ఈ మధ్య అదేదో సినిమాలో " దేశం లో ఎవరితో పెట్టుకున్నా, ఏ భాష వాడితో పెట్టుకున్నా ఆంధ్ర వాడితో, తెలుగు వాడితో పెట్టుకోవద్దు" అని యముడు తన కుమారుడికి చెప్తాడు. సోనియా ఆ సినిమా చూసుంటే బాగుండేది. . రాష్ట్ర విభజన తో కడుపు మండిన ఆంధ్ర వోటరు ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాకుండా చేసాడు. వోటర్లు వెర్రి గొర్రెలు అనుకునే రా.కీ.నా. లకు చుక్కలు చూపించాడు. ఆంధ్ర వాడి సత్తా ఏమిటో దేశానికి తెలిసేలా చేసాడు. కాంగ్రెస్ కు చెందినా ఏ ప్రముఖ వ్యక్తీ కుడా బరిలో గెలవలేక పోయాడు. సామాన్యుడు సామాన్యుడు అని అనుకున్న వోటరు అసామాన్య తెలివి తేటలు చూపించి తనకు ఏమి కావాలో, ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నాడో స్పష్టం చేసాడు. ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు అయినా ప్రజల వైపు నుంచి అలోచించి పాలిస్తేనే వాటికీ మనుగడ.
No comments:
Post a Comment