మా టీవీ లో గత వారం మొదలైన " మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమం చాల బాగుంటోంది. హిందీ ఛానల్ లో అమితాబ్ చేసిన కార్యక్రమాన్ని తెలుగులో నాగార్జున గారు చేస్తున్నారు. యావద్భారత ప్రేక్షకులకు సుపరిచితమైన అమితాబ్ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అయన నటిస్తూ ఉండడం, ఇపుడు వయసులో పెద్దవారు అవటం వల్ల అయన కార్యక్రమంలో పాల్గొనే వారికీ, ప్రేక్షకులకు కూడా ఒక ఆత్మీయుడు గా అనిపించారు. ఇపుడు అదే కార్యక్రమం అదే నిర్మాతలతో తెలుగు లో రూపు దిద్దుకుంది. హిందీ లో ప్రోగ్రాం ని చుసిన వారికీ ఇది కొత్తగా అనిపించడం లేదు. బాగా అలవాటు అయిన ప్రోగ్రాం చూస్తున్నట్టే ఉంది. నిర్మాతలు ఒకరే అవడం వలన, సెట్టింగ్స్ లో కాని, background music లో కానీ ఏమి తేడా లేదు. ఇది కూడా ఈ ప్రోగ్రాం మనకు సుపరిచితం గా ఉండడానికి ఒక కారణం. అమితాబ్ కన్నా చిన్నవారు అయినప్పటికీ, నాగార్జున ఈ కార్యక్రమాన్ని చాల పరిణతి తో నిర్వహిస్తున్నారు. వచ్చిన వారిని పలకరించడం, వారితో సరదాగా మాట్లాడడం ఈ ప్రోగ్రాం కి వన్నె తెచ్చాయి.
ఈ కార్యక్రమం ద్వారా, మంచి విజ్ఞాన దాయకమైన విషయాలు తెలియడమే కాకుండా, మనుషుల జీవితాలలో ఉన్న ఎత్తుపల్లాలు కూడా తెలుస్తున్నాయి. ఒక విధంగా ఈ ప్రోగ్రాం విజ్ఞానం +స్పూర్తి ని కలిగిస్తోంది. మొట్టమొదటి భాగం లో ఒక టీచర్ వచ్చారు. అయన కల ఒక సొంత ఇల్లు కట్టుకోవటం. దానికి 3,4 లక్షలు సరిపోతుంది అన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎంత సంపాదించినా, సరిపోవట్లేదు అనుకునే వారికీ ఇది నేర్చుకోవలసిన విషయం అనిపించింది. అయన కల తీరేందుకు సరిపడా డబ్బును గెల్చుకున్నారు కూడా.
ఇంకొక అభ్యర్ధి తండ్రి చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నారు. అయన నాగార్జున గారికి అయన సైజుకు సరిపడా, చెప్పులు కుట్టి తెచ్చారు. అవి ఎంతో అందంగా ఉన్నాయి. నాగార్జున ఎంతో అభిమానంగా అవి స్వీకరించారు కూడా.
అన్నిటికన్నా, ఒక స్పూర్తిదాయకమైన మహిళను నిన్నటి భాగం లో చూసాము. ఆమె ఒక HIV పాజిటివ్ వ్యాధిగ్రస్తురాలు. 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి అయిన ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టాక ఆమె భర్త ఆ వ్యాధితో చనిపోయారు. ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. అప్పటినుంచి జీవితం లో పోరాడుతూ, ఉపాధి కోసం తెలిసిన వారి సహాయంతో ఒక ఆటో కొనుక్కొని, నడపడం నేర్చుకొని దాని మిద ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆమె. కేవలం స్త్రీ కావడం వలన ఆమె ఎన్ని బాధలు పడ్డారో చెపుతుంటే చూస్తున్న వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న నాగార్జున గారికి కూడా కళ్ళు చెమర్చాయి. ఆటో నేర్పడానికి ఆమె శరీరాన్ని బేరం పెట్టినవారు కొందరు. ఆమె HIV పాజిటివ్ అని తెలియగానే, మళ్లీ పత్తా లేకుండా పోయారు. ఒక అతను ఈమె బలహీనతను గమనించి ఆటో డ్రైవింగ్ నేర్పడానికి రోజుకు వెయ్యి రూపాయలు అడిగాడట. అంత డబ్బు ఇవ్వలేని ఆమె, ఒక్క రోజులోనే డ్రైవింగ్ నేర్చుకున్నారట. ఇంత జరిగినా, ఆమె తన భర్తను కొంచెం కూడా కించపరచలేదు, విధిని కూడా ఆమె తప్పు పట్టడంలేదు. అది మనం అందరం నేర్చుకోవలసిన విషయం...ఆమె లక్ష్యం పిల్లలను బాగా చదివించడం. ఆమె 40,000 మాత్రమే గెలుచుకున్నారు. ఆమె లక్ష్య సాధన కోసం మరి కొంత మొత్తం గెలుచుకుని ఉంటె బాగుండేది.
గత వారం విజయవాడ నుండి ఒక పెద్దావిడ పాల్గొన్నారు. ఆమె ఒక మహిళా హాస్టల్ నడుపుతున్నారు. ఆమె లక్ష్యం ఆ హాస్టల్ ను ఇంకా అభివృద్ది చేయడం. ఆమె దగ్గర్నుంచి మనం నేర్చుకోవలసినది ఆత్మ విశ్వాసం. ఆవిడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంతో ఆత్మ విశ్వాసం తో , నేను ఈ బహుమతి గెలుచుకుని వెళ్ళాలి, నా హాస్టల్ పిల్లలకు ఎంతోకొంత చేయని అనే ధృఢమైన నిశ్చయంతో పాల్గొన్నారు అనిపించింది. ఆఖరున క్విట్ అయేటప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసం తో క్విట్ అయారు ఆవిడా. ఆవిడ అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.
ఇదివరకు తెలుగులో చాలా quiz షో లు వచ్చాయి. ముందు చెప్పినట్టు, ఇది అందరికీ పరిచయం అయిన ప్రోగ్రాం అవడం, పరిణతి చెందిన నటుడు దీనిని నిర్వహించడం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. ఎప్పుడూ ప్రైవేటు చానల్స్ లో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఇటువంటివి కూడా ప్రసారం చేస్తే, విజ్ఞానం, వినోదం తో పాటు మన జీవితాలకు ఒక స్పూర్తి కూడా కలుగుతుంది.

No comments:
Post a Comment