Friday, 10 January 2014

4. వరుడు:

సామ్రాజ్నీ  శ్వశురేభవ , సామ్రాజ్ఞి స్వస్వ్రామ్భవ!
ననామ్దరి సామ్రాజ్నీఅధిదెవ్యషు.

మామ యందు, అత్తా యందు, ఆడబిడ్డల యందు, బావల యందు, మరదుల యందు సముచిత ప్రేమాభిమానములతో ఉండుము.

5. వరుడు:

స్నుషాణాగుమ్ స్వసురాణామ్ ప్రజాయాస్చ ధనస్యచ పతీనాంచ దెవ్రుణామ్ చ సజాతానాం విరాడ్ భవ.

తోడి కోడళ్ళను , అత్తమామలను, నీ సంతానాన్ని, సిరి సంపదలను, భర్త అయిన నన్ను, బావాను, మరదులను  మా వంశం లోని వారందరిని, అనేక విధముల పొషించుచు, అందరికి తలలో నాల్క వాలే మంచి పేరును సంపాదించుము.

6. వరుడు:

త్వష్టా జాయామజన యత్ త్వష్టా స్త్వేత్వాం పతితం, త్వష్టా సహస్ర మాయూగం షి దీర్ఘమాయు: క్రుణొతు హం.

ఓ మనసా! బ్రహ్మ ఈ వధువును నాకు భార్యగా సృష్టించెను. నన్ను ఈ కన్యకు భర్త గా సృష్టించెను. ఆ బ్రహ్మ దేవుడు మా ఇద్దరికీ సకల సంపదల నిచ్చి చిరాయువును కలిగించు గాక!

7. సుమన్గాలీరియం వదూరి మాగం సమేధ పశ్యత సౌభాగ్యం స్త్వేదత్వా యా థాస్తమ్ విపరేతన:

సుమంగళిగా చాల కాలముండు ఈ వధువును మీరందరూ వచ్చి చూచి, దీనికి ఆయుష్షును సౌభాగ్యమును ఇచ్చి మీ మీ ఇండ్లకు వేల్దురు గాక!

8. వధువు:

అవశ్యం త్వా మనసా చెకి తానం తపసోజాతం తపసో విభుతం ఇహా ప్రజా-- మిహరగం ర-రాణ: ప్రజాయస్వ ప్రజాయా పుత్రకామ!

నిన్ను నా అభిప్రాయము తెలిపిన వాని గాను , మంచి సంస్కారంతో పుట్టినవాని గాను, మంచి నియమాలతో పెంచుకొన్న తేజస్సు గల వానిగార్ను, నేను గ్రహించాను. ఓ సంతానాభిలాషి, నివు నాకు సంతానాన్ని కానీ, సిరి సంపదల నిచ్చి సుఖపడుము.

9. ఇద్దరు:

సమంజంతు విశ్వే దేవా సమాపో హృదయోనినౌ, సమాంత రిశ్వా సంధాతా సముదేష్టి రిదేశ్ను నో.

విశ్వా దేవులు, పవిత్రోదకాలు, వాయువు, బ్రహ్మ మన మనసులను ఎల్లప్పుడూ స్నేహంతో కుడునట్లు చేయుదురు గాక.  అనుకూలంగా మాట్లాడు కోనేతట్లు చూచెదరు గాక. !

No comments:

Post a Comment