Tuesday 25 March 2014

ఇదివరకు విదేశాలలో ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాసం, crisis management , వంటి కోర్సులు ఇప్పుడు మన దేశం లో కూడా చాలా ఆదరణ పొందుతున్నాయి. కానీ ఇవి మనకు అవసరమా? అనాదిగా మన భారతీయుల వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దిన మహా గ్రంధాలు రామాయణం, భారతం, భగవద్గీత--ఈ భారతావనిలో జన్మ నొందిన ఎందఱో మహనీయుల చరిత్రలు చాలవా మనకు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించ డానికి? కుమారుని పేరును చరిత్రలో నిలిపిన మాతృమూర్తి జిజియ, పసిపిల్లవాడిని కూడా తీసుకుని యుద్ధరంగం లోకి దూకిన లక్ష్మీబాయి, వీరందరూ మనకు ఆదర్శం కారా? ఈ తరం పిల్లలకు ఈ తరం చదువులతో పాటుగా, ఈ గ్రందాలన్నిటిని ఉగ్గుపాలతో నేర్పిస్తే, భావి భారత పౌరులు మణి పూసలై మెరవరా? ఏ రంగం లో అయినా, ఏ కాలానికైనా,  ఎటువంటి  క్లిష్ట సమస్య కైనా భగవద్గీత లోనే మనకు పరిష్కారం ఇచ్చాడుగా మన కృష్ణ భగవానుడు? సమస్యలకు వెన్ను చూపి పారిపోకుండా మనో ధైర్యం కోల్పోకుండా, పరిస్థితులకు ఎదురొడ్డి విజయాన్ని సొంతం చేసుకునే మార్గం చూపలేదా గీత మనకు? 

చదువును ఆటపాటలతో నేర్పించే యోచన "పెద్ద బాలశిక్ష" దేగా? పిల్లవాడికి మాటలు వచ్చినది మొదలు అమ్మ వెనకాల తిరుగుతూ అలవోకగా పద్యాలూ, శ్లోకాలు, కథలు, కబుర్లు నేర్చేసుకోవచ్చునే?

వీటన్నిటికి కావలసినది తల్లితండ్రులకు కాస్తంత సమయం, శ్రద్ధ, మరికొంచెం ఓపిక. ఈ మూడు ఉంటె, మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉన్నట్టే. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, డాక్టరా, ఇంజినీరా అని ఆలోచించడం తో పాటు, పిల్లలకు సరి అయిన సంస్కారం, బుద్ధులు, మంచి వ్యక్తిత్వం కూడా నేర్పండి. సమాజానికి, దేశానికి మంచి పౌరులను అందివ్వండి.

No comments:

Post a Comment