Monday 24 February 2014

ప్లాస్టిక్ బాగ్స్ పర్య్వవరనానికి హాని చేస్తాయి అని అందరికి తెలిసినదే. అవి తొందరగా భూమిలో కలవవు. నాశనం కావు. ఒకవేళ వాటిని కాల్చినా, వాటి పొగ నుండి విషవాయువులు వెలువడుతాయి. అవి కూడా పర్యావరణానికి హానికరమే. ఏటా కొన్ని వేల జంతువులూ వాటి ఆహారం తో పాటు ప్లాస్టిక్ బాగ్స్ ను కూడా తిని చనిపోతున్నాయి.

ఇవన్ని మనకు తెలిసిన విషయాలే. మరి ప్రభుత్వానికి ఈ ప్లాస్టిక్ బాగ్స్ తయారు చేసే కర్మాగారాలకు అనుమతి ఇచ్చినపుడు ప్రభుత్వానికి ఈ బాగ్స్ తో ఉన్న మంచి చెడులు తెలియలేద? దాదాపుగా ఈ బాగ్స్ వాడుక లోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. మరి ఇప్పటివరకు వాడద్దు, వాడద్దు అనడము, స్పెషల్ డ్రైవ్స్ పేరున తనిఖీలు చేసి అవి వాడుతున్న వ్యాపారస్తులను శిక్షించడము తప్ప, అసలు ఫ్యాక్టరీ ల లైసెన్స్ లు ఎందుకు సీజ్ చెయ్యరు? ఎందుకు వాటి అనుమతి రద్దు చేయరు? ఎందుకు ఆ ఫాక్టరీలను ముయించరు?

ప్లాస్టిక్ బాగ్స్ వాడకూడదు సరే, మరి వాటికీ ప్రత్యామ్నాయం మిద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు? జనపనార తో చేసే చేతి సంచులు చక్కని మన్నిక కలిగి ఉంటాయి. తమిళనాడు లో ప్రతి వస్తువు కొనుగోలు మిద చక్కటి గుడ్డ బ్యాగులు ఇస్తారు. వారికీ బజారుకు వెళ్ళినా అవే పట్టుకెల్లడం అలవాటు అయింది.

నిరుద్యోగులకు అనేక సంక్షేమ పధకాల ద్వార జనపనారతో, బట్టతో ఆకర్షణీయమైన బాగ్స్ తయారు చేయించడం నేర్పి వాటిని ప్రొత్సహ్ంచవచ్చు. అటు ప్లాస్టిక్ బెడద వదులుతుంది, ఇటు నిరుద్యోగులకు ఒక ఉపాధి కలుగుతుంది.

అలాగే కొద్ది మందం కలిగిన కాగితం సంచులను కూడా వినియోగం లోకి తేవచ్చు. కేరళ లో అరటి నార నుంచి తీసిన సన్నని దారం తో కూడా సంచులు తయారు చేస్తున్నారు. అలా ప్రతి రాష్ట్రం, తమ వద్ద ఉన్న వనరులను ఎంతో చక్కగా కాపాడుకుంటూ, పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా కాపాడుతోంది. మరి మన పాలకుల సంగతి ఏమిటి? అసలు ఈ ప్లాస్టిక్ బాగ్స్, disposable containers , disposable  glasses , plates  తయారీని నిషేధించి,  కొంచెం ఖరీదు ఎక్కువ అయినా, అరటి నార తో తయారు చేసిన ఉత్పత్తులను వినియోగదారులకు అలవాటు చేయాలి. ప్లాస్టిక్ disposable  containers  లో ఉంచిన వేడి వేడి ఆహార పదార్థాల వలన  ఆరోగ్యం ఎంతో పాడవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక స్వచ్చంద సంస్తలు ప్లాస్టిక్ యొక్కవాడకాన్ని ప్రజలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ఈ స్వచ్చంద సంస్థలు అవసరమైతే  ప్లాస్టిక్ ను నిషేధించే చర్యలు తీసుకోనేల ప్రభుత్వాన్ని నిర్బంధించాలి.
ప్రజలు కూడా ఎవరికీ వారు ప్లాస్టిక్ వాడకూడదు అని నిర్ణయం తీసుకోవాలి.

No comments:

Post a Comment