Sunday 5 January 2014

ఈరోజు చాలా విషాదంతో తెల్లారింది. నిజంగా ఇది "విషాద ఉదయం". సినీ నటుడు ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసి చాల బాధపడ్డాం. చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకోని జీవితం అంతం చేసుకున్నాడు. కారణాలు ఏమైనా ఒక మంచి నటుడిని, ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాము.

 ఈ మధ్య ఆత్మహత్యల వార్తలు బాగా వింటున్నాం. సమస్యలు అందరికి ఉంటాయి.. కానీ, ప్రతి వ్యక్తీ, తనకు మాత్రమే తిర్చలేనటువంటి సమస్యలు ఉన్నాయి, మిగిలిన వారు అందరు హాయిగా ఉన్నారు అని అనుకుంటారు. అది తప్పు .సమస్యలు లేనివాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒకరికి వారి స్థాయికి  తగ్గ సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలను ఎదుర్కోవడం లోనే మన ధైర్యం, నిబ్బరం తెలుస్తాయి. కొందరు అంటారు, మా కష్టాలు మీకేమి తెలుసు, మీకు వస్తే కానీ తెలియదు అని. కానీ కష్టాలు ఎవరికైనా ఒకటే.సాధారణంగా పరిష్కారం లేని సమస్యలు  ఉండవు. మనకి వచ్చే సమస్యలు అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

1. మొదటగా, మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. పాజిటివ్ గ ఆలోచించాలి. చెప్పడం తేలికే, పాటించడం కష్టం అనుకోకండి. సాధన చేస్తే సొంతం కానిది ఏది ఉండదు.

2. మనకు ఏదైనా కష్టం వచ్చినపుడు మనకన్నా ఇంకా బాధలు ఉన్న వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మన కష్టం చిన్నదిగా అనిపిస్తుంది.

3. కష్టం వచ్చినపుడు పంచుకునే తోడూ లేకపోతె మరీ ఒంటరిగా అనిపిస్తుంది. ఏదైనా విషయం పై మధన పడుతున్నపుడు మన మనసుకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తికి, (చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ) మనసు విప్పి బాధను చెప్పండి. కొంతమంది అంటారు--మన కష్టం ఇంకొకరికి చెప్పి వారిని కూడా బాధ పెట్టటం ఎందుకు అని-- ఇది చాల పిచ్చి భావన. కష్ట సుఖాలు షేర్ చేసుకోకపోతే స్నేహానికి అర్ధం లేదు.
,

4. కష్టం పంచుకున్నపుడు వారికీ తోచిన సలహాలు వారు ఇస్తారు. ఒక్కోసారి అందులో పరిష్కారం దొరకొచ్చు.

5. మనసుకు నచ్చిన వ్యక్తీ దగ్గర ఓదార్పు పొందినప్పుడు మనకు ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.

6. సాధారణంగా ఉద్యోగం రాలేదనో, చదువులో వెనక పడిపోతము అనో, చాలామంది భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ, న్యాయమైన సంపాదనకు ఉద్యోగమే కాదండీ, ఇంకా చాల రకాలుగా సంపాదించ వచ్చు. అలాగే చదువులో వెనక పడిపోతము అని భయపడద్డు. దేవుడు ఎంత మందబుద్ది కలవాడికైనా, ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. మనలో ఉన్న టాలెంట్ ని మనమే కనిపెట్టి ఆ దిశగా కృషి చేస్తే , అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

7. దిగులు ఎక్కువ అయి, మనలో మనం కలవర పడుతుంటే, దానికి కూడా ఒక చక్కని పరిష్కారం ఉంది. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశం లో ప్రవేశం లేదా ప్రావిణ్యం ఉంటుంది. ఏదో ఒక interest , వ్యాపకం తప్పకుండ ఉంటుంది. ఆ వ్యాపకం దిశగా మనం అడుగులు వేస్తె, మన దిగులు ను మనం మర్చిపోగలుగుతం.

8. అందరికి ఏవో ఆశయాలు తప్పకుండ ఉంటాయి. అవి నెరవేర్చుకోవటంలో విఫలం అయ్యాము అని depress అవుతారు. కానీ, ఒక్కటి ఆలోచించండి. బ్రతికి ఉండి  మన ఆశయాలు నెరవేర్చకపోతే, ప్రాణాలు పోయిన తరువాత ఏమి సాధిస్తాము?

9. సమస్యలు అనేవి, అర్దికమైనా, సామాజికమైనా, ఆరోగ్య పరమైనవి అయినా, అవేవి కుడా చావు కంటే పెద్దవి కావు అని గుర్తు పెట్టుకోవాలి.

10.  ఇలాంటి పరిస్తితులలో దేవుని మిద నమ్మకం చాల అద్భుతంగ పనిచేస్తుంది. అలా అని మళ్లీ దొంగ సాధువులు, బాబాల వద్దకు వెళ్లి మోసపోవద్దు. ఏదో ఒక వ్యక్తీ మిద కానీ, దేవుని మిద కనీ, నమ్మకం ఉంచుకోవటం వల్ల డిప్రెషన్ నుంచి బయట పడగలం.

11. అన్నిటి కన్నా ముందు ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు, మనకు జన్మ నిచ్చిన తల్ల్లిదండ్రులను, తోబుట్టువులను, మన మిద ఆధారపడి జీవిస్తున్న భార్యా పిల్లలను, మన ప్రాణంగా మెలిగే స్నేహితులు, శ్రేయోభిలాషులను ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. మనము లేకపోతే వారు ఎంత బాధపడతారు ఆలోచించండి.

    ఎవరో అన్నట్టు, ఆత్మహత్యకు పాల్పడేవారు--అతి పిరికి వాళ్ళు వాళ్లే, అతి ధైర్యవంతులు వాళ్లే.

No comments:

Post a Comment