Friday 10 January 2014

సప్తపది--మంత్రాలూ-- వాటి వివరణ...

భారతీయ వివాహ సంప్రదాయంలో వరుడు, వధువు కలిసి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, అప్పుడు మంత్రాలూ చెపుతారు కదా.... వాటికీ వివరణ ఇది....

1. వరుడు:

ఏకమి షే విష్ణు స్త్వాన్వేతు  ద్వే ఊర్జే విష్ణు స్త్వానేతు
త్ర్రేణి వ్రతాయ విష్ణు స్త్వానేతు చత్వారి మయోభవాయ విష్ణు స్త్వానేతు
పంచ పశుభ్యో విష్ణు స్త్వానేతు షడ్రుతుభ్యో విష్ణు స్త్వానేతు
సప్త భో హోత్రాభ్యో విష్ణు స్త్వానేతు

ఓ కన్యా! నీవు నా వెంట నడువుము. నివు వేసే మొదటి అడుగువల్ల విష్ణుమూర్తి అన్నాన్ని, రెండవ అడుగు వల్ల బలాన్ని, మూడవ అడుగు వల్ల మంచి కార్యాలను, నాల్గవ అడుగు వల్ల సౌఖ్యాన్ని, అయిదవ అడుగు వల్ల పశు సమృద్ధిని, అరవ అడుగు వల్ల రుతు సంపదలను, ఏడవ అడుగు వల్ల ఏడుగురు హోతలను నీకు ఇచ్చు గాక.

2. వరుడు:

సఖ సప్తడా భావ సఖా యొఉనప్త పదా భభూవ
సఖ్యం తే గమెయగమ్, సఖ్యాన్మే మాయోష్తః సమయావ: సంకల్పావహై:
సంప్రియో, రొచిష్ణు సుమనస్యమానౌ,
ఇశమోర్జమభి సంవసానౌ సంనౌ మనాంసి సంవ్రతా సాము చిత్తన్యాకరం.

నాతో ఏడడుగులు నడచి నాకు స్నేహితురలవు కమ్ము. ఏడడుగులు కూడా మనమిద్దరం నడిస్తే మనం స్నేహితులమవుతం. అప్పుడే నేను నీ స్నేహాన్ని పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎప్పుడు వియోగం పొందను. నా స్నేహన్నుంచి నీవెప్పుడు వ్యోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాని, బలాన్ని కలిసి పొందుతూ కలిసి ఉందాం. కలసి అలోచిన్చుకుందాం. అలాగే అన్ని నియమాలలోను బాహ్య ఇంద్రియాలు కూడా కలిసి ఉండేట్లు నడచుకుందాం.

3. వరుడు:

అరన్యమణమ్ సుదేవా కన్యా అగ్ని మయక్షత, స ఇమాం దేవో ఆధ్వర: ప్రేతో ముంచాతి నాముతస్సు బద్ధా మముతస్కరత్.

వెనుక స్త్రీలు అగ్ని దేవుని పూజించి కోరిన భర్తను పొందిరి. లోకోపకారి అయిన ఆ అగ్నిదేవుడు ఈ చిన్నదానికి వివాహమయిన తరువాత పుట్టింటి మీద మమకారం తగ్గించి అత్తింటి మీద విసేషానురాగం కల దానిగా చేయును గాక.....

(ఇంకా వుంది )

No comments:

Post a Comment