నామ జపము ఎందుకు చేయాలి? నామ జపము యొక్క మహిమ ఏమిటి?
కలియుగములో యజ్ఞ యాగాదులు చేయుట , నిర్వహించుట కష్టము. పూజ విధి విధానములు తెలుసుకొని ఆచరించుట అందరికి సులభము కాకపోవచ్చు. విధివిధానా పూర్వకముగా చేయ లేక పోవుట వలన కర్తకు దోషము కలుగవచ్చు. అందువల్ల భగవంతుడు నామ జపము ను భగవంతుని చేరుటకు ఒక మార్గముగా చెప్పియున్నాడు.
ఇందులో ఎటువంటి విధి విధానము లేదు. పిల్లలు, స్త్రీ, పురుషులు, వృద్ధులు, రోగులు కూడా చేయవచ్చు. అన్ని పరిస్తితులలొను, అన్ని సమయములలోనూ చేయవచ్చు. నడుస్తూ, తింటూ, పనులు చేసుకుంటూ, కూడా నామ జపము చేయవచ్చు.
నామజపము మూడు రకాలుగా చేయవచ్చును. 1. మనసుతో ( స్వరము పైకి వినబడకుండా లోలోపల మనసులోనే ధ్యానించు కొనుట. ) 2. వాక్కుతో ( నామము నోటితో పైకి వినబడేలాగా స్మరణ చేయుట)3. కీర్తనము ( గట్టిగా భగవంతుని అనెకవిధములైన కృతులు, భజనలతో కీర్తించుట).
భగవన్నామము భక్తి తో జపించు వారికీ భగవంతుని అనుగ్రహము కలుగును. దుష్ట శక్తుల నుండి విముక్తి లభించును. ఏకాగ్రతతో, అనన్య భక్తితో నామ జపము చేసిన వారికీ భగవద్దర్శనము కలుగును. అవసాన కాలమున ఆర్తితో నామ స్మరణ చేయు వారికీ ఈ జన్మము నందలి పాపములు నశించును.
పాపులకు నామస్మరణ రుచించదు. కానీ, శ్రద్ధ భక్తులతో జపము చేసిన వారికీ పాపమూ క్రమముగా నశించి, నామ జపము నందు అభిరుచి కలుగును.
నామ జపము చేయు సాధకుడు భగవంతుడు తన ఎదుటే ఉన్నాడు అను భావనతో చేయవలెను. క్రమముగా అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అను భావము మనసున నెలకొల్పుకొనవలెను. అందరు ఈ విధముగా ఆలోచించుట వలన సమాజములో శాంతి నేలకోనును.
భగవంతునినామము భక్తీ, శ్రధ్ధలతొనె కాక, హేళనగా, పరిహాసముగా, యాద్రుచ్చికముగ పలికినను ఫలమును పొందుదురు. అజామీళుని కథ అందరికి తెలిసినదే కదా. భక్తులు అందరు ఏ విధమైన ప్రయాస లేకుండా,వారి వారి ఇష్ట దైవములను నామ జపము చేసుకోన వచ్చును.
1. ఓం నమ: శివాయ
2. ఓం నమో భగవతే వాసుదేవాయ.
3. ఓం నమో నారాయణాయ
4. శ్రీ మాత్రే నమ:
5. హరే రామ హరే రామ రామ రామ హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

No comments:
Post a Comment