Thursday, 20 February 2014

కృష్ణుడు అర్జునునకు ఇంద్రియ నిగ్రహము గూర్చి చెప్పిన తరువాత మరియు ఇంకను ఇలా చెప్పుచున్నాడు. అర్జున! బాహ్యమున ఇంద్రియములను నిగ్రహించి, అంతర్యమున విషయలోలుడైన వాడు మిధ్యచరి అనబడును. కర్తవ్య నిష్టుడైన పురుషుడు ఇంద్రియములను నిగ్రహించి, కర్మ బంధనముల యందు చిక్కక యజ్ఞార్ధమై కర్మలను చేయవలెను. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినపుడే యజ్ఞముల ద్వారా కోరికలను తీరుచుకొని వృద్ది చెందుడు అని చెప్పెను. యజ్ఞములు దేవతలను సంతృప్తి చేసినచో, దేవతలు కూడా మనుషులను సంతృప్తి పరచెదరు.

ప్రాణులు అన్నియు ఆహారం వలన ఏర్పడుచున్నవి. ఆహారము వర్షము వలన, ఆ వర్షము యజ్ఞముల వలన ఏర్పడుచున్నవి. యజ్ఞములకు మూలము విహిత కర్మములు విహిత కర్మలకు వేదములు మూలము. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి వెలువడినవి. అందువలన సర్వ వ్యాపి అగు పరమాత్మ యజ్ఞములన్దు కొలువై ఉన్నాడు. అందువలన ఓ అర్జునా! నీవు విషయాసక్తి రహితుదవై కర్తవ్యమును చక్కగా ఆచరించి, పరమాత్మ ప్రాప్తి పొందుము.

శ్రేష్టుడైన పురుషుని ప్రవర్తనను ఇతరులు ఆచరించెదరు. అతడు నిల్పిన ప్రమాణములను లొకులన్దరు పాటించెదరు. ప్రతి ఇంద్రియ విషయము నందును రాగద్వెశములు దాగి ఉన్నవి. ఈ రెండును మానవుని శ్రెయస్సునకు మహా శత్రువులు. పరధర్మము నందు సుగుణములు ఉన్నప్పటికిని, పరధర్మ ఆచరణము మరణముతో సమానము. స్వధర్మము నందు మరణించుట అయినను శ్రేయస్కరమే.

రజోగుణము నుండి కామ క్రొధములు ఉద్భవించు చున్నవి. అంతులేని పాపకర్మలకు ఇదియే ప్రెరకము. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పి యుండునట్లు, జ్ఞానము కామముచే కప్పబడి యున్నది. కామము(కోరిక ), క్రోధము, ఎన్నటికి చల్లరునవి కావు. జ్ఞానులకు అవి శత్రువులు. ఇంద్రియములు, మనసు, బుద్ది ఈ కామమునకు నివాస స్థానములు . కావున వీటిని అదుపులో నుంచుకొనుము,శరీరము కంటే ఇంద్రియములు, వాటి కంటే మనసు, దాని కంటే బుద్ది బలమైనవి. బుద్ది కంటే బలమైనది ఆత్మ. కనుక ఓ అర్జునా! బుద్ది ద్వారా మనసును వశ పరచుకొని ఘోర శత్రువు ఐన కామమును (కోరికను ) జయించుము.

                                                                                                                                                                                                                

No comments:

Post a Comment