రక్త సంబంధం తో పనిలేదు. ...చుట్టరికాల గొడవ లేదు....కులం, మతం, భాష--వీటి ముచ్చట మొదలే లేదు.....డబ్బుందా, లేదా --- ఆ పట్టింపే లేదు...ఉన్నదంతా---నీకు నేను, నాకు నువ్వు,....అందరి కోసం ఒక్కడు...ఒక్కడి కోసం అందరూ...నీ కష్టం నాది...నీ అనందం మనందరిదీ......పుస్తకాలు, చదువులు, ఆటలు, పాటలు, హాస్పిటలు, హాస్టలు, ఫీజులు, పరీక్షలు, ప్రాజెక్టులు, సెమినార్లు, సినిమాలు, షికార్లు.....కాంపస్ లు, సెలెక్షన్లు, .....ఇదికాదు, అదిలేదు అనే చింత లేదు.....అన్నిటికీ వాళ్ళే.....అన్నిట్లో వాళ్ళే....కార్పొరేట్ చదువులు మనుషులను మరబొమ్మలను చేసేసాయి.....కానీ వాళ్ళల్లో స్నేహం అనే "చిప్" ఎప్పుడూ ఆక్టివ్ గానే ఉంటుంది. బంధాలను భగవంతుడు కలిపితే, మనం మనకుగా వెతుక్కుని పొందేది స్నేహబంధం......మన చిరునవ్వు వెనుక బాధను గుర్తించేది స్నేహితులు....ఎవరూ తోడు రాని చోట నేనున్నానంటూ తోడుండేది స్నేహితులు......మన సుఖాలకు, దు:ఖాలకు ఒకేలా ఫీల్ అయ్యేదీ వాళ్ళే..... మన నిరాశలో ధైర్యాన్నిచ్చేదీ, మన గొప్పతనానికి మురిసిపోయేదీ, మన బలహీనతలను ఎత్తిచూపేదీ కూడా వాళ్ళే.....ఒక్క మాటలో మన బలం, బలహీనత కూడా వాళ్ళే....ఏ బంధం లేకపోయినా, మన ప్రాణాలకు ప్రాణం అడ్డువేసేదీ వాళ్ళే.....నిజమైన స్నేహితులకు ప్రతిరోజూ పలకరింపులు, పరామర్శలు అవసరం లేదు....మనకు ప్రతి క్షణం గుర్తొచ్చేదీ, హృదయంలో అణువణువునా నిండి ఉండేదీ కూడా వాళ్ళే.... కాలం గడుస్తున్న కొద్దీ ఎవరి మధ్య స్నేహం మసకబారకుండా ఉంటుందో, వారు నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహం పొందడం ఒక వరం....మంచి స్నేహితులను అపార్ధాల వల్లనో, అహంకారం వల్లనో కోల్పోవడం కన్నా పెద్ద తప్పు మరొకటి లేదు.... నిష్కల్మషమైన స్నేహం కలకాలం నిలుస్తుంది....
No comments:
Post a Comment