థైరాయిడ్ సమస్య: మహిళల కు జాగ్రత్తలు:
ఈ మధ్యకాలం లో బాగా ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఇది ఎక్కువగా మహిళలలో కనిపిస్తుంది. ఇది ఒక జబ్బు కాదు. హార్మోనుల అసమతుల్యత కారణంగా శరీరంలో తలెత్తే ఒక స్తితి. దీనిని రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మానవ దేహములో గొంతు మధ్య భాగాన లోపల సీతాకోక చిలుక ఆకారం లో ఉండే ఒక గ్రంధి థైరాయిడ్. ఈ గ్రంధి యొక్క స్రావములు, ఎక్కువ అయినా, లేక తక్కువ అయినా థైరాయిడ్ వ్యాధి వచ్చింది అని అంటాము. గర్భిణి స్త్రీలలో ఈ వ్యాధి రావడం వలన పుట్టే పిల్లలకు శారీరక, మానసిక సమస్యలు వచ్చే అవకాసం ఉంది. ఈ వ్యాధి వచ్చిన వారు డాక్టర్ సలహా ప్రకారం మందులు నిర్ణీత కాలం పాటు వాడవలసి ఉంటుంది. ఈ గ్రంధి యొక్క స్రావాలు ఎక్కువగా ఉన్నపుడు హైపెర్ థైరాయిడ్ అని, తక్కువగా స్రవించినపుదు హైపో థైరాయిడ్ స్థితి అని అంటారు.
జుట్టు, చర్మము పొడిబారాడము, రుతు స్రావ సమస్యలు, అజీర్ణము, మలబద్దకము, త్వరగా అలసిపోవడము, బద్ధకముగా ఉండి, ఏ పని మీదా ధ్యాస లేకపోవటము, జుట్టు ఎక్కువగా ఉదిపోవడము, శరీర బరువు పెరగడము, లేదా తగ్గడము, హటాత్తుగా ఓబకాయము రావడము ఈ థైరాయిడ్ వ్యాధి యొక్క లక్షణములు. ఈ వ్యాధిని వైద్యులు రక్త పరీక్ష ద్వారా నిర్ధారించి మందులు ఇస్తారు. ఈ జబ్బు యొక్క లక్షణాలు కూడా చెప్తారు. వ్యాయామము తప్పనిసరిగా చేయాలి అని చెప్తారు.
ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, ఈ వ్యాధి వలన మన రోజువారీ జీవితానికి ఏ విధమైన ఆటంకాలు రావు. మనం మాములుగా మన పని మనం చేసుకుంటూ ఉంటాము. సాధారణంగా మహిళలకు ఉన్న పెద్ద దురలవాటు ఏమిటంటే, శరీరములో బాధ కలిగి, మన పనులకు ఆటంకము కలిగే వరకు మనలో ఉన్న అనారోగ్యాన్ని పట్టించుకోము. జ్వరము , దగ్గు, జలుబు ఇలాంటి జబ్బుల లక్షణాలు పైకి కనబడతాయి కాబట్టి ఏదో ఒక మందు వేసేసుకుని రోజు గడిపేస్తాము. కాని థైరాయిడ్ సమస్య అలా కాదు.
కాలం గడిచే కొద్దీ, జుట్టు ఉడడం సమస్య చాల ఎక్కువ అవ్తుంది. చర్మం పోడిబారే సమస్య కూడా చాల ఎక్కువగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ, ఎముకల పటుత్వం కూడా కోల్పోతాము. అజీర్ణ సమస్య కూడా ఎక్కువ అవుతుంది. మొదట్లో ఏమి బాధలు లేకపోయినా, ఈ వ్యాధికి మందులు వాడడం మొదలుపెట్టి 12,13 సం. గడిచేసరికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వెంట పడతాయి. కొంచెం దూరం నడిచే సరికి కాళ్ళు లాగడము, నడుము నొప్పి కూడా వస్తు ఉంటాయి. చర్మం ఎంత పోడిబారుతుందంటే ఒక్క నువ్వుల నునె తప్ప ఏ విధమైన moisturisers పనిచెయనంతగా. ఇక జుట్టు విషయం చెప్పనక్కర లేదు. చాల విపరీతం గా ఉదిపోతు ఉంటుంది.
నేను ఇవన్ని మీ అందరిని భయ పెట్టడానికో, తప్పు దారి పట్టించడానికో వ్రాయటం లేదు. నేను స్వయముగా బాధ పడుతున్నాను కాబట్టి వ్రాస్తున్నాను.
*తప్పనిసరిగా రోజు ఏదో ఒక శారీరిక వ్యాయామము చేయండి. లేదంటే కొన్నేళ్ళ తర్వాత కొంచెం దూరం నడిచినా, కాళ్ళు పట్టేస్తాయి.* రోజు ఉదయం, సాయంత్రం లేత సూర్య కిరణాలు ఒంటికి సోకేలా ఎండలో నిలబడండి. *చర్మానికి తప్పనిసరిగా పోషణ చేయండి. నువ్వుల నునె ను ఉదయం , సాయంత్రం చర్మానికి అప్లై చేసుకోండి. * జుట్టుకు కూడా తగినంత పోషణ తప్పనిసరిగా చేయండి. * జుట్టుకు అవసరమయ్యే ప్రోటీన్లు ఉన్న ఆహారాని ఎక్కువగా తీసుకోండి. * సాధ్యమైనంతవరకు షాంపూ లు కాకుండా, కుంకుడు కాయ కాని, శికాయ కానీ వాడడం అలవాటు చేసుకోండి. * థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్లకు తిన్న ఆహారం కెలోరిలుగా ఎక్కువ మారదు కాబట్టి, బరువు తొందరగా పెరుగుతారు. * బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి * ప్రతి ఆరునెలలకు ఒకసారి తప్పని సరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ పర్యవేక్షణలో మందులు క్రమం తప్పకుండా వాడండి. * థైరాయిడ్ వ్యాధిగ్రస్తులలో ఎక్కువ శతం మందికి రక్త హీనత కూడా రావచ్చు. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, ఖర్జూరాలు, అన్జీరా పండ్లు సమయాన్ని బట్టి తీసుకోండి.
ఇవన్ని మనకు వైద్యులు కూడా చెప్తారు. వారి సలహాలని మనం సాధారణంగా పట్టించుకోము. అటువంటి వారికోసమే ఈ పోస్ట్.

No comments:
Post a Comment