Thursday 27 March 2014

గృహస్త ధర్మాలను పాటిస్తే సత్ఫలితాలన్ని అవే వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య లభించడం ఒక మహాభాగ్ర్యం. అటువంటి గృహస్తుడు క్రియవంతుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడూ కాగలుగుతాడు. అనుకున్నవాతిని సాధించ గలుగుతాడు. గృహస్తుని విజయం అతని భార్య పైనే ఆధారపడి ఉన్నది అని భారతం చెప్తూంది. గృహస్తు సుఖ సంతోషాలతో ఉన్నపుడే జీవితం లో ముందడుగు వేయగలడు.రోగార్తుడికి ఔషధం ఎలాంటిదో, గృహస్తుకు భార్య అలాంటిది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపద నైనా గట్టేక్కగలడు.ధర్మపత్ని, ధర్మ అర్ధ కామ సాధనకు ఉపకరణమని, గృహనీతి విద్యకు నిలయం అని, సత్ప్రవర్తన నేర్పే గురువు అని, వంశం పెరుగుదలకు మూలం అని, సద్గతికి ఊతం అని, గౌరవానికి ఏకైక కారణం అని, సంతోషాన్ని ఇచ్చేది అని పురుషుడు గ్రహించాలి. ఎలాంటి ఘట్టాలలో అయినా, ఎట్టి ఆపదలలో నైనా అనుకులవతి అయిన  భార్యను చూడగానే, చుట్టుముట్టిన ఆపాదాలన్నీ తొలగిపోతాయని భారతం బోధిస్తోంది.

గృహస్తు, గృహిణి సహాయం తోనే అతిధి జనులను సంతోష పెడతాడు మర్యాదలు చేసేటప్పుడు యజమాని తన భార్యను ప్రక్కన పెట్టుకున్నపుడు మాత్రమే అతిధిని బాగా గౌరవించినట్టు. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయడానికి పూనుకొన్నపుడు బంగారు  సీతా ప్రతిమను పక్కన పెట్టుకున్నాడు. ధర్మపత్ని ప్రక్కన లేనిదే యాగం చేయడానికి అర్హత లేదు.

ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు . ఎందుకంటే, అతిధి అబ్యాగతులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వీరందరూ గృహస్తు మీదనే ఆధార పడి ఉంటారు. నిజ భార్యతో పరితృప్తి చెందే పురుషుడు అశ్వమేధ ఫలాన్ని పొందగలడు. అఖిలాశ్రమ విధానాలకు గృహస్తాశ్రమమే నెలవు కాబట్టి, ఎ ఇతర ఆశ్రమమూ దానిలో పదహారో వంతు కుడా కాదు అని, నిజ దారైకపరత్వాన్ని గృహస్తు అలవారచుకోవని భారతం చెప్తోంది.

భర్తకు ధర్మార్ధ సుఖాలు కలగాలంటే భార్య అనుకులవతి అయి ఉండాలి. అధర్మంగా ప్రవర్తించే భార్య వల్ల పురుషుడికి అగౌరవం కలుగుతుంది, జీవితం లో సుఖం శాంతి కోల్పోతాడు. వంశ నాశనం సంభవిస్తుంది.

అలాగే సుగుణవతి, అనుకులవతి అయిన భార్యను హింసించే పురుషుడు ఈ లోకం లోనూ, పరలోకం లోనూ సుఖం లేదు. ధర్మ పత్ని యెడల ప్రేమను, గౌరవాన్ని చూపడం భర్త యొక్క ప్రధమ కర్తవ్యమ్. ఇది కాలాతీతంగా అందరు పాటించవలసిన సనాతన ధర్మం.

( ఈనాడు సౌజన్యంతో)

No comments:

Post a Comment