ఆరోజుల్లో..... 5
మా వేసవికాలం సెలవులు.....
మా వేసవి సెలవుల సందడి పరీక్షల చివరి రోజు నుంచే మొదలయ్యేది. కానీ ఆఖరి పరీక్ష వ్రాసి వచ్చిన రోజు ఏమి తోచేది కాదు. మరునాడు ఉదయాన్నే కుర్చుని సగం వ్రాసి ఉన్న నోటు పుస్తకాల నుంచి ఖాళీ కాగితాలు తీసి, వాటిని మరుసటి సంవత్సరానికి చిత్తు పుస్తకాలుగా కుట్టుకునే వాళ్ళం. పరీక్షల ముందరే మా పై క్లాసు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకుని పరీక్షల మరునాడు వాళ్ళ దగ్గరి నుంచి టెక్స్ట్ పుస్తకాలూ తెచ్చుకుని వాటిని కొంచెం రిపేరు చేసుకుని మరుసటి సంవత్సరానికి తయారుగా ఉండేవాళ్ళం. మేము చదివిన టెక్స్ట్ పుస్తకాలు ఎవరికైనా ఇచ్చేయడం కుడా ఆరోజే. వాడేసిన నోటు పుస్తకాలు తూకానికి అమ్మేయడం. ఎవరైనా కావాలంటే ఇచ్చేయడం అన్ని ఆరోజే. లేట్ చేస్తే మళ్లీ మర్నాటి నుంచి ఆడుకునే టైం తగ్గిపోతుంది కదా....
ఇంకా మరుసటి రోజు నుంచి మా ప్రతాపం మొదలు. స్కూలు ఉన్నరోజుల్లోను, లేనప్పుడు కూడా తెల్లవారి 4,5 గంటలకే లేచేవాళ్ళం. సెలవలలో కుడా 5 కి లేచి పనులు అన్నీ ముగించుకుని , అన్నం తినేసి 7 కల్లా లైబ్రరీ కి వెళ్ళిపోయే వాళ్ళం. మళ్లీ 11కి వాళ్ళు మేము మూసేస్తున్నాము మీరు వెళ్లి రండి అనేంత వరకు అక్కడే కుర్చుని, పాత చందమామలు, ఇంకా చిన్న పిల్లల పుస్తకాలు చదవడమే. వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. మధ్యాహ్నం పడుకోవడం ఆ తరం లో నిషేధం. అందుకని మధ్యాహ్నం ఎండవేళ ఇంట్లో కుర్చుని ఆడుకునే ఆటలు చదరంగం. అష్టా చెమ్మా, చింతపిక్కలు, ఇవ్వన్ని. మళ్లీ 4 గంటలకల్లా లైబ్రరీ కి తయారు. మళ్లీ 7కి వాళ్ళు మా మొహం మీదే తలుపులు వేసేదాకా ఉండి కొన్ని పుస్తకాలూ ఇంటికి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చి మళ్లీ అవి చదువుకోవడం. అప్పట్లో టీవీ లు లేవు కదా.....రేడియో లో వచ్చే ప్రోగ్రాములు విని రాత్రి 9కల్లా పడుకొని మళ్లీ 4 కు లేవడం. ఇదీ మా దినచర్య.
పరిక్షలు ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి అనగా మా అమ్మగారు చిన్న నోటు పుస్తకం లో హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, నిత్య ప్రార్ధనా శ్లోకాలు ఇటువంటివి వ్రాసి రెడీ చేసే వారు. సెలవులు మొదటి రోజు నుంచి ఆ 50 రోజుల్లోనూ అవి అన్ని నేర్చుకోవాలి అన్నమాట. ఏరోజు చదవక పోయినా బడితె పూజే. తప్పించుకునే వీలు లేదు. అలాగే, రామాయణం, భాగవతం వచనం లో చదివించే వారు. మధ్యాహ్నం ఖాలీ ఉన్నపుడు అవి చదవ వలసినదే. అందులో ఎక్కడ ప్రశ్న అడిగినా చెప్పాల్సిందే. ఇంట్లో అంత క్రమశిక్షణ ఉండేది. ముద్దు చేసే చోట ముద్దు చేయడం, చేతికి పని చెప్పాల్సిన చోట చెప్పడం. ఇది ఆ రోజుల్లో పెంపకం తీరు. రెంటికీ కొరత ఉండేది కాదు.
మా లైబ్రరీ అలవాటు ఏ ఊరు వెళ్ళినా మారేది కాదు. సెలవులలో అమ్మమ్మగారి ఊరు వెళ్ళినా, ఇంకెక్కడికి సరదాగా వెళ్ళినా లైబ్రరీ షెడ్యులు మాత్రం మారేది కాదు. సంవత్సరం అంతా బడికి వెళ్లి వచ్చిన తర్వాత రోజూ ఆడుకునే వాళ్ళం కాబట్టి సెలవులలో ఆడుకోవాలి అనే తాపత్రయం ఉండేది కాదు.
స్కూలు ఉన్న రోజుల్లో కూడా సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చి, టిఫిన్ తినేసి, హాయిగా 2,3 గంటలు ఆడుకునే వాళ్ళం. ఆ తరువాత స్నానం, చదువు. తెల్లవారి లేచి సంగీత సాధన, ఇంటి పనులు మాములే. ఎంత పెద్ద క్లాసులో ఉన్నా,,వార్షిక పరీక్షలు అయినా, ఇంటి పనికి డుమ్మా కొట్టడానికి వీలు లేదు. పని నేర్చుకోక పొతే ఎలా అని కేకలేసేవారు.
మా చిన్నతనం లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే ఇప్పటిలా వేడి వేడి టిఫీనులు కాదు. చద్దన్నం లో ఇంత చింతకాయ పచ్చడో, మరేదైనా ఊరగాయో, వేసుకుని, పెరుగు వేసుకుని తినేయడమే. మళ్లీ మధ్యాహ్నం వంట అయ్యేవరకు పెద్దవాళ్ళని నస పెట్టకుండా మా ఆటలు మావి. సైకిల్ తొక్కడం, ఎవరి ఇంట్లో అయినా పెద్ద పెద్ద చెట్లు ఉంటె ఉయ్యాలా కట్టుకోవడం, వీధంతా మా సందడే. ఎవరి ఇంట్లో అయినా గోరింటాకు చెట్టో, దబ్బ చెట్టో ఉంటె, మా లోని కోతులు నిద్ర లేచేవి. నామకః వారి అనుమతి తీసుకోవడం, చెట్టు అంత దులిపి పారేయడం. దబ్బ ఆకులు పలుచని మజ్జిగ లో వేసి ఉప్పు, జీలకర్ర వేసుకొని తాగితే ఎండ దెబ్బ తగలదు. గోరింటాకు చెట్టు ఉన్నవాళ్ళు కోసుకోవడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తీరా అంతా కోశాక, సగమే ఇచ్చేవారు. మిగతాది వాళ్ళే ఉన్చేసుకునే వారు. అప్పుడు చూడాలి మా ఉక్రోషం. ఆ గోరింటాకు రుబ్బదానికి కూడా వంతులే. ఎందుకంటే రుబ్బే వారికీ కుడి అరచేయి అంతా పండుతుంది కదా....
ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే అదోరకం సందడి. ఇల్లంతా గోల గోల. మాకు అన్నం తినడం లో ఒక రాయితీ ఉండేది. మాతో పెట్టుకుంటే తొందరగా అవదని పెద్ద వాళ్ళు అందరికి అన్నం కలిపి చేతిలో ముద్దలు పెట్టేసేవారు. అలా తినడం చాలా సరదాగా ఉండేది.
మళ్లీ స్కూళ్ళు తెరవడానికి 20 రోజుల ముందు నుంచి పై క్లాసుల పుస్తకాలూ చదవ వలసినదే. స్కూళ్ళు తెరిచేసరికి సగం సిలబసు వచ్చేసి ఉండాలి. అందులో పాఠాలు అర్ధం కాలేదనుకోండి, ఆ వీధిలో ఎవడో అన్నయ్యో, అక్కో ఉంటారు కదా పెద్ద క్లాసులు చదివే వాళ్ళు, వాళ్ళ దగ్గర చెప్పిన్చుకోవలసినదే. ఆ అన్నో, అక్కో వీక్లీ రిపోర్ట్ ఇవ్వడం, మేము ఎలా చదువుతున్నామా అని. అప్పట్లో అదో పెద్ద నస అని భావించే వాళ్ళం.
మాకు వేరే సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉండేవి కాదు. ఏవి నేర్చుకోవాలన్నా ఇంట్లోనే. కుట్లు, అల్లికలు, వంటలు, ముగ్గులు, డ్రాయింగ్, అన్నీ. ఆడుతూ, పాడుతూ చదువుకోవడం. కడుపు నిండా తినడం, చేతి నిండా పని చేయడం. అవే మాకు తెలిసిన సూత్రాలు.
(సశేషం)

No comments:
Post a Comment