Tuesday, 18 February 2014

జైనులకు మైనారిటీ హోదా అవసరమా:

మన దేశం లో 42 లక్షల మంది జైన మతస్తులు ఉన్నప్పటికీ, వారు ఆర్ధికంగా ఎంతో ముందున్నారు. వారిలో మొత్తంగా 94 శాతం అక్షరాస్యత ఉంది. కేవలం జైన మహిళలలోనే 90 శాతం అక్షరాస్యత ఉంది. ఆదాయపన్ను కట్టేవారిలో 20 శాతం మంది ఆ వర్గం వాళ్లే ఉన్నారు. వాళ్ళకే ప్రత్యేకమైన వడ్డీ వ్యాపారం, తాకట్టు వ్యాపారాలతో సహా ఈ రోజుల్లో వారు కాలుపెట్టని రంగం లేదు. మరి ఇటువంటి ఉన్నత స్తితిలో ఉన్న జైనులకు మైనారిటీ హోదా అవసరమా అంటే ఇది కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం.

జైనులలో చాల మంది గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలలో స్థిరపడ్డారు. అవి bjp కి పెట్టని కోటలు. అనాది నుంచి జైనులు, హిందువుల మధ్య వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి. 1992లొ జాతీయ మైనారిటీ కమిషన్ ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జొరాష్ట్రియన్ లను మైనారిటీ వర్గాలుగా గుర్తించింది . భారత్ లో 7 రాష్ట్రాలలో జైనులు మైనారిటీలుగా ఉన్నారు. 1998 నుంచి జాతీయ స్థాయిలో వారిని మైనారిటీ లుగా గుర్తించాలని కోర్ట్ లో పిటిషన్లు వేస్తూ వచ్చారు. కానీ కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వారి బుద్ధికి అందులో కూడా రాజకీయం తోచింది.

ఇప్పుడు వారికి మైనారిటీ హోదా కల్పించి, bjp వోట్లను కూడా దండుకోవడానికి, జైనులు ఎక్కువగా ఉండే కర్ణాటక నుంచి, మంత్రి రహమాన్,.. కేంద్ర మంత్రి, డిల్లి చాందిని చౌక్ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహించిన కపిల్ సిబాల్,.(చాందిని చౌక్ లో జైన జనాభా ఎక్కువ. ). ఇక స్వయంగా జైన అయిన రూరల్ డెవలప్ మెంట్ మంత్రి ప్రదీప్ కుమార్ jain. .. వీరందరి సహకారం తో కాంగ్రెస్ ప్రభుత్వం అటార్నీ జనరల్ మెదలు వంచి ఈ ప్రతిపాదన అంగీకరించారు.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా 3 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయించవలసి వస్తుంది. పైగా కొన్ని దేవాలయాలపై హిందువులు, జైనుల మధ్య కొట్లాటలు ఉన్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్ట్ జైనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కుడా అవి సద్దుమనగ లేదు. ఇక ఇప్పుడు వారు మైనారిటీలు కాబట్టి హిందువులు ఏమి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే, మైనారిటీలను హింసించిన కేసు వస్తుంది కాబట్టి....

ఇదంతా ప్రస్తుత పరిస్థితులలో అవసరమా.... ఒకప్పుడు భారత దేశ దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనర్హుల చేతిలో పడి ఓట్ల కోసం ఏదైనా చేయగల స్థాయికి చేరుకుంది. తన క్షేమం తప్ప ప్రజా సంక్షేమం పట్టని పార్టీగా మారింది.

No comments:

Post a Comment