి చేసారు.

రాహుల్ గాంధీ కు పుట్టుకతో పెట్టిన పేరు రౌల్ విన్సి. అతనికి హార్వర్డ్ యూనివర్సిటీ లో సీట్ ఇప్పించినప్పటికీ ప్రతిభ లేని కారణంగా అక్కడనుండి వెళ్ళగొట్టారు. అతనికి కుడా ఇటలీ పౌరసత్వం తప్ప భారత పౌరసత్వం లేదు. అతను వేరోనికా అనే ఒక డ్రగ్ మాఫియా లీడర్ కూతురితో కలిసి 1,60,000 డాలర్లు నగదును తిసుకోస్తుండగా బోస్టన్ విమానాశ్రయం లో అరెస్ట్ చేసారు. సుకన్య దేవి అనే ఆమెను సాముహిక బలాత్కారం చేసిన కేసులో రాహుల్ ను అరెస్ట్ చేసారు. కానీ, సుకన్య దేవి పిటిషన్ ను దేశం లోని ఏ కోర్ట్ కుడా రాజకీయ వత్తిడుల మూలంగా అంగీకరించలేదు.


( అంతర్జాలం లో విహరిస్తున్న ఒక కథనానికి స్వేచ్చ అనువాదం )

Thursday, 27 March 2014

గృహస్త ధర్మాలను పాటిస్తే సత్ఫలితాలన్ని అవే వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య లభించడం ఒక మహాభాగ్ర్యం. అటువంటి గృహస్తుడు క్రియవంతుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడూ కాగలుగుతాడు. అనుకున్నవాతిని సాధించ గలుగుతాడు. గృహస్తుని విజయం అతని భార్య పైనే ఆధారపడి ఉన్నది అని భారతం చెప్తూంది. గృహస్తు సుఖ సంతోషాలతో ఉన్నపుడే జీవితం లో ముందడుగు వేయగలడు.రోగార్తుడికి ఔషధం ఎలాంటిదో, గృహస్తుకు భార్య అలాంటిది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపద నైనా గట్టేక్కగలడు.ధర్మపత్ని, ధర్మ అర్ధ కామ సాధనకు ఉపకరణమని, గృహనీతి విద్యకు నిలయం అని, సత్ప్రవర్తన నేర్పే గురువు అని, వంశం పెరుగుదలకు మూలం అని, సద్గతికి ఊతం అని, గౌరవానికి ఏకైక కారణం అని, సంతోషాన్ని ఇచ్చేది అని పురుషుడు గ్రహించాలి. ఎలాంటి ఘట్టాలలో అయినా, ఎట్టి ఆపదలలో నైనా అనుకులవతి అయిన  భార్యను చూడగానే, చుట్టుముట్టిన ఆపాదాలన్నీ తొలగిపోతాయని భారతం బోధిస్తోంది.

గృహస్తు, గృహిణి సహాయం తోనే అతిధి జనులను సంతోష పెడతాడు మర్యాదలు చేసేటప్పుడు యజమాని తన భార్యను ప్రక్కన పెట్టుకున్నపుడు మాత్రమే అతిధిని బాగా గౌరవించినట్టు. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయడానికి పూనుకొన్నపుడు బంగారు  సీతా ప్రతిమను పక్కన పెట్టుకున్నాడు. ధర్మపత్ని ప్రక్కన లేనిదే యాగం చేయడానికి అర్హత లేదు.

ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు . ఎందుకంటే, అతిధి అబ్యాగతులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వీరందరూ గృహస్తు మీదనే ఆధార పడి ఉంటారు. నిజ భార్యతో పరితృప్తి చెందే పురుషుడు అశ్వమేధ ఫలాన్ని పొందగలడు. అఖిలాశ్రమ విధానాలకు గృహస్తాశ్రమమే నెలవు కాబట్టి, ఎ ఇతర ఆశ్రమమూ దానిలో పదహారో వంతు కుడా కాదు అని, నిజ దారైకపరత్వాన్ని గృహస్తు అలవారచుకోవని భారతం చెప్తోంది.

భర్తకు ధర్మార్ధ సుఖాలు కలగాలంటే భార్య అనుకులవతి అయి ఉండాలి. అధర్మంగా ప్రవర్తించే భార్య వల్ల పురుషుడికి అగౌరవం కలుగుతుంది, జీవితం లో సుఖం శాంతి కోల్పోతాడు. వంశ నాశనం సంభవిస్తుంది.

అలాగే సుగుణవతి, అనుకులవతి అయిన భార్యను హింసించే పురుషుడు ఈ లోకం లోనూ, పరలోకం లోనూ సుఖం లేదు. ధర్మ పత్ని యెడల ప్రేమను, గౌరవాన్ని చూపడం భర్త యొక్క ప్రధమ కర్తవ్యమ్. ఇది కాలాతీతంగా అందరు పాటించవలసిన సనాతన ధర్మం.

( ఈనాడు సౌజన్యంతో)

Tuesday, 25 March 2014

ఇదివరకు విదేశాలలో ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాసం, crisis management , వంటి కోర్సులు ఇప్పుడు మన దేశం లో కూడా చాలా ఆదరణ పొందుతున్నాయి. కానీ ఇవి మనకు అవసరమా? అనాదిగా మన భారతీయుల వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దిన మహా గ్రంధాలు రామాయణం, భారతం, భగవద్గీత--ఈ భారతావనిలో జన్మ నొందిన ఎందఱో మహనీయుల చరిత్రలు చాలవా మనకు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించ డానికి? కుమారుని పేరును చరిత్రలో నిలిపిన మాతృమూర్తి జిజియ, పసిపిల్లవాడిని కూడా తీసుకుని యుద్ధరంగం లోకి దూకిన లక్ష్మీబాయి, వీరందరూ మనకు ఆదర్శం కారా? ఈ తరం పిల్లలకు ఈ తరం చదువులతో పాటుగా, ఈ గ్రందాలన్నిటిని ఉగ్గుపాలతో నేర్పిస్తే, భావి భారత పౌరులు మణి పూసలై మెరవరా? ఏ రంగం లో అయినా, ఏ కాలానికైనా,  ఎటువంటి  క్లిష్ట సమస్య కైనా భగవద్గీత లోనే మనకు పరిష్కారం ఇచ్చాడుగా మన కృష్ణ భగవానుడు? సమస్యలకు వెన్ను చూపి పారిపోకుండా మనో ధైర్యం కోల్పోకుండా, పరిస్థితులకు ఎదురొడ్డి విజయాన్ని సొంతం చేసుకునే మార్గం చూపలేదా గీత మనకు? 

చదువును ఆటపాటలతో నేర్పించే యోచన "పెద్ద బాలశిక్ష" దేగా? పిల్లవాడికి మాటలు వచ్చినది మొదలు అమ్మ వెనకాల తిరుగుతూ అలవోకగా పద్యాలూ, శ్లోకాలు, కథలు, కబుర్లు నేర్చేసుకోవచ్చునే?

వీటన్నిటికి కావలసినది తల్లితండ్రులకు కాస్తంత సమయం, శ్రద్ధ, మరికొంచెం ఓపిక. ఈ మూడు ఉంటె, మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉన్నట్టే. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, డాక్టరా, ఇంజినీరా అని ఆలోచించడం తో పాటు, పిల్లలకు సరి అయిన సంస్కారం, బుద్ధులు, మంచి వ్యక్తిత్వం కూడా నేర్పండి. సమాజానికి, దేశానికి మంచి పౌరులను అందివ్వండి.

Sunday, 23 March 2014

వాగ్భూషణం భూషణం....

భర్తృహరి చెప్పిన ఈ మాట అన్ని కాలాలకి పనికి వచ్చే మాట. మనం ఎక్కడో, ఒక సభ కో ఒక ఫంక్షన్ కో వెళతాము. అక్కడ కొత్తవారితో పరిచయం చేసుకుంటాము. అవతలి వారి వివరాలు (ఆస్తులు, చదువు, ఉద్యోగం వగైరా ) మనకు తెలియవు, మన వివరాలు వారికీ తెలియవు. కేవలం మాటని, పలకరింపుని బట్టే ఎదుటి వారి మనస్తత్వాన్ని మనం అంచనా వేస్తాము. మాట బాగుంటే పరిచయం పెరిగి స్నేహం గా మారుతుంది. పలకరింపు బాగాలేకపోతే అంతటితో వారిని మర్చిపోతాము. ఒక మనిషికి ( అడ అయినా, మగ అయినా) చక్కటి చదువు , ఆస్తి, ఉద్యోగం ఉండి, పలకరింపు బాగోపోతే, అందరు  ఏమి అనుకుంటారు? అన్ని ఉన్నాయి కానీ మాట పద్ధతే బాగోలేదు అనుకుంటారు. అదే పలకరింపు బాగుంటే, చక్కటి చదువు, తో పాటు చక్కటి సంస్కారం కూడా ఉండి అనుకుంటారు. ఒకవేళ ఆస్తులు వగైరా లేకపోయినా మాట, పలకరింపు బాగుంటే, " ఏమి లేకపోయినా , చక్కగా నవ్వుతు పలుకరిస్తున్నారు"  అని మెచ్చు కుంటారు. అంటే ఏమిటన్న మాట? అందం, ఆస్తి, చదువు, ఇవన్ని ఉన్నా లేకపోయినా, ముఖం మిద ఒక చిన్న చిరునవ్వు, మంచి పలకరింపు ఉంటె అందరు మనలను అభిమానిస్తారు. మనకన్నా పెద్దవారితో గౌరవంగా, సమవయస్కులతో, మన కన్నా చిన్నవారితో స్నేహంగా, ప్రేమగా మాట్లాడడం అందరు నేర్చుకోవాలి. మనలను ఎవరైనా పలకరించినపుడు ఆ క్షణం మనం ఏవో చికాకులలో ఉండొచ్చు, అయినా కూడా అవన్నీ మర్చిపోయి ఆ క్షణానికి నవ్వుతూ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే, అవతలి వారు కూడా ఆ క్షణమే గుర్తు పెట్టుకుంటారు. మన చికాకులు, ఇబ్బందులు వారికీ తెలియవు కదా.
నలుగురు కలిసి ఉన్నచోట ఎవరో ఒకరిని అదేపనిగా విమర్శించడం, ఎవరో ఒకరిని వేలెత్తి చూపడం.... ఇటువంటి అలవాట్లు మానుకోవాలి. వీటి వల్ల అందరిలో మన గౌరవమే పోతుంది అని గుర్తుంచుకోవాలి. ఇటువంటి వారిని అందరు avoid  చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే, మనకు తారస పడిన ప్రతి ఒక్కరిని ఈసడించు కోవడం, తక్కువగా చూడడం, నేనే నీకన్న అన్నిటిలో గొప్ప అనే విధంగా ప్రవర్తించడం మానుకోవాలి. మనం అలా ఎవరినైనా చిన్న చూపు చూస్తున్నా, వారు భరించి ఊరుకుంటున్నారు అంటే అది వాళ్ల సంస్కారమే కానీ, మన గొప్పదనం కాదు. అందరిని చిన్న చూపు చూసేవారు గమనించ వలసిన విషయం ఇది. సాధ్యమైనంత వరకు ఆత్మ స్తుతి, పరనింద మానుకోవాలి.

కొంత మంది ఎదుటి వాళ్ళు ఏమి చెప్పినా, అన్ని తమకే తెలిసినట్టు వితండవాదం చేస్తూ ఉంటారు. మనం అవునంటే కాదని, కాదంటే అవునని వాదన మొదలు పెడతారు. అటువంటివి కొంత సమయం వరకే ఎవరైనా భరించ గలరు. తరువాత అందరు వారిని విడిచి వెళ్ళిపోతారు అని తెలుసుకోవాలి.

కొంతమంది ఏ శుభకార్యానికి వెళ్ళినా, మర్యాదలు సరిగా జరగలేదు, ఏర్పాట్లు సరిగా లేవు అని నసపెడుతూ ఉంటారు. ఒక శుభకార్యం నిర్వహించాలి అంటే ఆ గృహస్తులు ఎంతో కష్టపడాలి. ఒక్కోసారి నిర్వహణా లోపం జరగోచ్చు. మనకు చేతనైతే వారికీ పని సహాయం చేసి, వాళ్ల భారం తగ్గించాలి. లేదా, కనీసం మాట సాయం చేసి వాళ్ళకి మనో నిబ్బరం కలిగించాలి. కానీ, ఊరికే నసపెడుతూ వాళ్ళకి ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టకూడదు.

విద్య యొసగును వినయము, కాయలున్న చెట్టే వంగి ఉంటుంది , అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది...... ఇటువంటి సూక్తులు ఎన్నో మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. అవి అన్ని ఆచరణలో పెడితే బాగుంటుంది.

Friday, 21 March 2014

దేవుడు ఉన్నాడా? లేడా? అసలు దైవ పూజ ఎందుకు చేయాలి? దేవుడికి అసలు ఇష్టమైన పదార్ధం అంటూ ఉందా? పులిహోర నైవేద్యం పెట్టేటప్పుడు బిర్యానీ ఎందుకు పెట్టకూడదు? కొంతమంది పిల్లలు, కొంతమంది మూర్ఖులైన పెద్దలనుంచి నేను అప్పుడప్పుడు ఎదుర్కొనే ప్రశ్నలు....

* ఏదో ఒక మానవాతీత శక్తి ఈ సృష్టిని నడిపిస్తున్నది అని నమ్ముతున్నపుడు ఆ శక్తిని దైవం అనే పేరుతో పిలవడానికి ఏమిటి అభ్యంతరం? అదీ కాక, ఒట్టి పురాణాల ప్రకారమే కాకుండా, సైంటిఫిక్ గా కుడా భారతం, రామాయణం నిజంగా జరిగాయి అని సాక్ష్యాలు దొరికినపుడు దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్మడానికి ఇంకా ఏమి రుజువులు కావాలి?

* దేవుడు అనే శక్తి ని నమ్మినపుడు, పాపం పుణ్యం అనే పదాలు కూడా నమ్ముతాము. మంచి చేయడానికి కృషి చేస్తాము. చెడు చేయడానికి భయ పడతాము. ఇది చాలదా మనిషి మంచి వైపు అడుగులు వేసి, ఒక స్వచ్చమైన సమాజాన్ని స్థాపించడానికి?

* దైవ పూజ ఎందుకు చేయాలి? క్రమశిక్షణ కోసం. పూజ చేయాలి అంటే, ఉదయాన్నే లేచి, శుద్ధి అయి, పూవులు తెచ్చుకొని, ఇల్లు , వాకిలి శుభ్రం చేసుకొని, అపుడు పూజ చేసుకొంటాము. పూజ అయిన తర్వాతనే ఏదైనా భుజిస్తాము. ఇది ఆరోగ్యకరం. ఎందుకంటే పైన చెప్పిన అన్ని పనులలోను మనకు ఒక వ్యాయామం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇక పూజలు లేని ఇల్లు ఉంటె, ఇల్లు, వాకిలి శుభ్రం చేసేది ఎపుడో, వాళ్ళు స్నానం చేసేది ఎప్పుడో, ఆ భగవంతునికే తెలియాలి. ఒక్కో చోట స్నానం లేకుండానే, వంటలు, టిఫిన్లు కానిచ్చేస్తున్నారు. ఇవన్ని అనారోగ్య కరం. మాకు అన్ని పనులు అయితేనే కానీ స్నానం కుదరదు అంటారు. మరి అన్ని కుదిరినపుడు స్నానం ఎందుకు కుదరదు? సాగుతోంది కనుక. అందుకని దైవం పేరుతో, ఒక క్రమశిక్షణ ను నేర్పారు మన పూర్వులు.

*దేవుడికి ఇష్టమైన పదార్ధం అంటూ ఏది ఉండదు. ఆయా కాలాలకి తగ్గట్టు, ఆయా పండగలలో, మనకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు మనం భుజించడం కోసం దేవుడి పేరు చెప్ప్పారు పెద్దలు. మన ప్రాచీన ఆయుర్వేద పధ్ధతి ప్రకారం  వాత, పిత్త, కఫ దోషాల వల్ల మనకు అనారోగ్యం ప్రాప్తిస్తుంది. ఆయా ఋతువులను బట్టి మన ఆహారంలో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అందుకని మనకు వాటికీ సరిపడా నైవేద్యాలు చెప్పారు పెద్దలు.

* మన శాస్త్రాల ప్రకారం మనిషి లో 3 రకాల తత్వాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలు. వీటి ప్రకారమే, మనిషి యొక్క బుద్ది, నడవడిక ఉంటాయి. మనం సేవించే ఆహారం యొక్క ప్రభావం ఈ గుణాల మిద ఉంటుంది. సాత్విక మైన ఆహారం సేవించే వాడు సాత్వికంగానే ఉంటాడు. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలు మనలో సాత్వికతను పోగొట్టి రజో గుణాన్ని పెంపొందిస్తాయి. అందువలననే మనకు ఉల్లి, వెల్లుల్లి నిషేధం. పులిహోర మొదలైన పదార్థాలలో ఉండే పోపు (తాలింపు) గింజలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. గుడిలో నైవేద్యం అందరికి పంచుతారు కాబట్టి అందరికి ఆరోగ్యం చేకూరుతుంది అని మన పెద్దల ఆశయం.

* మన దేవాలయాలలో ప్రసాదం చేసి, నైవేద్యం పెట్టి అందరికి పంచె పదార్థాలను గమనించండి, అన్ని ఆకలి తీర్చేవే. అంటే సాలిడ్ గా ఉండి  కడుపు నిండుతుంది. అంటే దానిని అందరికి పంచడం ద్వారా, ఎవరూ ఆకలిగా ఉండకుండా, కొద్దో గొప్పో అందరికి కడుపు నిండాలి అనేది మన పూర్వుల ఉద్దేశ్యం.

* డబ్బున్న వాళ్ళని మీరు ఈరోజు అనాధలకు దానం చేయండి అంటే కొంత మంది చేయకపోవచ్చు. అదే మీరు గుడిలో నైవేద్యం కోసం డబ్బులు కట్టండి. మీ పేరు మిద అనాధలకు పంచుతాము. మీకు కూడా పుణ్యం అంటే ఎంతో మంది స్పందిస్తారు. అందుకే మంచి పనులు చేయడానికి, ఇతరుల చేత చేయించడానికి దేవుడుని వాడుకున్నారు మన పెద్దలు.

నాతో ఎంతమంది ఏకీభవిస్తారు?

మన పెద్ద వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఏ వయసుకు ఆ ముచ్చట అని...వాళ్ళు ఏ అర్ధం , సందర్భం లో అన్నారో కాని, కొంతమందిని చూస్తుంటే నాకు ఆ మాటే గుర్తు వస్తుంది. ప్రపంచీకరణ ఫలితమో ఏమో, విదేశీ వస్తువులు అన్ని మన ముంగిట్లోకి వచ్చేసాయి. రోడ్ మీదకి వెళ్తే చాలు, పెద్ద పెద్ద మాల్స్, మనని రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. ఇక ఫర్నిచర్, gadgets  సంగతి చెప్పనే అక్కర్లేదు. అదివరకు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అక్కడక్కడా కనిపించినా, క్రిందటి తరం నుంచి అందరు ఆడపిల్లలు చక్కగా చదువుకొని, (పక్క రాష్ట్రాలకో, వీలైతే విదేశాలకో వెళ్లి ) పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కటి సంపాదన. ఉద్యోగం వచ్చీ రాగానే, సొంత ఇల్లు, కారు, సరదాగా సేద దీరటానికి విదేశీ విహార యాత్రలు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ, వీళ్ళందరూ ఈ లక్ష్య సాధనలో పడి జీవితాన్ని అనుభవిస్తున్నారా అనేది నాకెప్పుడూ సందేహమే. నేను ఈ మధ్య చాల మంది దగ్గర వింటున్నాను రెండేళ్లలో మంచి అల్ట్రా మోడరన్ ఫ్లాట్ కొనుక్కోవాలి, తరువాత ఏడాది విదేశాలకు వెళ్ళాలి. ఇది నా టార్గెట్ అని. ఇవన్ని సమకూర్చుకునే క్రమంలో వయసు, ఆరోగ్యం దెబ్బతినడం లేదా? ఇన్ని లక్ష్యాలు కష్టపడి సాధించిన తరువాత, జీవితాన్ని అనుభవించే రోజులు తగ్గిపోవటం లేదా? కొన్ని చోట్ల ఈ లక్ష్య సాధన కోసం మాతృత్వాన్ని కూడా వాయిదా వేస్తున్నారు కొందరు. ఇవన్ని అనారోగ్య కారణాలు కాదా? పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం అనే పధ్ధతి మంచిదేమో.... లేదా నా ఆలోచనే తప్పంటారా? ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి.

Friday, 14 March 2014

పేరులో ఏముంది:::

పేరులో ఏముంది? చాల ఉంది. ఒక వ్యక్తిని మనం పేరుతోనే గుర్తు ఉంచుకుంటాము. ఒక వ్యక్తీ యొక్క అస్తిత్వాన్ని తెలియచెప్పేది అతని పేరే. ఇదివరకు ఇంట్లో పిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు. దేవుడి పేర్లు ఎక్కువ పెట్టేవారు. ఎందుకంటే ఆ పేరుతొ పిలిచిన ప్రతిసారి పుణ్యం వస్తుంది అని పూర్వుల నమ్మకం.  కొంతమంది ఇంట్లో పెద్దవారి (అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ) పేర్లు పెట్టుకునే వారు వారి గుర్తుగా. అటువంటప్పుడు పిల్లలను పేర్లతో పిలవకుండా, ఏవో ముద్దు పేర్లతో పిలిచేవారు. ఎందుకంటే, పెద్ద వాళ్ళ, దేవుళ్ళ పేర్లు పెట్టి, పొరపాటున పిల్లలను తిడితే అది పాపం అని భావించేవారు. ఒకప్పుడు మొక్కుల ప్రకారం, చేంతాడంత పేర్లు పెట్టేవారు. కాలక్రమేనా ఇపుడు 2,3 అక్షరాలకు పేర్లు కుదించుకుపోయాయి. అక్షరాల లెక్క ఎలా ఉన్నా, ఇపుడు కొన్ని పేర్లకు అర్ధాలు ఉండడం లేదు. రితిక, రిషిత, రీతు, ఇలా ఏవేవో పేర్లు... పేర్లు పెట్టేవారికి అర్ధం తెలియడం లేదు, పిలిపించుకునే వారికీ తెలియడం లేదు. ఈ మధ్య ఒక అబ్బాయి పేరు విన్నా. , వికల్ప్ అట. అంటే ఏంటో మరి.
ఇదివరకు విశ్వనాధ్ అని పేరున్న వాళ్ళని విషు, విశి అని చిన్నగా పిలిచేవారు. ఇపుడు విషు  అని కూడా పేరు పెడుతున్నారు. దయచేసి ఒకటి గమనించండి, మనం ఒక ముహూర్తం నిర్ణయించి, దాని ప్రకారం పుట్టిన బిడ్డకు వేడుక చేసి, అందరి ఆశీర్వచనాల నడుమ పిల్లలకు పేర్లు పెడతాము. అ పేరు యొక్క ప్రభావం, పిల్లల భవిష్యత్ మిద ఉంటుంది. పిల్లల జన్మ నక్షత్రాల బట్టి కూడా పేర్లు నిర్ణయిస్తాము. అందువల్ల పిల్లలకు ఫాషన్ పేరుతొ అర్ధం పర్ధం లేని పేర్లు పెట్టకండి. మన పురాణాల్లోను, సాహిత్యం లోను, వెతికితే ఎన్నో గొప్ప పేర్లు దొరుకుతాయి. ఎంతో అందమైన పేర్లు దొరుకుతాయి, అసలు ఆడపిల్లలకు పేర్లు పెట్టాలంటే లలిత సహస్ర నామం తిరగేస్తే సరిపోతుంది. మన తెలుగు సాహిత్యం లో చాల అందమైన పదాలు ఉన్నాయి. ఒకవేళ కొత్త పేర్లు పెట్టాలనుకుంటే, ఎవరినైనా అర్ధం తెలుసుకొని మరీ పెట్టండి.

నమస్కారం,

Friday, 7 March 2014

మహిళా దినోత్సవం అనగానే చాలా సాధారణం గా వినిపించే పదం.... "పరిపూర్ణ మహిళ" . నేటి కాలం లో స్త్రీలు అందరు కూడా చక్కగా పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసి అందులో కూడా ఉన్నత పదవులు సాధిస్తున్నారు. చాలా మంది మహిళలు టాక్సీ డ్రైవర్లు గా, లారీ డ్రైవర్లుగా, పైలట్లుగా, యుద్ధ పైలట్లుగా, లోకో డ్రైవర్లు గా పని చేస్తున్నారు. సైన్యంలో కూడా మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. .... ఏమాత్రం భయపడకుండా సైన్యంలోకి తమ పిల్లలను, భర్తలను పంపిస్తున్న మాతృ మూర్తులకు....ధర్మ పత్నులకు నా శతకోటి వందనాలు. అలాగే ఫైనాన్సు రంగం లో బ్యాంకింగ్ రంగంలో, పరిశోధనా రంగంలో అనేకమంది ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. ఆ మహిళలు అందరికి వందనములు.

ప్రఖ్యాతి చెందిన మహిళలే కాక, సాధారణ జీవితం గడిపే స్త్రీలు కుడా ఎంతోమంది ఎన్నో త్యాగాలకు ఓర్చి, తమ కుటుంబాలకు ఆసరా అవుతున్నారు. త్యాగం అనే పదానికి సిసలైన తార్కాణం స్త్రీయే. ఎందుకంటే మొట్టమొదట తన తనువుని చీల్చి ప్రాణాన్ని పణం గా పెట్టి ఇంకో ప్రాణికి జన్మనిస్తుంది. ఆ బిడ్డ సక్రమంగా భూమి మిద పడేవరకు తల్లి ప్రాణానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇంత కన్నా త్యాగం భూమి మిద ఉంటుందా? కడుపుతో ఉన్నపుడు, కాన్పు అయ్యాక బిడ్డ ఆరోగ్యం కోసం తను కొన్ని తినడం మానేయాలి, పసిపిల్లల నిద్రకు, ఆకలికి ఒక సమయం అంటూ ఉండదు. అన్నిటికి adjust అయి ఆమె పిల్లలను పెంచుతుంది. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా ఆమెకు కంటిమీద కునుకు ఉండదు. పిల్లలు పుట్టినప్పడి నుండి వారికీ ఒక యోగ్యతా వచ్చి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయేవరకు తల్లికి విశ్రాంతి ఉండదు. త్యాగం అంటే ఇంతకన్నా అర్ధం ఏమి చెప్పగలం? తల్లి గా పడే బాధలు స్త్రీలందరికీ ఒకటే. కానీ వ్యసన పరుడైన భర్త, ఆరళ్ళు పెట్టె అత్తా మామలు, ఆర్ధిక ఇబ్బందులు----వీటన్నిటిని అధిగమించి మనో నిబ్బరంతో జీవితాలు సాగిస్తున్న మహిళా మణులు అందరికి నా శత సహస్ర వందనాలు.

ప్రతి మహిళా దినోత్సవం రోజునా నాకు గుర్తొచ్చే ఒకే ఒక పరిపూర్ణ మహిళ (నా దృష్టిలో) మా అమ్మమ్మగారు వలివేటి వెంకట సీతామహాలక్ష్మి గారు....ఆవిడకు తొమ్మండుగురు సంతానం. చిన్న వయసులోనే మా తాతగారు కాలం చేసారు. అయన కాలం చేసే సమయానికి ఆవిడ కడగొట్టు సంతానానికి ఒకటిన్నర సం.ల వయసు. మా తాతగారు డాక్టర్ గా ప్రైవేటు ప్రాక్టీసు చేసేవారు. అందువల్ల అయన పోయాక పెన్షన్ అది ఏది వచ్చేది కాదు. ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగి ఉన్నారు. మగపిల్లలు చేతికి అంది రాలేదు. అయిన వాళ్ళు అందరు బాధ్యతలు పంచుకోవాలనే భయంతో దూరం అయిపోయారు. ఉన్న కొంచెం పొలాన్ని చూసుకుంటూ దానిమీద వచ్చే ఆదాయం తో, పిల్లలను ఒంటి చేతితో, మగ తోడూ లేకుండా, పైకి తీసుకువచ్చి,పిల్లలకు ఏ లోటు లేకుండా, ఏమి తింటున్నారో, ఎలా ఉంటున్నారో మూడో కంటి వాడికి తెలియకుండా పెంచి మంచి జీవితాలను ఇచ్చారు ఆవిడ. పెంచడం అంటే అలా ఇలా కాదు, మంచి క్రమశిక్షణ తో పెంచారు. (మగపిల్లలకు కూడా ఏమి వ్యసనాలు లేకుండా) . ఆవిడ పిల్లలనే కాదు, మనవలు, మనవరాళ్ళను కూడా ఎంతో క్రమశిక్షణ తో తీర్చి దిద్దింది ఆవిడ. ఆవిడ చెప్పే ఒక్కో సలహా ఒక్కో ఆణిముత్యం. జీవితం లో ఎంతో ఉపయోగపడే సలహాలు చెప్పేవారు. పిల్లలు అందరు దగ్గర దగ్గర ఊళ్ళ లోనే ఉండడం వల్ల ఎవరికీ ఏ సహాయం కావలసి వచ్చినా వెంటనే అటెండ్ అయ్యేవారు. ఇక మా అందరి కాన్పులు ఆవిడ చల్లని చేతుల మీదుగానే జరిగినాయి. ముని మనవలను కూడా చుసిన పుణ్యాత్మురాలు .ఆవిడ కాలం చేసి చాలా సం.లు అయినప్పటికీ ఆవిడతో గడిపిన క్షణాలు నేను అసలు మర్చిపోలేను. ఆవిడ ఋణం ఏనాటికి తీర్చుకోలేను. ఏదో ఉడతా భక్తీ గా ఆవిడ పేరు మిద కొన్ని దేవాలయాలలో డబ్బు కడుతున్నాము.

i miss you a lot ammammaa !

ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు శారీరికం గా అబలలే కాని, మానసిక ద్రుధత్వం కలిగిన వారు. ఎన్నో రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. "ముదితలు నేర్వగా రాని విద్య గలదె ముద్దార నేర్పించినన్ " అన్నట్టు, ఒకప్పుడు కేవలం మగవారికి పరిమితమైన రంగాల్లో కూడా మహిళలు ముందంజ వేస్తున్నారు. ఇది చాల హర్షణీయమైన పరిణామం.అలాగే ఇంటికే పరిమితమైన గృహిణుల పాత్ర కూడా తక్కువ కాదు. గృహిణులు సమయానికి అన్నీ అమర్చిపెడితేనే ఇంట్లోని ఉద్యోగులు , విద్యార్థులు వారి పని సక్రమంగా చేయగలిగేది. అంటే దేశం యొక్క ఉత్పాదకతలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ( క్షమించాలి.... కాంట్రిబ్యూషన్ కు తెలుగు మాట గుర్తు రావడం లేదు ) ఎంత ఉందొ, అందులో సగం గృహిణుల కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే కదా.... నిజానికి ఒక మగ ఉద్యోగి కన్నా కుడా ఒక సాధారణ గృహిణి చేసే పనులు చాల ఎక్కువ. ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకు ఆమె పనులతో అష్టావధానం చేస్తుంది. పిల్లల పోషణ, పెద్దల సంరక్షణ, అందరి చదువులు, అవసరాలు, ఆరోగ్యం, ఇంటి పని, వచ్చే పోయే అతిథుల ఆదరణ.....అసలు ఇంట్లో ఆమె లేకపోతే క్షణం గడుస్తుందా....ఒక సర్వే ప్రకారం ఒక గృహిణి చేసే పనులకు విలువ కట్టి ఆమెకు డబ్బు రూపేణ చెల్లించాలి అంటే మగ వాళ్ళ జీతాలు సరిపోవు అని. ఆమె ఉద్యోగాస్తురాలు అయితే ఆమె ఓపిక గురించి చెప్పనే అక్కరలేదు. అటు ఉద్యోగం, ఇటు ఇల్లు సమర్ధవంతంగా నిర్వహించటం మాటలు కాదు.

కానీ మనం ఆమెకు తగిననత గౌరవం ఇస్తున్నామా అనే సందేహం కలుగుతుంటుంది. ఎవరికైనా పరిచయం చేసేటపుడు, నా భార్య, అని పరిచయం చేసిన వెంటనే, తను ఏమి జాబు చేయదండి, ఇంట్లోనే ఉంటుంది అని వెంటనే చెప్పేస్తారు. ఏదైనా పని పూర్తీ కాకపోతే, ఎం చేస్తున్నావ్, ఉదయం నుంచి ఖాళియే కదా అని వెంటనే అనేస్తారు. కొన్ని ఇళ్ళల్లో పిల్లలు కూడా ఇలాగె అంటారు. ఈ పధ్ధతి పోవాలి.

ఈ సందర్భం గా మహిళలకు కూడా ఒక మాట. ఇంటిని నిర్వహించుకునే హడావిడి లో మనలను మనం అంతగా పట్టించుకోము. ఆరోగ్యం, తిండి, అన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఇంట్లో అందరికి కడుపు తడిమి పెట్టె మనం, మన తిండి విషయంకి వచ్చేసరికి ఉన్న దాంట్లో సరిపెట్టేసుకున్టాము. ఒంట్లో బాగోక పోయినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బధ్ధకిస్తాము. చివరికి మందులు వేసుకోవడానికి కూడా మనలో చాలామంది మహిళలకు బద్దకమే.....

మనకంటూ ఒక వ్యాపకం, ఒక కాలక్షేపం సృష్టించుకోవాలి అని కూడా మనలో కొందరికి తెలియదు. అందరి పనుల లోను మనం కాలక్షేపం చేస్తాము. కానీ మనకంటూ మనం కొంత సమయం కేటాయించు కోవాలి, ఆ సమయం లో కేవలం మన కోసమే మనం బ్రతకాలి. బుక్స్ చదవటం, సంగీతం వినడం, సమస్యలను ప్రక్కన పెట్టి కొంత సేపు రిలాక్స్ అవ్వడం., లేదా చిన్నపుడు వదిలేసినా మన ఆసక్తులు మళ్లీ మొదలుపెట్టడం ,....... ఇవన్ని మనకు ఎవరూ చెప్పరు... ఎందుకంటే ఒక గృహిణికి తనకంటూ కొంత సమయం కావాలి అని ఎవరు గమనించరు కనుక. ఈసారి నుంచి ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు హౌస్ వైఫ్ అని కాకుండా హోం మేకర్ అని చెప్పుకుందాం.

మహిళగా పుట్టినందుకు గర్వపడదాం... స్త్రీయే సర్వ జగతికి ఆధారం. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఉహించుకొలేనట్టే స్త్రీ లేని ప్రపంచాన్ని కూడా ఉహించుకొలెము. తల్లి, చెల్లి, భార్య , కూతురు .... ఇలా ఏదో ఒక రూపం లో స్త్రీ పురుషునికి ఆధారం అవుతోంది. ఇది గమనించుకోలేని వాళ్ళు దాదాపు 2,3 దశాబ్దాల క్రితం వరకట్నం పేరుతొ, మహిళలను హింసించారు. దాని ప్రభావంతో తల్లితండ్రులు కొన్నాళ్ళ వరకు ఆడపిల్లలు పుడతారంటే భయం వేసి పురిట్లోనే వారికీ సమాధి కట్టారు.... ఫలితం.. ఇప్పుడు మగపిల్లల జనాభా కంటే, ఆడపిల్లల జనాభా తక్కువ ఉండడం.

ఇక నాణానికి మరోవైపు అన్నట్టు, మనిషి ఎంత ప్రగతిని సాధించినా, మహిళలపై అత్యాచారాలు ఆగటం లేదు. కుల , జాతి, ప్రాంత భేదం లేకుండా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజు మనం వార్తల్లో వింటూనే ఉన్నాము. మగవారితో సమానంగా చదువుకొని, సమానంగా సంపాదిస్తున్న మహిళలకు బయట రక్షణ ఉండడం లేదు. వారి వర్క్ ప్లేసెస్ లో కూడా ఎంతో వివిక్షకు గురి అవుతున్నారు. ఈ ధోరణి మారాలి. ఉద్యోగులు తమ సాటి మహిళా ఉద్యోగులను గౌరవించాలి, వారికీ సహాయంగా ఉండాలి. సాటి మనిషిని నమ్మలేకపోతున్న ఈ రోజుల్లో మహిళా ఉద్యోగులకు ఒక భరోసా కలిగించాలి. స్కూళ్ళ, కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వం కూడా ఈ వైపుగా అలోచించి మహిళా ఉద్యోగుల, విద్యార్ధుల రక్షణకు చర్యలు తీసుకోవాలి. వారికీ వీలైన , క్షేమకరమైన పని గంటలు కేటాయించాలి. ముఖ్యంగా స్కూళ్ళలో విద్యార్ధినుల ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకోవాలి. ఎన్నో స్కూళ్ళల్లో ఆడపిల్లలకు సరియైన వసతులు ఉండటం లేదు. అటువంటి చోట అక్కడ ఉండే టీచర్లు చొరవ తీసుకోని సమస్యలు పరిష్కరించాలి.


Monday, 3 March 2014

ఈమధ్య బయోటెక్నాలజీ లో రిసెర్చ్ చేసిన ఒక మిత్రుడిని కలిసాము. మాటల్లో అయన ఇండియా లో మనుషుల ప్రాణాలకు విలువ లేదండి, మేము U .S  లో రీసెర్చ్ చేసేటపుడు స్టెమ్ సెల్ల్స్ కావాలంటే, దానికి చాల ప్రాసెస్ ఉండేది, ఇండియా లో అయితే ప్రతిష్టాత్మక AIIMS   వంటి సంస్థలో కూడా ఎ నిబంధనలు లేకుండా, చక్కగా ఇచ్చేస్తారు. అయన ఇంకా ఏమి చెప్పారంటే, వీళ్ళకు కావలసిన స్టెమ్ సెల్స్ ను ఆసుపత్రి వాళ్ళు రిక్షా లగేవాళ్ళ దగ్గర్నుంచి, రోజు కూలీ ల దగ్గర్నుంచి వాళ్ళకు నామమాత్రంగా డబ్బులిచ్చి సేకరిస్తారుట. ఎముక ములుగ లోనుంచి వీటిని తీయడం వల్ల, ఆ తరువాత కూడా వారికీ సరియైన చికిత్స, సంరక్షణ లేకపోవడం వల్ల, దాదాపు ఒక ఏడాది పటు వాళ్ళు చాల అనారోగ్యానికి గురి అవుతారు అని.

అయన చెప్పిన మాటల్లో మన దగ్గర మనుషుల ప్రాణాలకు విలువ లేదండి అనే మాట నన్ను ఆలోచింప చేసింది. అవును, మన పాలకులకు, ప్రభుత్వానికి మనుషుల ప్రాణాల విలువ తెలియదు. భారతదేశ ఉనికికి ఆధారమైన రైతన్న పంటలు పండించడానికి వర్షాలు ఉండవు. మోటార్ పెట్టుకుంటే కరంటు ఉండదు. రైతన్న పండించే గింజలే మనకు ఆధారం అని తెలిసినా ప్రభుత్వం ఎ విధమైన చర్యలు తీసుకోదు. ఒకవేళ కానికాలం లో అతివృష్టి, తుపానులు వచ్చిన ముందు హెచ్చరిక చేసే వ్యవస్థ ఉన్నా, అధికారుల అలసత్వం వల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారు.
ఎంతో మంది రైతులు సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి. కరువు తట్టుకోలేక అన్నదాత ఆత్మహత్యలు చేసుకున్నా నిమ్మకు నీరేత్తినట్లుందే ప్రభుత్వం. అవును, మన దగ్గర ప్రాణాలకు విలువ లేదు.

మన దేశం లోని చెతివ్రుత్తులలొ ముఖ్యమైన చేనేత రంగానిది మరో వ్యధ. నేత నేసె కార్మికుడికి ముడిసరుకు సరిగా దొరకదు. చేనేత కు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. నేసిన బట్టకు సరియైన ధర రాదు. ఈ రంగం లో ఇమడలేక అప్పులు తీర్చలేక, ఇంట్లోని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న నేతకారులు ఎంతమందో? అయినా మన నేతల కళ్ళకు ఇవి ఏవి కనబడవు. అవును, మన దగ్గర ప్రాణాలకు విలువ లేదు.

విద్యారంగం లో కూడా, రిజర్వేషన్స్ పుణ్యమా అని, ప్రతిభకు సరియైన గుర్తింపు లేదు. విదేశాలకు వెళ్లి చదువుకునే, లేదా ఉద్యోగం చేసే భారతీయులకు అక్కడ రక్షణ లేదు. వారి ప్రాణాలకు భరోసా లేదు. వారానికి కనీసం ఒకటి రెండు కధనాలు వింటూనే ఉన్నాం. విదేశాలలో భారతీయుల హత్య అంటూ. వీటిని అపేవాళ్ళు లేరు. కనీసం వారి మృతదేహాలను వెంటనే వారి కుటుంబీకులకు చేర్చే వ్యవస్థ కూడా మనకు లేదు .

ఇక ఆడపిల్లల రక్షణ, వారి మిద అకృత్యాలు అనే విషయం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆడవారి మిద అకృత్యాలు చేసే మృగాలకు వెంటనే శిక్ష పడే పధ్ధతి మనకు లేదు. విచారణలు, వాయిదలతోనే కాలం గడిచిపోతుంది. వెంటనే కఠిన శిక్షలు అమలు చేస్తే నేరం చేయాలన్న, ఒక భయం ఉంటుంది. ఇక్కడ నేరస్తులకు వెంటనే బెయిల్ దొరుకుతుంది. వారు చేసినది ఎలాంటి నేరమైనా సరే. అదేదో సినిమాలో చెప్పినట్టు, ఇలా కొంతకాలం ఆడపిల్లలు వేధింపులకు, అత్యాచారాలకు గురి అయితే, ఇప్పుడిప్పుడే బయటికి ధైర్యం గా వస్తున్న ఆడపిల్లలు మళ్లీ ఇంట్లో నే బందీ అయిపోతారు.

మన రా.కీ.నా. లకు తమ పదవి, అధికారం, తమ సంపాదన, కొరకు కుమ్ములాడుకోవడం తప్ప, ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం అనే యోచనే రాదు. వాళ్ళు పెట్టె ప్రతి పధకం, అధికారులకు, మధ్యవర్తులకు బంగారు బాతులాగా ఒక ఆదాయ వనరు అవుతుంది తప్ప సామాన్య పౌరుడికి వీసమెత్తు ఉపకారం ఉండదు. మేరా భారత్ మహాన్, భారత్ వెలిగిపోతోంది అని చాటింపు వేసుకోవడానికే తప్ప, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, గూడు సమకూరని ప్రజలు కోకొల్లలు. ఇవన్ని ఆలోచించే తీరిక, ఓపిక మన ప్రభుత్వానికి లేదు. అవును, మన దగ్గర ప్రజల ప్రాణాలకు విలువ లేదు.

Saturday, 1 March 2014

భగవద్గీత పార్ట్ 5:

శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పుచున్నాడు.

యజ్నములన్నియు త్రికరణ శుద్ధిగా ఆచరించినపుడే సుసంపన్నములయి కర్తను సర్వ ప్రాపంచిక బంధములనుండి విమిక్తుని కావించును. ఇందు జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. కర్మనన్నియు జ్ఞానము నందే సమాప్తి యగును. నివు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, వారినుండి జ్ఞానమును గ్రహిమ్పుము. వారికీ ప్రణామము లాచరించి, సేవ చేసి, భక్తీ శ్రద్ధలతో పరమాత్మా తత్వమును చక్కగా అడిగి తెలుసుకొనుము. నీ సేవల వల్ల జ్ఞానులు సంప్రీతులై, ఆ పరమాత్మ తత్వమును నీకు ఉపదేశించెదరు.నివు ఈ తత్వజ్ఞానమును తెలిసికోనినచో, మరల ఈ వ్యామోహములో చిక్కుకొనవు. సమస్త ప్రాణులను నీలో చూడగలవు. ఎంత పాపియైన, జ్ఞానమనే నౌక సహాయముతో పాపమనే సముద్రము నుండి బయటపడగలదు. అగ్ని సమిధలను భస్మము చేసినట్టు జ్ఞానము కర్మల నన్నిటిని భస్మం చేయును. సహన పరాయణుడు, జితేంద్రియుడు, శ్రద్దాలువు అయిన మానవుడు ఈ భగవత్ తత్వ జ్ఞానమును పొందును. వెంటనే అతడు భగవత్ స్వరూపమైన పరమ శాంతిని పొందును. అవివేకి, శ్రద్ధా రహితుడు, మరియు సంశాయాత్ముడు అయిన వానికి ఈ లోకమునందు, మరియు పరలోకమునందు ఎట్టి సుఖము ఉండదు. ఓ అర్జునా! విధి పూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలమునంతటిని భగవద్ అర్పణము గావించుచు, వివేకము ద్వారా సంశయము లన్నిటిని తొలగించుకొనుచు, అంత:కరణమును వశము నందుంచు కొనువానిని కర్మలు బంధింప జాలవు. నీ హృదయమునందు ఉన్న సంశయమునంతను జ్ఞానమనే ఖడ్గముతో ఖండించి యుద్ధమునకు సంసిద్దుడవు కమ్ము...............