Saturday 11 January 2014

 భారతీయ హిందూ వివాహం లో ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఘట్టము లోను వివాహముతో ముడిపడి యున్న అందరు అంటే వరుడు, వధువు, కన్యాదాత, వరుని పక్షము వారు ఎన్నో వేద మంత్రాల సహాయముతో ఈ తంతును జరిపిస్తారు. అయితే ఇక్కడ చదివే వన్నీ వేద మంత్రాలూ కాబట్టి అన్ని వేళల చదివడానికి పనికి రావు కాబట్టి కేవలం ఆ మంత్రాల అర్ధం మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. సభ్యులు సహకరించ ప్రార్ధన.

వివాహ ప్రశస్తి:

ప్రతి మానవుడు తనకు జన్మ నిచ్చిన తల్లి తండ్రులకు పుడుతూనే రుణ పడుతున్నాడు. ఆ రుణాన్ని తిర్చుకోవాలంటే తన వంశాన్ని నిలబెట్టి పితృదేవతలకు తృప్తి కలిగించాలి. అందుకోసం అన్ని విధాల తగిన కన్యను వివాహం ఆడాలి, ధర్మ వివాహం వల్ల పుట్టిన సంతానం మాత్రమే పితృదేవతలను తృప్తి పర్స్తుంది. వంశాన్ని నిలబెడుతుంది. మానవ జీవితంలో ఉన్న నాలుగు ఆశ్రమాలలో ( బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ) గృహస్తాశ్రమం అందరకు యోగ్యమైనది. గృహస్తుని ఆశ్రయించే మానవులందరూ జీవిస్తున్నారు.

గురుకులంలో విద్యాభ్యాసం ముగిసిన తర్వాత గురువు శిష్యునికి ఇంటికి వెళ్లి నీ వంశ పరంపరను నసిమ్పనీయకు, వివాహం చేసుకొనుము అని ఆజ్ఞాపిస్తాడు. మహాకవి కాళిదాసు కూడా రఘువంశం లో రాజులను " సంతానము " కొరకే వారు గృహస్తులు అగుచున్నారు అని, సంతాన ప్రాప్తి తరువాత వారికీ గృహస్థాశ్రమ ఆసక్తి లేదు అని వానప్రస్తులు అగుదురని చెప్పినాడు. ఈ విధంగా మానవ జీవితంలో సకల శ్రేయస్సులకు మూలభుతమైనది వివాహమే. ఇందులో అతిశయోక్తి ఏమి లేదు.

వివాహ సమయములో వధూవరుల చేత చెప్పిన్తే మంత్రాలను చుస్తే, మన ప్రాచినుల దూరదృష్టి, భావనా పటిమ మనకు ఆశ్చర్యం కలిగిస్త్రాయి. ఈ మంత్రాలకు అర్ధాలు తెలుసుకొంటే మూఢ సందేహాలు తొలగిపోయి ఆర్ష సంప్రదాయ తత్త్వం బోధపడుతుంది.

కాశి యాత్రకు వెళ్ళునపుడు బంగారు ఆభరణాలు ధరించడం ఎందుకు?

కాశి యాత్రకు వెళ్ళేటప్పుడు వరుడు కొన్ని మంత్రాలను చెప్తుతాడు. వాటి అర్ధం ఈ విధంగా ఉంటుంది.


ఆయుస్సును, వర్చస్సును, పుష్టిని, సంపదలను కలిగించు బంగారము తేజస్సును, జయమును కలిగించుట కొరకు నాయందు  ఉండు కాక. ఈ హిరణ్య ధారణ వలన నోరు సంవత్సరముల వరకు ఆయువు, మంచి రంగు, సంపద, జయము ధ్రుధత్వము కలిగించును గాక. నాకు దేవతలతోను రాజులతోను, లోక రక్షకుల తోను, ప్రియ సంబధం కలిగిన్పుము.

కన్యావరణ మందు చదివే మంత్రాలకు అర్ధాలు. :

వధూవరుల గోత్రాలు, ప్రవర తెలిల్పిన తరువాత వరుని తరపు వారు "ధర్మ సంతానము కొరకు ఈ కన్యను ఎన్నుకోన్నాము " అంటే, కన్యాదాత " ఎన్నుకొన్నారు కనుక ఇచ్చుచున్నాను " అని పలుకుతారు. వరుడు " శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ధర్మ ప్రజా సంపత్యర్ధం ఈమెను వివాహం చేసుకోనుచున్నాను. " అంటాడు. "సకల పాప నివృత్తి కొరకు, లక్ష్మి నారాయణుల ప్రీతీ కొరకు. అలంకారములతో, బంగారముతో కూడిన కన్యను దానము చేయుచున్నాను. " అని కన్యాదాత అంటాడు. మరియు" కొన్ని లక్షల సంవత్సరాలు బ్రహ్మ లోకములో ఉండేందుకు, నోరు విధములైన యజ్ఞములు, ఆచరించిన ఫలములు పొందుటకు, నా వెనుక పది తరముల వారు, ముందు పది తరముల వారు , పితరులు, ఉద్ధరిమ్పబడి శాశ్వత బ్రహ్మలోక నివాసము పొందుటకు, మా శాఖకు చెందినా ఆపస్తంబ సుత్రములందు చెప్పబడిన విధముగా ఈ కన్యను దానము చేయుదును అని పలుకును.

 (సశేషం )

No comments:

Post a Comment