ఈరోజు కుమారీ శతకం గురించి చెప్పుకుందాం... శ్రీ ప్రక్కి వెంకట నరసింహ కవి
అనే ఆయన ఈ శతక కర్త. ఈ శతకములో ఆడపిల్లలు నేర్వవలసిన పద్ధతుల గురించి,
పుట్టినింట, మెట్టినింట వారు నడుచుకోవలసిన పద్ధతుల గురించి చెబుతారు కవి.
పూర్వకాలంలో ఆడపిల్లలు గట్టిగ నవ్వకూడదు అని, నేలపై శబ్దం అయ్యేలా
నడవకూడదు అని కొన్ని కట్టుబాట్లు ఉండేవి. అవి అందరు పాటించేవారు కూడా.
ఆడపిల్లలకు బడికి వెళ్లి చదువుకునే కన్నా, ఇంట్లోనే ఉండి, రామాయణం, భారతం,
మొదలైన ధర్మ గ్రంధాలు, సంప్రదాయాలు, పెద్ద బాలశిక్ష వంటివి చదువుకుని ఏదో కొంత మాత్రం వ్రాయడం వస్తే సరిపోయేది. ఈ సుమతి శతక పద్యాలు ఆడపిల్లలకు చక్కని మార్గదర్శి గా ఉండేవి.
పెనిమిటి వలదని చెప్పిన
పని ఎన్నడు చేయరాదు బావలకెదుటన్
కనపడగ రాదు కోపము
మనమున నిడుకోనక ఎపుడు మసలు కుమారీ!
ఎంత చక్కని పద్యం? భర్త వద్దు అన్న పని చేయకూడదు. బావగార్ల ఎదుట పడరాదు, కోపం మనసులో ఉంచుకోకూడదు. అత్తవారింటఈవిధంగా ఉండవలెను అని భావము.
అసలు బావగార్లు, మామగారు ఎదుట వాళ్ళ మొహం లోకి చూసి మాట్లాడడం, వాళ్ళ ఎదురుగ కుర్చుని ఉండడం ఇప్పటికి తప్పే కొన్ని కుటుంబాలాలో. అది గౌరవం కాదు. కోపం మనసులో ఉంచుకోరాదు అంటే, అసలుకోపం వచ్చే ఏ విషయాన్ని మనసుకు పట్టించుకోకూడదు అని భావము. అత్తవారింట్లో కోపం తెచ్చుకుంటే, ఆడవారికే నష్టం. మానసికమైన బాధ. ఇటువంటి వన్నీ ఆరోజుల్లోనే చక్కగా చెప్పారు చూసారా...
మరదండ్రు అత్త వదినెలు
మరదులు బావలు కొమాళ్ళు పెద్దలు రా
ఉరవడి పీటలు మంచము
లరుగులు దిగుచుండవలయు నమ్ము కుమారీ!
ఇది మరియొక చక్కని పద్యం. మనం పీటలు, మంచము, అరుగులు ఇటువంటి ఉన్నత ఆసనములపై కూర్చున్నపుడు ఎపుడైనా, ఆడపడుచులు కానీ, అత్తగారు కానీ, మరుదులు, బావగార్లు కానీ, కుమారులు కాని, ఇంకెవరైనా ఇతర పెద్దలు కాని వచ్చినపుడు చప్పున 'కిందకు దిగవలెను అని భావము. అలాగే కింద కూర్చున్నపుడు కూడా లేచి నుంచోవడం ఇప్పటికి కొన్ని కుటుంబాలలో పాటిస్తున్న సంప్రదాయం. మనం పైన కుర్చుని వారికీ కూడా సీట్ ఆఫర్ చేస్తే ఏముతుంది అని ఈకాలం వాళ్ళు అనుకోవచ్చు. కాని అది సంప్రదాయం కాదు.
ఉరవడి= చప్పున.
ఇరుగు పొరుగిండ్ల కైనను
వరుడో కాక అత్తగారో, వదినాయో, మామో,
మరదియో సెలవీకుండగా
తరుణి స్వతంత్రించి పోవ దగదు కుమారీ!
ఇంట్లో కోడలు ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళాలి అనుకుంటే ఉమ్మడి కుటుంబములో , భర్త కానీ, అత్తగారు కానీ, ఆడపడచులు కానీ, మామగారు కానీ, మరదులు, బావగార్లు కానీ అనుమతించిన తరువాతే వెళ్ళవలెను. వారి అనుమతి లేకుండగా స్వతంత్రించి పోరాదు అని భావము.
>>> ఈ పద్యాలూ చదివితే ఈతరం ఆడపిల్లలు నామీద యుద్ధానికి వస్తారు. 21వ శతాబ్దములో కూడా ఆడవారి స్వేచ్చను హరించే ఇటువంటి విషయాలు చెప్తున్నారు అని. కానీ ఒక్క విషయం అందరు ఆలోచించండి. అత్తవారింట్లో వారి కనుసన్నలలో మెలిగి, వారు చెప్పినట్లు నడుచుకుంటే మనకు మెంటల్ స్ట్రెస్ ఉండదు. అంటే మన చదువు తెలివితేటలు నిరుపయోగమేనా అంటారా? ఎప్పటికి చదువు నిరుపయోగం కాదు. మన చదువును, తెలివితేటలను మన ఇంటి ఉన్నతికి, పిల్లల పెంపకానికి ఉపయోగించాలి పాజిటివ్ గా. ఇది నా సొంత

No comments:
Post a Comment