యువత-స్నేహాలు.
ఈ రోజుల్లో అడ, మగ కలిసి చదువుకోవడం, ఆడ, మగ మధ్య స్నేహాలు సాధారణం అయిపోయాయి. ఇదివరకు రోజుల్లో ఆడ పిల్లలు, మగపిల్లలు కాలేజీ లలో కూడా మాట్లాడుకోవడానికి భయ పడేవారు. సంశయించేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ స్నేహంగా ఉంటున్నారు. కానీ ఆడపిల్లలకు వచ్చే ప్రమాదాలు ఇదివరకటి కన్నా ఎక్కువ అయాయి. ఒక్కోసారి నమ్మిన స్నేహితులే మోసం చేస్తున్నారు కూడా. ఇటువంటి పరిస్థితులలో స్నేహితులు, స్నేహం గురించి కొన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరం ఉంది.
**తల్లితండ్రులు పిల్లల స్నేహితుల మీద ఒక కన్ను వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపూ మొబైల్స్, చాటింగ్ , కంప్యూటర్ లో చాటింగ్ చేస్తూ ఉంటె మీరు కొంత అడ్డుకట్ట వేయాలి.
**కంప్యూటర్, laptop వాడేటప్పుడు ఎక్కడో మారుమూల గదిలో కాకుండా, అందరికీ కనబడేలా హాల్ లో కూర్చోమని చెప్పాలి.
**ఇంటికి పిల్లల స్నేహితులు వచ్చినపుడు అరా తీస్తున్నట్టు కాకుండా మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా వారితో కలిసిపోయి కొంత సమయం గడపాలి.
**ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా ఒక ప్రత్యేకమైన గదిలో కాకుండా, హాల్ లో కూర్చోపెట్టి మాట్లాడమని చెప్పాలి.
**మీ పిల్లల ముఖ్యమైన స్నేహితుల తల్లి/తండ్రులతో మీరు కూడా స్నేహం పెంచుకుంటే మంచిది.
**ఈరోజుల్లో పేస్ బుక్ స్నేహాలు కూడా ఎక్కువ అయిపోయాయి. ముక్కు మొహం తెలియని పేస్ బుక్ స్నేహితులను కలుసుకోవాలి అని మీ పిల్లలు అనుకున్నపుడు వారు తిట్టుకున్నా సరే, మీ పిల్లల క్షేమం కోసం, వారి వెంట మీరు తప్పనిసరిగా వెళ్ళండి.
**చాలా ఇళ్ళల్లో, పిల్లల స్నేహాల గురించి, దానివల్ల ఏదైనా చెడు పర్యవసానాలు వస్తే వాటి గురించి, సాధారణంగా తండ్రులకు తెలియకుండా దాస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. ఒక తల్లిగా నాకు ఈ విషయం తెలిసినపుడు, ఒక తండ్రిగా, ఇంటి యజమానిగా, మీ నాన్నకు కూడా ఈ విషయం తెలియాల్సిందే అని మీ పిల్లలకు ఖరాఖండి గా చెప్పండి.
**ఒకవేళ మీరు భర్తకు తెలియకుండా ఒక విషయం దాస్తే, మీరు మీ పిల్లలకు మీ బలహీనత ఏమిటో చెప్పారన్న మాటే. మీ పిలక వారి చేతికి ఇచ్చారన్న మాటే.
**పిల్లల వల్ల తప్పు జరిగితే, ఇంట్లో అందరికీ తెలియాలి. దాని వల్ల, తండ్రి/తోబుట్టువుల దగ్గిర అవమానం అనే భావన వారిని తప్పు చేయకుండా ఆపుతుంది.
**అడ, మగ మధ్య స్నేహం తప్పు కాదు కానీ, ఎంత వరకు ఒక పరిధి లో ఉండాలి అనే విషయం మీ పిల్లలకు వివరంగా చెప్పండి.
**ఆడ, మగ మధ్య స్నేహం ఈ రోజుల్లో కల్చర్ అని మీరు అనుకుంటే మీరు చాల పొరబడ్డట్టే. కల్చర్ కి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటితే వచ్చే ఫలితాలు ఇద్దరూ సమానంగా అనుభవించాలి.
****పిల్లలూ, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీ తల్లి తండ్రులు ఎప్పుడూ మీ శత్రువులు కారు. మీ మంచి కోరేవారు మాత్రమే. మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎంత మంది ఉన్నా, తల్లితండ్రుల తర్వాతనే ఎవరైనా! మీ పేరెంట్స్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు అనేది మీ అభియోగం కావచ్చు. ముందు మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మేలా చూసుకోండి. మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉండాలి. మీరు ఎవరితో బయటికి వెళ్ళాలన్నా, ఎవరితో స్నేహం చేస్తున్న, తగిన కారణం మీరు చూపించ గలగాలి. అడ/మగ స్నేహలలో మీ ప్రవర్తన పట్ల మీ పేరెంట్స్ కు సందేహం ఉండకూడదు. వారిని కలవాలి అంటే, వారి ఇంట్లోనో, మీ ఇంట్లోనో కలవండి. మీ ప్రవర్తన పారదర్శకంగా ఉంటె, మీ తల్లితండ్రులు మిమ్మల్ని అనుమానించరు కదా!
****ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పి వెళ్ళండి. అదేమీ అవమానం కాదు. మీరు అనుమతి తీసుకునేది మీ తల్లి తండ్రుల దగ్గరే అనే విషయం గుర్తు పెట్టుకోండి.
****లేట్ నైట్ పార్టీలు avoid చేయండి.
****మీ ముఖ్యమైన స్నేహితుల ఫోన్ నంబర్లు ఇంట్లో వ్రాసి పెట్టి వెళ్ళండి.
****ఈనాటి పిల్లల ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే, మా అమ్మ/నాన్న మాటిమాటికీ ఫోన్ చేస్తారు. అందువల్ల మా ఫ్రెండ్స్ నన్ను వెక్కిరిస్తున్నారు అని. ఇందులో నామోషి పడవలసినది ఏమి లేదు. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని వెక్కిరిస్తే, మా అమ్మ/నాన్న లకు నాపై చాల ప్రేమ, చాల కేరింగ్ గా ఉంటారు వాళ్ళు అని సమర్ధించండి.
****ఒకవేళ ఆడ/మగ స్నేహితులు పార్టీలకు పిలిస్తే, వారిని ఇంటికి తీసుకువచ్చి మీ తల్లిదండ్రులకు పరిచయం చేయండి. వారికీ ఉన్న అనుభవం తో వారి ప్రవర్తన చూడగానే, వారు ఎటువంటి వారు అని చెప్పే నైపుణ్యం ఇంట్లో పెద్దలకు ఉంటుంది. మీ స్నేహాలను ఇంట్లో దాచే ప్రయత్నం చేయవద్దు.
****ఒకవేళ మీరు వెళ్ళిన పార్టీలో మీ స్నేహితులతో పాటు ఇంకా అపరిచితులు ఉంటె, వారి వివరాలు మీకు సంతృప్తి కలిగిస్తేనే, ఆ పార్టీ లో కంటిన్యూ అవ్వండి. వారు అనుమానితులు గా అనిపిస్తే, ఏమి పర్వాలేదు, పార్టీ నుంచి వెనక్కి వచ్చేయండి.
****తల్లి తండ్రులు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలనే. వారు కష్టపడేది మీ కోసమే. అటువంటి వారిని, చిన్న తనం నుంచి మిమ్మల్ని కళ్ళల్లో వత్తులు వేసుకొని, మీ ఆలనా పాలనా చూసిన వారిని మధ్యలో వచ్చిన స్నేహితుల కోసం మోసం చేయకండి. మీ భవిష్యత్ బాగుండాలి అంటే మీ ఆడ/మగ స్నేహితులతో కూడా మీరు నిజాయితీ గా , పారదర్శకంగా ఉండండి. స్నేహం పట్ల నిబద్దతో తో ఉండండి. అప్పుడు ఎవరికీ ఏ సమస్యలూ రావు.

No comments:
Post a Comment