పాలరాతి అద్భుతం...
రాజస్తాన్ రాష్ట్రం పాలరాతికి పెట్టింది పేరు. అక్కడ ఏ దేవాలయం చూసినా పాలరాతి సొబగులతో అలరారుతుంటుంది. అటువంటి చోట ఒక మహాద్భుతం అనిపించే ఒక కట్టడం --" రాణక్ పూర్" జైన మందిరం. ఉదయపూర్ కు 91 కి.మీ. దూరంలో కనిపించే అద్భుత దృశ్యం. 4 ముఖాలు కలిగిన ఈ దేవాలయం లో 1444 పాలరాతి స్తంభాలు మనోహరమైన నగిషిలతో చెక్కబడి ఉన్నాయి. కాని ఏ రెండు స్తంభాలు ఒకలా ఉండవు. వేరే వేరే డిజైన్లలో ఉంటాయి. ఈ దేవాలయం పూర్తీ చేయడానికి 21 సం. పట్టింది. దీనిని మేవాడ్ రాజు రాణా కుంభ కట్టించాడు. ఇక్కడి శిల్పాలలో నాగ శిల్పం ఒక ప్రత్యేకం. ఏకశిలలో చెక్కిన ఈ శిల్పం లో 18 మంది నాగదేవతలు తోకలు ముడి వేసుకుని ఉంటాయి. ఏ తోక చివర ఏదో మనం చెప్పలేము. దానిని ఈ క్రింది ఫోటో లో చూడవచ్చు. విద్యుత్ దీపాలు అయితే పాలరాతి మన్నికకు హాని అని ఇప్పటికి అక్కడ అవసరమైన చోట ఆవునెయ్యి దీపాలే వెలిగిస్తున్నారు.

No comments:
Post a Comment