ఆ రోజుల్లో......4
ఉమ్మడి కుటుంబాలు.
ఆరోజుల్లో అంటూ అన్ని విషయాలు ముచ్చటించు కుంటూ ఉమ్మడి కుటుంబాల గురించి చెప్పుకోకపోతే ఎలా? ఉమ్మడి కుటుంబాలు అంటే ఒకే ఇంట్లో రెండు మూడు తరాలకు చెందిన అన్నదమ్ముల కుటుంబాలు నివసించడం. పూర్వం రోజుల్లో అందరికి వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి ఇంట్లోని అన్నదమ్ములందరూ ఒకే చోట ఉండడానికి వీలు ఉండేది. ఇంట్లో రెండు మూడు తరాల వాళ్ళు ఉండే వారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉండేది. ఈ ఉమ్మడి కుటుంబాల వల్ల చాల లాభాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవారి అజమాయిషీ ఉంటుంది కాబట్టి పిల్లలు మంచి క్రమశిక్షణ తో పెరుగుతారు. పిల్లలకు చిన్నతనం నుంచి, వినమ్రత, పెద్దలంటే గౌరవం, భయం, భక్తీ, పంచుకునే స్వభావం, సంయమనం, ఆత్మ స్థైర్యం అన్నీ అలవడతాయి. ఆదాయం పలు మార్గాల ద్వారా వచ్చినా ఇంటి ఖర్చుఅంతా ఒక చేతి మీదనే జరుగుతుంది కాబట్టి, అనవసర ఖర్చులు, ఆడంబరాలు, ఉండడానికి అవకాసం లేదు. ఇంట్లో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ చెడు అలవాట్లు రావు. పిల్లలకు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తాత, నానమ్మలు కానివ్వండి, పెద్దమ్మా, పెద్దనాన్నలు కానివ్వండి, మంచి మనో వికాస వైద్యులుగా ఉండేవారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో పెరిగిన పిల్లలకు ఆత్మ న్యూనతా భావం ఏర్పడదు. నాకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఇంతమంది నా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది. అలాగే ఇంట్లో ఏ శుభ కార్యాలు, అవసరాలు వచ్చినా ఆర్ధిక బలం, అంగ బలం ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబాలను నడిపే పెద్ద, మంచి సమర్ధత కలిగి ఉండాలి. ఇంట్లోని కొడుకులు అంటే రక్త సంబంధీకులు కానీ రెండు, మూడు తరాలకు చెందిన కోడళ్ళు అంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన వారు ఉంటారు కాబట్టి వారి మధ్య సయోధ్య కుదర్చడం అనేది అసలైన పరీక్ష. ఇంట్లో ఏ ఇబ్బందులు, గొడవలు వచ్చినా ఇంటి పెద్ద తీర్చేవాడు. తండ్రి కానీ, ఇంటి పెద్ద కొడుకు కానీ ఇంటి బాధ్యతలు తీసుకునే వారు. మిగిలిన వారు కూడా వారి మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఇంటి పనుల పంపకం, డబ్బు పంపకం, ఇంటి ఖర్చు అంతా వారి చేతుల మీదుగానే జరిగేది. ఇంట్లో అంత మంది ఉన్నా, ఎవరికీ అసంతృప్తి ఉండేది కాదు. పెద్ద కోడలికి అత్తగారి తర్వాత అంత మర్యాద జరిగేది. పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ, ఇవన్ని ఎంతో సులువుగా సహజంగా జరిగిపోయేవి. నేను అందరి కోసం, నా కోసం అందరూ అనే భావం అందరిలోనూ ఉండేది.
ఇంట్లో ఆడవారికి చేతినిండా పని ఉండేది. ఆ రోజుల్లో సంతానం కుడా ఎక్కువగా ఉండేది కాబట్టి, ఆడవారికి నడివయసు వచ్చేవరకు పిల్లల పెంపకం, పోషణ తోనే సరిపోయేది. అదనంగా ఇంట్లో పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటే ఆ పని కుడా ఉండేది. కడగొట్టు పిల్లల చదువు, బాధ్యత తీరింది అనుకొనే లోపు పెద్ద పిల్లల పెళ్ళిళ్ళు, వారి పురుళ్ళు, సంతానం బాధ్యత మళ్లీ వచ్చి చేరేది. వాళ్ళు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళు, అందువల్ల నడివయసు వచ్చినా ఒంటరి తనం అన్న మాటే ఉండేది కాదు. అలాగే ఎక్కువ కాన్పులు ఉండేవి కాబట్టి, అనవసరపు సర్జరీలు ఉండేవి కాదు కాబట్టి వారిలో హార్మోన్ల అసమతుల్యత అనే మాటే లేదు. అందువల్ల అప్పటి స్త్రీలు శారీరికంగా మానసికంగా కుడా బలంగా ఉండేవారు. ఇంటి బాధ్యత అంతా ఎక్కువగా మగవారే చూసుకునే వారు కాబట్టి కొంచెం వెసులుబాటు గా ఉండేవారు. ఇప్పుడు చుడండి, పిల్లలు 8,9 క్లాస్సులకు వచ్చేసరికి హాస్టల్ కి వెళ్ళిపోతున్నారు, అక్కడి నుంచి పై చదువులు, ఉద్యోగాలు, పెళ్లిల్లు, ఇంక వాళ్ళు ఇంట్లో ఉండేది ఎప్పుడూ? ఇంట్లో తల్లులకు ఒంటరి తనం. దాని నుంచి అనేక రకమైన మానసిక వ్యాధులు. ఉమ్మడి కుటుంబాలలో ఉండే స్త్రీలకూ ఈ రకమైన బాధలు ఉండేవి కావు. అలాగే పెద్దల సంరక్షణ గురించి వచ్చేసరికి, అందరు కలిసే ఉండేవారు కాబట్టి వాటాలు, వంతులు ఉండేవి కావు.
అయితే ఉమ్మడి కుటుంబాలు సరిగా నడవడం అనేది కుటుంబ పెద్ద యొక్క సమర్ధత మిద ఆధారపడి ఉంటుంది. తండ్రి కానీ, పెద్ద కొడుకు కానీ అంత సమర్ధత లేని వాళ్ళైతే, ఆ కుటుంబాలలో వచ్చే గొడవల గురించి చెప్పలేము. అలాగే ఒక ఉమ్మడి కుటుంబం యొక్క అ పరువు ప్రతిష్టలు ఆ ఇంటి కోడళ్ళ మిద కుడా ఆధార పడి ఉంటాయి. ఏ ఇంట్లో అయినా సరే, ఆడవాళ్ళ మధ్య ఒక్కసారి గొడవలు వస్తే, ఇంక ఆ మగవాళ్ళ మధ్య కూడా బంధాలు పలుచబడతాయి. అందుకే ఇంటి కోడళ్ళకు "ఈ ఇల్లు, కుటుంబం మనది, వీళ్ళు అందరు మనవాళ్ళు " అనే భావం ఉండటం చాలా ముఖ్యం.
ఇప్పుడు ఉద్యోగాల బట్టి, చదువుల బట్టి అందరు వివిధ ప్రాంతాలలో ఉండవలసి వస్తోంది. మారుతున్నా కాలం, పెరుగుతున్న ధరల బట్టి స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తోంది. ఇంట్లోను, బయట సమర్ధించడం అంటే ఎంత కష్టం? పనుల కోసం ఎంత మంది పని మనుషులు ఉన్నా, ఎన్ని మెషిన్లు ఉన్నా, ఇంటి బాధ్యత మనదేగా? ఈ తరం స్త్రీలు కష్ట పడుతున్నారా? సుఖ పడుతున్నారా అనే సందేహం వస్తు ఉంటుంది నాకు. ముఖ్యంగా ఈ రోజుల్లో వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా, మనసులలో ఒంటరి తనమే అనుభవిస్తున్నారు. పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిష్టుర సత్యం. కాదంటారా?

No comments:
Post a Comment