ఒక మంచి పుస్తకం చదివినపుడు వచ్చే సంతృప్తిని మాటల్లో వర్ణించలేము. అన్ని చికాకులకూ, ఒంటరి తనానికీ చక్కటి పరిష్కారం మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకుని చదవడమే. మంచి పుస్తకం ఒక స్నేహితుని వంటిది అని ఎందుకు అంటారో, పుస్తక ప్రియులకే తెలుస్తుంది. చదివడం పూర్తీ అయిన తర్వాత కలిగే మాటలకు అందని ఆ అనుభూతి లో ఒకసంతోషం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన శక్తి తో శరీరం, మనసు, ఉరకలు వేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం పూర్తీ అయినపుడల్లా, కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మెదడులో కొత్త కొత్త కవాటాలు తెరుచుకుంటాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు పుస్తకాల తోనే తప్ప, మనుషులతో స్నేహం చేయలేరు అని చాల మంది అంటూ ఉంటారు. అది నిజమే నేమో! చక్కటి పుస్తకాలతో చేసే స్నేహం తో ఇహలోక విషయాల మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుది అని నా అభిప్రాయం. ఇంటా, బయటా, మనుషులలో, మనసులలో పేరుకుని ఉన్న కాలుష్యాల బారిన పడకుండా మనలను మనం రక్షించుకోవడానికి మన దగ్గర ఉన్న గొప్ప ఆయుధం "మంచి పుస్తకం". ఏమంటారు ఫ్రెండ్స్, మీకు నచ్చిన పుస్తకాల పేర్లు చెప్పండి. ఇక ముందు నేను చదవడానికి హెల్ప్ అవుతుంది.
No comments:
Post a Comment