ఒక ఇంట్లో అన్నదమ్ములు విదిపోవాలంటేనే ఆస్తుల పంపకం లో సవాలక్ష నిర్ణయాలు, సవరణలు, పెద్దమనుషుల మధ్యవర్తిత్వం ఇన్ని ఉంటాయి కదా...ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి మరిన్ని లెక్కలు, గణాంకాలు కావాలి? కలిసి ఉందాము మొర్రో అనే వాళ్ళకు రాజధాని ఇవ్వకుండా, విడదిసేయండి అనే వాళ్ళకు అన్ని వరాలు ఇస్తున్నారు, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు, ఇదేమి విచిత్రం, ఒక రాష్ట్రాన్ని విడదీయాలంటే రాజ్యాంగం, చట్టం ఇవేవి లెక్కలోకి తిసుకొనక్కరలెదా? ఇద్దర్ని కూచోబెట్టి మాట్లాడక్కరలేదా? సీమాన్ధ్ర ప్రజలు, నాయకులూ, ఎన్ని అభ్యంతరాలు వెలిబుచ్చినా మొండితనంగా ఈ అడ్డగోలు విభజన ఎందుకు? ఎవరి ప్రయోజనం కోసం? జలవనరులు, అటవీ సంపద, భూగర్భ సంపద, ఆదాయం, ఖర్చు, లోటు, మిగులు , విద్య సంస్థలు, ఉద్యోగులు, pensioners ఇలా ఎన్ని విభాగాల మిద చర్చ జరగాలి? పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎంత మంది గిరిజనుల జీవితం అతలా కుతలం అవుతుంది? ఇవన్ని ఆలోచించేవారు ఎవరు?
మనం ఒక నమ్మకం పెట్టుకొని ఎన్నుకున్న రాజకీయ ప్రతినిధులు మాత్రం ఏమి చేస్తున్నారు? రేపు నిజంగా విడిపోతే, మన విద్యార్ధుల గతి ఏమిటి? విడిపోయిన రాష్ట్రం లో మనం నాన్-లోకల్ అయితే, మన పిల్లల పై చదువులు ఎలాగ? ఇప్పుడే, కలిసి ఉన్నప్పుడే, మన విద్య ప్రమాణాలు బాగా లేక మన విద్యార్ధులు పక్క రాష్ట్రాలకి వలస వెళ్తున్నారు. విడిపోతే, మన పరిస్తితి ఏంటి? పెద్ద పెద్ద విద్యాలయాలు, బిజినెస్ స్కూల్స్, అన్నిటిని మనం వదులుకొవలసిన్దెనా? ఇపుడే , ఇంకా విడిపోకుండానే సీమాంధ్ర ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉన్న కొంత మంది రాజకీయ సన్నాసులు, విడిపోయాక మనలను అక్కడ బ్రతకనిస్తారా?
ఒక రబ్బర్ స్టంప్ లాంటి ప్రధాన మంత్రి ని పెట్టుకుని వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ఆ మహిళ భారత దేశం లో పుట్టి ఉంటె, భారత సంస్కృతిలో అన్నదమ్ముల అనురాగం, బాధ్యతలు , ఒక పాపభీతి ఉండేవి. అసలు కుటుంబ వ్యవస్థే లేని ఒక విదేశంలో పుట్టిన మహిళకు ఇక్కడి ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి? అసలు ఆమె పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రాని విడదీసి , అడ్డంగా కోసేసి, వేరు కుంపటి అడిగిన వాళ్లకి ఇచ్చేయడానికి ఇదేమైనా ఆమె పుట్టినరోజుకు కోసిన కేకా?
మనం మన మనసులని చంపుకొని విడిపోవాలసినదేనా? కొత్త రాజధాని ఎక్కడ కట్టినా అది హైదరాబాద్ లెవెల్లో అభివృద్ది చెందడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇక ముందు ముందు మన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?
ఇటువంటి సమయములో పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన ప్రజా ప్రతినిధులు వాళ్ళలో వాళ్ళకు ఐకమత్యం లేకుండా, పొంతన లేకుండా తలో మాటా మాట్లాడుతూ, నాటకాలు ఆడుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారు.. ఈ విభజన అంశం ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుందో?

No comments:
Post a Comment