Monday, 24 February 2014

నేను ఒక ఫ్రెండ్ తో కలిసి ఒక అమ్మ ( బాబాలకు ఫిమేల్ వెర్షన్) దగ్గరకు వెళ్ళాను. అక్కడ చాల మంది కుర్చుని ఉన్నారు. మేము కూడా కూర్చున్నాము. నేను వేరే ఒక పక్కకు కూర్చున్నా. అందరు ఆవిడకి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అన్ని కూడా ఆరోగ్యం, లేదా అనుకున్న పనులు జరగక పోవడం. లేదా అమ్మాయి పెళ్లి, అబ్బాయి ఉద్యోగం, తీరని అప్పులు... వీటికి సంబంధించిన సమస్యలు. ఆవిడ అందరికి బొట్టు పెట్టి, మీ సమస్య త్వరలో తీరుతుంది అని చెప్పి దక్షిణ అడుగుతున్నారు. అందరిని ఉపవాసాలు చేయమని చెప్తున్నారు. కానీ వేరే ప్రత్యెక పూజలు కానీ, మంత్రోపదేశం కానీ చేయట్లా. కానీ దక్షిణ భారీగానే పుచ్చుకుంటున్నారు. పక్కనే ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది. దానికి కావలసిన మెటీరియల్ కొంత మందిని అడుగుతున్నారు.

నేను మౌనంగా చూస్తూ కూర్చున్నా. నన్ను పిలిచి నీ సమస్య ఏమిటో చెప్పు అన్నారు. నాకు పెద్ద సమస్యలు ఏవి లేవండి. నేను నా ఫ్రెండ్ తో వచాను. అన్నాను. కాదు చెప్పు అని బలవంతం చేసారు. నాకు సమస్యలు లేవు అని రెండో సారి చెప్పగానే ఆవిడకి కోపం వచ్చింది. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. నీ సమస్య నేను తీరుస్తాను. అన్నారు. నేను మళ్లీ అదే జవాబు చెప్పాను . ఐతే చూడు, నన్ను ధిక్కరించి మాట్లాడినందుకు నీకు త్వరలో అనేక కష్టాలు వస్తాయి, నువ్వే నా దగ్గరకు వస్తావు. అని అన్నారు ( శపించారు).

అమ్మలు, స్వామిజి లు ఇలా కూడా ఉంటారా.

సమస్యలు లేని మనుషులు ఉండరు. అందునా అందరికి ఆరోగ్యం, సంపాదన, పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఇవేగా కష్టాలు... ఇంకా ఇంతకన్నా ఏముంటాయి. మనం ఒక మానసిక ఆలంబన కోసం ఇటువంటివారిని నమ్మితే నమ్మచ్చు. వీరిని మనం భూమి మిద ఉన్న దేవతలు గ కొలుస్తాము. కానీ కొంతమంది మన బలహినతలని గమనించి మన మనసులతో, మన భావాలతో ఆడుకుంటున్నారు.

No comments:

Post a Comment