Monday, 24 February 2014

శ్రీ కృష్ణ శతకం లోని మరో రెండు పద్యాలు:

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నంద కుమారా!
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!

హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు లంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా!

ఈ పై రెండు పద్యాల లోను అంతగా అర్ధం కాని పదాలు ఏమి లేవు కాబట్టి భావం ఇవ్వడంలేదు.
నగధర అంటే నగము అంటే పర్వతము. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను కాపాడాడు కాబట్టి నగమును ధరించినవాడు నగధరుడు అని కృష్ణుడికి పేరు.

>> హరియించును పాతకంబు లంబుజనాభా అనే వాక్యములో పాతకములు+అమ్బుజనాభ అని సంధి విడదీయాలి. పాతకములు అంటే పాపములు. అంబుజము అంటే పద్మము. పద్మమును నాభియందు కలవాడు కాబట్టి విష్ణువుకు అమ్బుజనాభుడు అని పేరు. హరియించుట అంటే తొలగించుట.

ఇంత చాదస్తంగా వివరంగా చెప్తున్నాను అనుకోకండి. ఇంగ్లీష్ మీడియం లో చదివిన పిల్లలకు మాములు తెలుగు పదాలే తెలియడంలేదు కదా. వారి కోసం ఇంత వివరణ.

No comments:

Post a Comment