Friday, 7 February 2014

2005 కు ముందు వైద్య రంగం లోని ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. ఏంటంటే,,,, 2010 తర్వాత భారత్ లో ఎక్కువ మరణాలు గుండెపోటు వల్ల కాకుండా, కాన్సర్, మరియు, ఉపిరితిత్తుల వ్యాధుల వల్ల సంభవిస్తాయి అని. 2005 కు ముందు భారత్ లో గుండెపోటు మరణాలు ఎక్కువ ఉండేవి. అయితే ఇప్పుడు వాళ్ళ మాట నిజమైంది అనుకోవాలి. ఇప్పుడు సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ శాతం ఈ రెండు వ్యాధుల మూలంగానే జరుగుతున్నాయి. వీటికి ముఖ్యమైన కారణం కాలుష్యం. కాలుష్యం అంటే కేవలం వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. మనం తినే అన్ని ఆహారపదార్ధాలు కల్తివె కావడం . నిరు, గాలి అన్ని కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. జనాభా పెరగడం, అవసరాలు పెరగడంతో వాహనాల సంఖ్య పెరిగింది. అవి వదులుతున్న carbon  monaxide ప్రమాదకర స్థాయిని మించుతోంది. కాలుష్యం ఉపిరితిత్తుల వ్యాధులకు మూలకారణం అవుతోంది.

ఇక కాన్సర్ అంటే మన శరీరం లోని కణాల అనవసర పెరుగుదలను కాన్సర్ అంటాము. దీనికి కొంత వరకు, మన జీవన శైలి కారణం. packed foods , జంక్ ఫుడ్, carbonated డ్రింక్స్--ఇవి మనకు మేలు చేయకపోగా, మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. మన జీవన శైలిలో  కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చు.

వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, టమాటాలు, వీటన్నిటికి కాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంది. అందువల్ల మన రోజువారి ఆహారంలో విటన్నిటిని భాగం చేసుకోవాలి. ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి.
రోజు కొంత సేపైనా వ్యాయామం చేయాలి. తప్పనిసరిగా నడక అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సమయం కేటాయించలేకపోతే, కనీసం 15 నిముషాల చొప్పున రోజుకు 3,4 సార్లు వాకింగ్ చేయాలి.

ఈరోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా దృష్టి లోపాలు ఏర్పడుతున్నాయి. పిల్లలకి కూడా ఆకుకూరలు, రోజుకి ఏదో ఒక పండు కానీ, మిల్క్ షేక్ కానీ అలవాటు చేయండి. అందరిని వేధిస్తున్న మరో సమస్య ఊబకాయం. పాశ్చ్యాత్య దేశాల జీవన శైలిని అనుకరిస్తున్న  మనం వారి జబ్బులను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఊబకాయం ఒకప్పుడు విదేశాలలో ఉన్న సమస్య. ఇప్పుడు మన ముంగిట్లోకి వచ్చేసింది.

కంటి జబ్బులకు, ఊబకాయ నివారణకు ఆయుర్వేదం లోని "త్రిఫల చూర్ణం" చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు పెద్దలు, ప్రతిరోజూ ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. అనేక జీర్ణ సమస్యలను దూరంగా ఉంచుతుంది. థైరాయిడ్ వంటి హార్మోనులకు సంబంధించన వ్యాదులలో సహాయకారి. త్రిఫల చూర్ణం 2 చెంచాలు ఒక కప్పు నీళ్ళలో వేసి నీళ్లు సగం అయ్యేవరకు  మరిగించి వాటితో రోజు కళ్ళు కడుక్కుంటే దృష్టి లోపాలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు చుక్కలు కంట్లో వేసుకున్న మంచిదే. త్రిఫల చూర్ణం వేసి మరింగించిన నీళ్లు జుట్టుకు కూడా చాల మంచిది. ఊబకాయ సమస్యకు తేనే, నిమ్మరసం అనాదిగా వస్తున్నా ఒక వైద్యం. రెండు కలిపి గోరువెచ్చని నీళ్ళలో ఖాలీ కడుపు మిద తీసుకుంటే బరువు తగ్గుతారు అని ఒక నమ్మకం. త్రిఫల చూర్ణం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాగా పనిచేస్తుంది.

ఉసిరి మనకు ప్రక్రుతి ఇచ్చిన సుగుణాల ఖజానా. ఉసిరి నయం చేసే జబ్బుల జాబితా చాల పెద్దది. మన శరీరం లోని ఎ భాగం అనారోగ్యానికి గురి అయినా, ఉసిరిని తీసుకోవటం వలన నయం అవుతుంది. ఉసిరిని, పచ్చడి గానే కాక జ్యూస్, జామ్, మురబ్బ, ఉసిరి పలుకులు, ఇలా ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు.

ఇక తులసి.....దీని విషయం భారతీయులకు వేరే చెప్పనక్కరలేదు. దీని గొప్పతనాన్ని మన పూర్వులు గుర్తించి తులసి ని మన పెరట్లో పెంచుకోవాలి అని చెప్పారు. ఇంగ్లిషు వాళ్ళు కూడా ఈ మొక్కని holy basil అని పేర్కొన్నారు. మన దేవాలయాల్లో కూడా మన ఆరోగ్యం గురించే తులసి ఆకులు, విత్తనాలు వేసిన తీర్థం ఇస్తారు. ఇప్పుడు బజార్లో "తీర్థం పొడి" అని దొరుకుతోంది. అది నీళ్ళల్లో కలుపుకుంటే ఇంట్లోనే తీర్థం రెడీ. తులసి నీళ్ళల్లో ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గిస్తుంది అని ఇటీవలే గుర్తించారు.

ఇక మనం వర్జించవలసిన పదార్థాలలో ముఖ్యమైనది మైదా..... ఇది శరీరానికి హాని చేస్తుంది. ఇందులో ఎ రకమైన పీచు పదార్ధం లేకపోవడం వలన ఊబకాయానికి తోడ్పడుతుంది. ఇంకా జంక్ ఫుడ్, వేపుడులు, ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువ సార్లు మరిగించిన నూనె, కొవ్వు పదార్ధాలు కూడా తీసుకోవడం తగ్గించాలి .

అందుచేత మన ప్రతిరోజూ ఆహారం లో పసుపు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం, ఉసిరి, ఆకుకూరలు, టమాటాలు, తాజా పండ్లు, త్రిఫల చూర్ణం అన్ని కొంచెం ఎక్కువ మోతాదులో వాడడం వలన ఎన్నో జబ్బులను అరికట్టవచ్చు.


1 comment: