తెలుగు సాహిత్యం లో శతకాలది ఒక ప్రత్యెక స్థానం. శతకాలలో చాల రకాలు
ఉన్నాయి. దాశరధి శతకం, శ్రీ లక్ష్మి నారసింహ శతకం, ఇటువంటివి భగవంతుని
కీర్తించేవి ఐతే, సమాజంలో ఉన్న మూధనమ్మకాలను నిరసించి, మంచి మార్గం చూపించే
వేమన శతకం లాంటివి కొన్ని. అలాగే చిన్నతనం నుంచి పిల్లలకు మంచి బుద్ధులు
నేర్పించే కుమారి శతకం, సుమతి శతకం వంటివి మరికొన్ని.
పూర్వకాలంలో ఆడపిల్లలను ఎంతవరకు చదువుకోన్నావు అని అడిగితె బాలశిక్ష, కుమారి శతకం, దాశరథి శతకం-- అని ఇలా కొన్ని పుస్తకాల పేర్లు చెప్పేవారట. ఇప్పటిలా అప్పుడు క్లాసుల లెక్క ఉండేది కాదు.
కానీ ఈరోజుల్లో మనం శతకాల మాటే మర్చిపోతున్నాం. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో కూడా మన పూర్వ సాహిత్యం గురించి పెద్దగ పట్టింపు ఉండటం లేదు. పిల్లలకు తేలికగా నోరు తిరిగి సులభంగా నేర్చుకునే కొన్ని శతక పద్యాలు మనం ఇక్కడ నేర్చుకుందాం.
ఐతే ఇవన్ని పెద్ద బాలశిక్షలోనో, గూగుల్ లోనో దొరుకుతాయి కదా అని కొందరు సందేహ పడవచ్చు. కానీ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి అని మనకి మనసులో అనిపించినా, ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప దాని మిద దృష్టి పెట్టలేని స్థితి లో మనం ఈరోజు ఉన్నాము. వినడానికి కొంత నిష్టూరంగా ఉన్నా, ఇది నిజం. ఈకాలం అటువంటిది. ఎవరిని తప్పు పట్టనవసరం లేదు. పిల్లలు కూడా పుస్తకంలో చదివేకన్న online లో ఐతే ఉత్సాహంగా నేర్చుకుంటారు కదా..
అందుకే ఈరోజు నుంచి పిల్లలకి నేర్పించేందుకు కొన్ని సులభమైన శతక పద్యాలు రోజుకి రెండు తెలుసుకుందాం.
శ్రీకృష్ణ శతకం లోనివి ఈ క్రింది పద్యాలు....
శ్రీ రుక్మిణీశ ! కేశవ!
నారద సంగీతలోల! నగధర శౌరీ!
ద్వారక నిలయ! జనార్దన!
కారుణ్యము తోడ మమ్ము కావుము కృష్ణా!
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు, దైవము,
నీవే నా పతియు, గతియు, నిజముగ కృష్ణా!
చాల సులభంగా ఉన్నాయి కదా... మరి ఆలస్యం ఎందుకు? మనం నేర్చుకుని, పిల్లలకు కూడా పరిచయం చేద్దాం...

waste
ReplyDelete