Monday, 6 January 2014

లోకంలో శని అన్న పేరు వినగానే  అందరం భయపడతాము. నవ గ్రహాలలో ఒకడైన శనిని మనం భక్తీ పూర్వకంగా ఆరాధిస్తాము. సూర్యునికి, చాయకు పుట్టిన కుమారుడు శని. యముడు, యమునలకు అన్నగారు. యముడు, శని ఇద్దరూ కుడా జీవుల పాప పుణ్యాల ఫలితాలను ఇచ్చేవారే. యముడు జీవి చనిపోయిన తరువాత శిక్షిస్తే, శని జీవుడు బ్రతికి ఉండగానే పాపకర్మలకు తగిన శిక్ష ని వేస్తాడు. ఏలినాటి శని,  అర్దాష్తమ శని, అష్టమ శని రూపంలో ఈ శిక్షలు ఉంటాయి.  శని సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంత నెమ్మదిగా తిరుగుతుంది. అందుకనే ఈయనకు మంద గమనుడు అని ఇంకొక పేరు. ఈయన నల్లటి దేహం కలవాడు, నల్లని వస్త్రాలు ధరించిన వాడు, కాకి వాహనంగా కలవాడు. ఈయనకు నలుపు రంగు, నువ్వులు, అశుభ్రత, మందకొడి తనం.అంటే ప్రీతి.  అందుకే అశుభ్రం గ లేదా మందకొడిగా ఉన్నవాళ్ళ దగ్గర శని దేవుడు హాజరు అవుతాడు. కానీ నల్లటి వస్త్రం, నువ్వులు, నువ్వుల నునె సమర్పించిన వాళ్ళని అనుగ్రహిస్తాడు అంటారు. ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నయి. అవేమిటో చూద్దాం.:

1. ప్రతి శనివారము తలకు, ఒంటికి నువ్వుల నునె రాసుకుని స్నానం చేస్తే శని శాంతిస్తాడు.

2. శనివారం నాడు శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా మంచిదే.

3. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు, నునె, మినుములు దానం చేస్తే మంచిది.

4. దశరధ ప్రోక్త శని స్తోత్రం పఠించి, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి, ఒంటిపూట భోజనం చేయడం వలన శనిని శాంత పరచ వచ్చు.

5. శనివారం నాడు 8 మంది భిక్షకులకు, వికలాంగులకు సహాయం చేయడం, వస్త్రదానం చేయడం వలన శని దోషనివారణ జరుగుతుంది.

6. హనుమాన్ చాలిసా, దుర్గ స్తోత్రం, రామనామం జపించాలి.

7. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. కాళీ పూజ చేయాలి.

పైవాటిలో వీలు కుదిరినవి ఏవి పాటించినా, శని దేవుడు ప్రసన్నం అయి. మన బాధలు తగ్గిస్తాడు అని అంటారు. మన రాష్ట్రం లో మందపల్లి లో శని దేవుడికి గుడి ఉంది. దేశం మొత్తం మిద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మహారాష్ట్ర లోని షిర్డీ దగ్గరలో శని శింగనపుర్ ఈ మధ్య అందరికి పరిచయమైన శని క్షేత్రం.

   నీలాంజన సమాభాసం, రావిపుత్రం యమాగ్రజమ్,
   చాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ....

No comments:

Post a Comment