పెద్దవయసులో ఉన్నవారు అందరికీ ఒక విన్నపం. ఈ వయసులో మీకు శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ వయసులో ఒంటరిగా (పిల్లలతో కలిసి ఉండకుండా) ఉండడం మీ ఆరోగ్యం మీద చాలానే ప్రభావం చూపిస్తుంది. పిల్లలు తప్పు చేసినా, పంతాలకు పోకుండా కొంచెం సర్దుకుని ఉండగలిగితే, మీకు ఒంటరి తనం ఉండదు. రెండు చేతులూ కలిస్తేనే కానీ చప్పుడు రాదు. మీ వైపు కూడా కొన్ని తప్పులు మీ పిల్లలకు కనిపించవచ్చు. కూర్చొని సామరస్యం గా మాట్లాడుకోవడం వల్ల చాల సమస్యలు పరిష్కరించు కోవచ్చు. అందరిలో ఉండడం వల్ల మీకు కొంత కాలక్షేపం, ధైర్యం గా కూడా ఉంటుంది.
అలాగే పెద్ద వయసులో ఉన్నవారు, భార్య భర్త ఒకరికి ఒకరు అన్నట్టు సమన్వయము తో మెలగడం చాలా ముఖ్యం. వయసులో ఉన్నపుడు ఎవరు ఎవరి మీద ఆధిపత్యం చూపించినా, పెద్ద వయసు వచ్చాక, ఒకరి మాట ఒకరు మన్నించి సమన్వయము తో ఉండడం వల్ల చాలా చీకాకులను తప్పించుకోవచ్చు. ఈ వయసులో పంతాలకు పోకుండా, బంధువులు అందరితోను contact లో ఉండడం, స్నేహితులను కలవడం, ఇరుగు పొరుగున ఉన్న పిల్లలను పలకరించడం వంటివి జీవితం నిస్సారం కాకుండా కాపాడతాయి.
ఇంకా ఒంట్లో ఓపిక ఉంటె, ఉదయమో, సాయంత్రమో, గుడికి వెళ్లి రావడం , బజార్లో నడిచి రావడం వలన కొంత కాలక్షేపం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా మాకు ఏమి చేయడానికీ ఓపిక లేదు, పిల్లల పైన మేము ఆధార పడము అని గిరి గీసుకుని కూర్చుంటే, మీ శారీరిక ఆరోగ్యం తో పాటు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
No comments:
Post a Comment