Monday, 24 February 2014

భారతదేశం ఒక వేదభూమి. ఎన్నో దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం లో నాగరికత గొప్పగా విలసిల్లింది. ఈ భూమి ఎంతో మంది మునులకు, ఋషులకు, అవతార మూర్తులకు ఆలవాలం. వీరందరూ ముందు తరాలు ఎంతో సంతోషంగా , ప్రశాంతంగా , సౌఖ్యంగా బ్రతకడానికి అవసరమైన ఒక గొప్ప సంస్కృతిని మనకు కానుకగా ఇచ్చారు. మన సంస్కృతీ లో చెట్లు, నదులు, సముద్రాలూ, జంతువులూ అన్నిటిని పూజించే సంప్రదాయం ఉంది. వాటి వాళ్ళ మనకు ఎంతో ఉపయోగం ఉంది కనక, వాటిని నాశనం చేయకుండా నిలిపి ఉంచేందుకు వాటిని పూజించడం అనే ఆచారం పెట్టారు.

అలాగే, మానవుడు నిద్ర లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు దైవస్మరణ చేసుకొనేందుకు వీలుగా ప్రతి సందర్భం లోను ఒక శ్లోకం వారు మనకు అలవాటు చేసారు. అందులో కొన్ని శ్లోకాలు చెప్తాను. పిల్లలకు పెద్ద పెద్ద స్తోత్రాలు నేర్పక పోయినా, ఇటువంటివి నేర్పి అందులోని ఔచిత్యం మనం వివరిస్తే, ఇంగ్లీష్ చదువులకు అంకితం అయిపోయిన ఈతరం పిల్లలకు మన భారత దేశ ఔన్నత్యం తెలియడానికి అవకాశం ఉంటుంది.

ఉదయం నిద్రలేవగానే, పక్క మిద కూర్చుని అరచేయి చూసుకుంటూ చదవవలసిన శ్లోకం:

కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతీ,
కరమూలేతు గౌరీ చ ప్రభాతే కరదర్శనం.ll

లేచిన తర్వాత భూమి మిద కాళ్ళు పెడుతూ భూదేవిని కాలితో స్పర్శిస్తున్నందుకు క్షమించమని కోరుతూ:

సముద్ర వసనే దేవి, పర్వత స్థనమండలే,
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ll

అసలు చదువుకునే పిల్లలు అందరు బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే మంచిది. ఒకవేళ అలా లేవలేకపోయి, సూర్యోదయం వేళకు లేచిన కూడా, ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని "ఓం సవిత్రే నమః" అని 11 సార్లు స్మరణ చేస్తే చాల మంచిది.

ఇంకొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం.

No comments:

Post a Comment